Hair Care: ఈ ఒక్క ఆకు వాడినా జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా..!
ఇప్పటి వరకు కొబ్బరి నూనె, కలబంద, పెరుగు ఇలాంటివి అన్నీ.. మీరు మీ జుట్టుకు వాడి ఉంటారు.. కానీ.. వాటన్నింటినీ మించిన అందం జుట్టుకు ఈ జామాకులు ఇస్తాయి.

ఒత్తైన జుట్టు కావాలంటే..
ప్రతి ఒక్కరూ నల్లగా, ఒత్తుగా ఉండే జుట్టు కావాలని కోరుకుంటారు. కానీ, సరైన ఆహారం తీసుకోకపోవడం, మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం, కాలుష్యం ఇలా చాలా కారణాల వల్ల జుట్టు రాలే సమస్యలు ఎదురౌతూ ఉంటాయి. వీటి కారణంగా.. చాలా మంది జుట్టు నిర్జీవంగా మారుతుంది. పొడిగా మారిపోయింది. దీని వల్ల జుట్టు అందగా కనిపించదు. అలాంటివారు కేవలం ఒకే ఒక ఆకు వాడితే ఈ సమస్యలన్నింటినీ చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా? అవి మరేంటో కాదు.. జామ ఆకులు
మీరు చదివింది నిజమే... జామ ఆకులు మన జుట్టును అందంగా మార్చడానికి ఉపయోగపడతాయట. ఇప్పటి వరకు కొబ్బరి నూనె, కలబంద, పెరుగు ఇలాంటివి అన్నీ.. మీరు మీ జుట్టుకు వాడి ఉంటారు.. కానీ.. వాటన్నింటినీ మించిన అందం జుట్టుకు ఈ జామాకులు ఇస్తాయి.
జుట్టు పెరుగుదలకు జామ ఆకులు ఎలా ఉపయోగపడతాయి?
జామ పండ్ల మాదిరిగానే, జామ ఆకులలో విటమిన్ బి, విటమిన సి కూడా పుష్కలంగా ఉంటాయి. వాటి ఉపయోగం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే, కొల్లాజెన్ పనితీరును పెంచడంలో సహాయపడతాయి. జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉన్నప్పుడు జామ ఆకులను ఉపయోగించడం వల్ల.. జుట్టు రాలడం వెంటనే తగ్గుతుంది. ఇది జుట్టు మూలాలను కూడా పోషిస్తుంది. ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుంది.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జామ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. జామ ఆకులు తల నుండి మురికి , ధూళిని తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, వాటిలో కనిపించే యాంటీ ఫంగల్ లక్షణాలు తలపై బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. ఈ విషయాన్ని రీసెర్చ్ గేట్ కూడా ధ్రువీకరించింది.
ఈ ఆకులలో లైకోపీన్ అనే మూలకం కూడా కనిపిస్తుంది, ఇది సూర్యుని అతినీలలోహిత కిరణాల నుండి జుట్టును రక్షిస్తుంది. జుట్టు సంరక్షణ కోసం జామ ఆకులను ఉపయోగించడం చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను ఇస్తుంది.ఈ విషయాన్ని National Library of Medicine( నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్) కూడా ధ్రువీకరించింది.
జుట్టుకు జామ ఆకులను ఉపయోగించే మార్గాలు..
15-20 జామ ఆకులను లోతైన పాత్రలో తీసుకొని నీటిలో ఉడకబెట్టండి. ఈ నీటిని కనీసం 20 నిమిషాలు మరిగించనివ్వండి. దాని రంగు ముదురు రంగులోకి మారడం ప్రారంభించిన తర్వాత , మిశ్రమం బాగా మరిగించడం ప్రారంభించిన తర్వాత, గ్యాస్‌ను ఆపివేయండి. దీని తర్వాత, ఈ మిశ్రమాన్ని చల్లబరచడానికి పక్కన పెట్టండి. దీని తర్వాత, ఈ మిశ్రమాన్ని జుట్టుపై సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా అప్లై చేయండి. మిశ్రమాన్ని మసాజ్ చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు కు మంచి పోషణ అందిస్తుంది.
శాస్త్రీయ ధృవీకరణ:
కొన్ని పబ్లిష్డ్ రీసెర్చ్ల ప్రకారం, జామ ఆకుల ఎక్స్ట్రాక్ట్లో ఉండే ఫెనాలిక్ పదార్థాలు (కాటెకిన్స్, గాలిక్ ఆసిడ్, క్వెర్సెటిన్) జుట్టు పెరుగుదల న్యూక్లియర్ గుణాల్లో సహాయపడతాయి. ఇవి 5-అల్ఫా రెడక్టేజ్ సోప్రెస్ చేసి, హెయిర్ ఫాలికల్ అండోజెన్రిక చర్యలను తగ్గిస్తాయి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుందని నిర్థారణ అయ్యింది.
గమనిక: ఇది ప్రజల అనుభవాల ఆధారంగా, పలు అధ్యయనాలకు అనుగుణంగా అందిన సమాచారం. కొత్తవి ఏవైనా ప్రయత్నించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది.