Hair Care: ఈ ఒక్కటి రాసినా.. జుట్టు ఒత్తుగా, పట్టుకుచ్చులా మారడం పక్కా..!
మార్కెట్లో లభించే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తాయి. అలా కాకుండా.. మీరు పెరుగు , కలబంద లను వాడి మీ జుట్టును మృదువుగా, ఒత్తుగా మార్చుకోవచ్చు.

Hair Care
ఈ రోజుల్లో జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.జుట్టు విపరీతంగా రాలిపోవడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం, మెరుపు కోల్పోవడం వంటి సమస్యలు కామన్ అయిపోయాయి. దీని కోసం మార్కెట్లో దొరికే ఏవేవో నూనెలు, షాంపూలు వాడేవారు చాలా మంది ఉంటారు. అవి వాడినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే... కేవలం ఒకే ఒక్క హెయిర్ మాస్క్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
మార్కెట్లో లభించే ఉత్పత్తుల్లో ఉండే రసాయనాలు జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేసేస్తాయి. అలా కాకుండా.. మీరు పెరుగు , కలబంద లను వాడి మీ జుట్టును మృదువుగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. కలబంద, పెరుగు కలిపిన హెయిర్ మాస్క్ రాయడం వల్ల జుట్టు చాలా అందంగా మారుతుంది. ఎందుకంటే.. ఈ రెండింటిలో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, హైడ్రేటింగ్ ఎంజైమ్లు మీ జుట్టుకు మంచి పోషణ అందిస్తాయి.
పెరుగు, కలబంద హెయిర్ మాస్క్ తో ప్రయోజనాలు..
కలబంద మన జుట్టుకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. హెయిర్ డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది. ఇక పెరుగు జుట్టును బలంగా మారుతుంది. ఈ రెండింటిని కలిపి రాయడం వల్ల జుట్టు చిక్కులు పడవు. స్మూత్ గా... మెరుస్తూ కనపడేలా చేస్తుంది.
హెయిర్ మాస్క్ తయారీకి కావాల్సినవి...
2 టేబుల్ స్పూన్లు తాజా కలబంద జెల్ (మీరు డైరెక్ట్ గా కలబంద ఆకుల నుంచి తీసుకోవచ్చు. లేదా మార్కెట్లో దొరికేది అయినా వాడొచ్చు)
3 టేబుల్ స్పూన్లు మందపాటి, తియ్యని పెరుగు
1 టేబుల్ స్పూన్ కొబ్బరి లేదా ఆలివ్ నూనె
1 టీస్పూన్ తేనె
హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి..?
పెరుగు, కలబంద హెయిర్ మాస్క్‌ను జుట్టుకు ఎలా అప్లై చేయాలి..?
ఒక గిన్నెలో పెరుగును తీసుకొని దానిని చిక్కని పేస్టులాగా చేసుకోవాలి. దీనికి కలబంద జెల్ వేసి క్రీమీ పేస్ట్ తయారు చేయండి.కావాలనుకుంటే, నూనె , తేనె కూడా జోడించండి. ఆ తర్వాత మరింత బాగా కలపాలి.
హెయిర్ ప్యాక్ వేయడానికి సరైన మార్గం ఏమిటి?
ముందుగా మీ జుట్టు నుంచి చిక్కులు మొత్తం తీసేయాలి. మంచిగా దువ్వుకోవాలి. ఆ తర్వాత ఈ హెయిర్ ప్యాక్ ని తల నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి. బ్రష్ లేదా.. చేతులతో అప్లై చేయవచ్చు. ఆ తర్వాత పది నుంచి 15 నిమిషాల పాటు తలకు మంచిగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక అరగంట వరకు షవర్ క్యాప్ పెట్టాలి.
హెయిర్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఏమి చేయాలి?
ఈ హెయిర్ ప్యాక్ ని తలకు బాగా పట్టించిన తర్వాత కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు తలకు ఉంచాలి. కాసేపు తలంతా చల్లగా ఉంటుంది. మీరు కావాలంటే.. హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత వేడి టవల్ అయినా చుట్టవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ ప్యాక్ పనితీరు మరింత పెరుగుతుంది. 30 నిమిషాల తర్వాత.. గోరు వెచ్చని నీటితో తలస్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానానికి వాడే షాంపూ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సల్ఫేట్ లేని షాంపూని ఎంచుకోవడం ఉత్తమం. ఈ హెయిర్ ప్యాక్ వాడితే.. మళ్లీ స్పెషల్ గా కండిషనర్ వాడాల్సిన అవసరం లేదు. ఈ కలబంద, పెరుగు మంచి కండిషనర్ లా పని చేస్తుంది.
వారానికి ఎన్నిసార్లు హెయిర్ ప్యాక్ వాడాలి?
వారానికి ఒకసారి ప్యాక్ వేయండి. ఈ ప్యాక్ వేసవి , శీతాకాలంలో జుట్టుకు అదనపు సంరక్షణను అందిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం, జుట్టు చిట్లడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి. రెగ్యులర్ గా రాయడం వల్ల జుట్టు అందంగా, మెరిసేలా చేస్తుంది.