Face Glow: పది నిమిషాల్లో ముఖం మెరిసిపోవాలా.. ఈ ఫేస్ ప్యాక్ వాడితే చాలు
Face Glow: చలికాలంలో కేవలం పదే పది నిమిషాల్లో ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు. దాని కోసం, బంతిపూల ఫేస్ ప్యాక్ వాడితే సరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్.. మీ చర్మాన్ని తేమగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.

Flower Face pack
మనకు ప్రతి సీజన్ లో బంతి పూలు చాలా సులభంగా లభిస్తాయి. ఈ పూలను దాదాపు అందరూ ఇంటి అలంకరణలో వాడుతూ ఉంటారు. ఈ బంతి పూలు మన అందాన్ని పెంచడంలోనూ సహాయపడతాయి. ఈ పూలలో చాలా ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసి ముఖానికి రాస్తే...కేవలం పది నిమిషాల్లో బంగారు వర్ణంతో మెరిసిపోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం....
మెరిసే చర్మం కోసం...
చలికాలంలో పొడి చర్మం సమస్యతో బాధపడుతున్నవారు ఈ బంతి పూల ఫేస్ ప్యాక్ తో చెక్ పెట్టొచ్చు. దీని కోసం... బాదం నూనె, బంతిపూలు ఉంటే చాలు. ముందుగా గాజు సీసాలో బాదం నూనె పోయాలి. ఈ నూనెలో బంతి పూల రెక్కలను వేసి మునిగేలా వేయాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 15 రోజుల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల.. ఆ నూనెలో బంతి పువ్వు రసం బాగా దిగుతుంది. తర్వాత ఈ నూనెను ఓ వస్త్రంతో దీనిని వడగొట్టాలి. ఈ నూనెను ప్రతిరోజూ ముఖానికి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పొడి చర్మం సమస్య ఉండదు. ముఖం మృదువుగా మారుతుంది.
బంతిపూల ఫేస్ ప్యాక్....
అప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలి అనుకున్నప్పుడు వెంటనే మెరిసిపోవాలి అనుకుంటే... ఈ బంతి పూల ఫేస్ ప్యాక్ వాడొచ్చు. దీని కోసం బంతి పూల రేకులు అర కప్పు తీసుకోవాలి. రోజ్ వాటర్ 5 టేబుల్ స్పూన్లు, తొక్క తీసిన యాపిల్ ముక్కలు ఉంటే చాలు. వీటన్నింటినీ సమపాళ్లలో తీసుకొని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ తయారు చేసిన పేస్టును మీ ముఖానికి సమానంగా అప్లై చేసుకోవాలి. మాస్క్ ను కనీసం 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మీ ముఖాన్ని నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ని వారానికి రెండుసార్లు రాసినా..ముఖం అందంగా మెరుస్తూ కనపడుతుంది

