Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క క్రీమ్ రాసినా.. మీ అందం రెట్టింపు అవ్వడం పక్కా
అందంగా కనపడటానికి ఉదయం పూట స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో, రాత్రి పూట నైట్ టైమ్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వడం కూడా అంతే ముఖ్యం.

face cream
అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? రోజు రోజుకీ తమ అందం రెట్టింపు కావాలనే కోరుకుంటారు. దాని కోసం ఎవరికి వారు తమకు తోచిన ఏవేవో క్రీములు రాసేస్తూ ఉంటారు. కానీ, మార్కెట్లో దొరికే క్రీములు కాకుండా..సహజంగా దొరికే వాటిని వాడి కూడా మన అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా రెండు పదార్థాలతో తయారు చేసిన ఒక క్రీమ్ ని రాత్రి పూట ముఖానికి రాయడం వల్ల చర్మ సమస్యలు అన్నీ తగ్గి.. అందం రెట్టింపు అవుతుంది. మరి, అదేంటి? దానిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...
అందంగా కనపడటానికి ఉదయం పూట స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం ఎంత ముఖ్యమో, రాత్రి పూట నైట్ టైమ్ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వడం కూడా అంతే ముఖ్యం.
నైట్ క్రీమ్ ఎలా తయారు చేయాలి..?
మీరు నైట్ క్రీమ్ తయారు చేయడానికి మీకు కొబ్బరి నూనె, స్పటిక ఉంటే సరిపోతుంది. ఈ రెండూ మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి. ఈ రెండింటినీ కలిపి మంచి పేస్టులా తయారు చేయాలి. అంతే, నైట్ క్రీమ్ తయారైనట్లే.
ఈ నైట్ క్రీమ్ ఎలా ఉపయోగించాలి..?
ఈ నైట్ క్రీమ్ ఉపయోగించడానికి ముందు ముఖాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, అదేవిధంగా మెడకు అప్లై చేయాలి. ఒక ఐదు నిమిషాలు అలానే వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వరసగా 15 రోజులు ఈ క్రీమ్ రాస్తే.. మీ ముఖం అందంగా, మెరుస్తూ కనపడుతుంది.
కొబ్బరి నూనె ప్రయోజనాలు
కొబ్బరి నూనె చర్మాన్ని తేమ చేస్తుంది. ఈ కొబ్బరి నూనె రాయడం వల్ల చర్మం అందంగా మారుతుంది. మృదువుగా చేస్తుంది. చిన్న పిల్లల స్కిన్ లా స్మూత్ గా కనపడుతుంది.
స్పటిక ప్రయోజనాలు...
స్పటిక మనకు మార్కెట్లో సులభంగా లభిస్తుంది. దీని పొడిని మన చర్మానికి వాడటం వల్ల చర్మం అందంగా మారుతుంది. చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. దీని వల్ల యవ్వనంగా కనపడేలా చేస్తుంది. మొటిమల సమస్య ఉండదు. ఆల్రెడీ మొటిమలు ఉన్నా.. అవి కూడా పూర్తిగా మచ్చలతో సహా పోతుంది.
ఈ నైట్ క్రీమ్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
క్లీన్ ఫేస్: ఈ క్రీమ్ రాసే ముందు ముఖాన్ని సబ్బుతో కడగడం కాకుండా, మైల్డ్ క్లీన్సర్ లేదా రోస్ వాటర్ తో శుభ్రం చేయడం ఉత్తమం.
అలెర్జీ టెస్ట్: మీకు కొత్త పదార్థాలు అయితే, మొదట చేతిపై తక్కువ మొత్తంలో అప్లై చేసి, 24 గంటల తర్వాత సమస్యలేమీ లేనప్పుడు ముఖానికి వాడండి.
స్టోరేజ్: ఈ క్రీమ్‌ను గాజు సీసాలో స్టోర్ చేయండి. ఫ్రిడ్జ్‌లో నిల్వ చేస్తే ఎక్కువ రోజుల పాటు నాణ్యత కోల్పోదు.
కొబ్బరి నూనె ఎంపిక: వర్జిన్ కొబ్బరి నూనె (cold pressed) వాడటం ఉత్తమం. ప్రాసెస్ చేయని నూనె వాడటం ఉత్తమం.
మీ స్కిన్ టైప్ ఆధారంగా : ఆయిలీ స్కిన్ ఉన్నవారు కొబ్బరి నూనె కొద్దిగా మాత్రమే వాడాలి. డ్రై స్కిన్ ఉన్నవారికి ఇది ఎక్స్‌ట్రా మాయిశ్చరైజింగ్ లా పని చేస్తుంది.
స్పటికను మాస్క్‌గా వాడొచ్చా?
ఈ స్పటికను మనం ఫేస్ మాస్క్ గా కూడా వాడొచ్చు. స్పటిక పొడిని తులసి రసం లేదా రోజ్ వాటర్‌తో కలిపి మాస్క్ లా అప్లై చేసినా చర్మానికి మంచి ఫలితం వస్తుంది. ఇది మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి ఒక్కసారి ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఈ నైట్ క్రీమ్‌ను వరుసగా 15 రోజులపాటు వాడిన తర్వాత మీరు మీ ముఖంలో తేడా గమనించగలుగుతారు. ప్రకృతి లో భాగమైన ఈ పదార్థాలతో మీరు అందాన్ని మెరుగు పరచుకోవచ్చు. ఖరీదైన ప్రాడక్ట్స్ అవసరం లేకుండా, ఇంట్లోనే అందాన్ని సంరక్షించుకోవచ్చు.