Hair Fall: ఆలివ్ నూనెలో ఇవి కలిపి రాస్తే...ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
Hair Fall : ఆలివ్ నూనె వంటకు మాత్రమే కాదు.. జుట్టు అందాన్ని కూడా పెంచడంలో సహాయం చేస్తుంది. ఈ నూనె కొంచెం ఖరీదు అయినప్పటికీ.. ఆరోగ్యానికీ, జుట్టు సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది..

Hair Fall
ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.ఈ జుట్టురాలే సమస్య తగ్గించడానికి చాలా మంది ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఏవేవో షాంపూలు, నూనెలు కొనేసి వాడేస్తూ ఉంటారు. లేదంటే.. ఖరీదైన ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అయితే.. కొందరు పెద్దగా జుట్టు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా జుట్టు బాగా పెరుగుతుంది. అది వారికి దక్కిన వరం. కానీ, కొందరు పాపం ఎంత కష్టపడినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు బాగా రాలిపోతుంది. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం, ఒత్తిడి, కాలుష్యం, ఉపయోగించే రసాయనాలు ఉండే ఉత్పత్తులు వాడటం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలిపోవచ్చు. అందుకే, ఈ సమస్య నుంచి బయటపడాలంటే... ఆలివ్ నూనె వాడితే సరిపోతుంది. వేటితో కలిపి ఈ నూనెను జుట్టుకు వాడాలో? ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...
జుట్టు అందాన్ని పెంచే ఆలివ్ నూనె...
జుట్టు అందాన్ని పెంచడంలో ఆలివ్ నూనె చాలా గొప్పగా పని చేస్తుంది. ఈ ఆలివ్ నూనెలో మన జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె జుట్టు మూలాల్లోకి చొచ్చుకుపోయి.. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.ఈ నూనె రాయడం వల్ల జుట్టుకు మంచి పోషణ అందడమే కాకుండా, మంచి తేమను కూడా అందిస్తుంది. జుట్టును మృదువుగా, బలంగా, మెరిచేలా మారుస్తుంది. ముఖ్యంగా, ఈ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు తలకు రక్త ప్రసరణను పెంచి, జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందించి, జుట్టు రాలడం సమస్యను తొలగిస్తాయి.
మీ జుట్టుకు ఆలివ్ నూనె రాసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
జుట్టు మూలాలను బలపరుస్తుంది - ఆలివ్ నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి జుట్టు మూలాలను బలపరుస్తాయి. ఇది సహజమైన హెయిర్ కండీషనర్, ఇది జుట్టును మృదువుగా , ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. చుండ్రు, జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది - ఆలివ్ ఆయిల్ జుట్టు తేమను నిలుపుకునే సామర్థ్యం కారణంగా పొడిబారడం, చుండ్రును తగ్గిస్తుంది.
జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది - ప్రతిరోజూ ఆలివ్ నూనెతో జుట్టుకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. జుట్టు కూడా చాలా మృదువుగా మారుతుంది.సహంగా మెరిసేలా చేస్తుంది.
ఆలివ్ నూనెను ఎలా ఉపయోగించాలి?
మీ జుట్టుకు ఆలివ్ నూనెను పూయడం చాలా సులభం. 2-3 టీస్పూన్ల ఆలివ్ నూనెను తీసుకొని కొద్దిగా వేడి చేయండి. నూనెను మీ నెత్తికి సమానంగా అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత, కనీసం 30 నిమిషాలు అలాగే ఉంచండి.తర్వాత, మీ జుట్టును షాంపూతో కడగాలి. మీరు దీన్ని వారానికి 1-2 సార్లు ఉపయోగించవచ్చు. మీకు కావాలంటే, మీరు ఆలివ్ నూనెను కలబంద జెల్, కొబ్బరి నూనె లేదా కాస్టర్ ఆయిల్‌తో కలపవచ్చు.
ఆలివ్ నూనె- కోడి గుడ్డు హెయిర్ మాస్క్...
ఆలివ్ నూనె, కోడి గుడ్డుతో జుట్టుకు మంచి హెయిర్ మాస్క్ గా వాడొచ్చు. దీని వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.
దీని కోసం, గుడ్డు పచ్చసొనను ఆలివ్ నూనెతో కలిపి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టు పొడవునా అప్లై చేసి, కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి, తరువాత ఎప్పటిలాగే షాంపూ చేయండి. ఇలా చేస్తే జుట్టు అందంగా, మెరుస్తూ కనపడుతుంది.
