MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • ఒరిజినల్ పట్టు చీరలను కొనాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే

ఒరిజినల్ పట్టు చీరలను కొనాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే

పెళ్లిళ్లు, పంక్షన్ లకు, పండుగలకు చాలా మంది పట్టు చీరలనే కట్టుకుంటుంటారు. అందుకే ఆడవాళ్లు పట్టుచీరలనే ఎక్కువగా కొంటుంటారు. కానీ మనం కొనే పట్టు చీర ఒరిజినలా? కాదా? అన్న సంగతి మాత్రం తెలియదు. అసలు పట్టుచీరను ఎలా గుర్తించాలో ఓ లుక్కేద్దాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 22 2025, 02:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒరిజినల్ పట్టుచీర
Image Credit : stockPhoto

ఒరిజినల్ పట్టుచీర

బనారస్ చీరలను ఆడవాళ్లు ఎంతో ఇష్టంగా కొంటుంటారు. కానీ అది అసలైన పట్టుచీరనో? కాదో? మాత్రం చాలా మందికి తెలియదు. బనారస్ పట్టు చీరలు స్వచ్ఛమైనవో కావో చెప్పడానికి దారం చూసే సరిపోతుంది. అవును ఒరిజినల్ పట్టుచీరలను స్వచ్ఛమైన మల్బరీ పట్టు దారంతో నేస్తారు. ఈ మల్బరీ పట్టు మెరుస్తూ, స్మూత్ గా ఉంటుంది. స్వచ్ఛమైన పట్టుకు దాని సహజమైన మెరుపు ఉంటుంది. ఇది నునుపుగా,  మృదువుగా ఉంటుంది. 

మీరు కొన్న పట్టు చీర ఒరిజినలో కాదో తెలుసుకోవడానికి చీర నుండి ఒక చిన్న దారాన్ని  తీయండి. దీన్ని కాల్చితే జుట్టు కాలిన వాసన వస్తే అది స్వచ్ఛమైన పట్టు అని అర్థం చేసుకోండి. అదే ప్లాస్టిక్ కాలిన వాసన వస్తే కృత్రిమ పట్టు అని అర్థం చేసుకోండి.

మీరు పట్టు చీరను కొనాలనుకుంటే భారత ప్రభుత్వ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉన్న చీరలను కొనండి. ఇవి స్వచ్ఛమైన పట్టుచీరలు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఒరిజినల్ పట్టుచీరలు
Image Credit : stockPhoto

ఒరిజినల్ పట్టుచీరలు

బనారస్ పట్టు చీరలను జరీ వర్క్ తో తయారుచేస్తారు. ఈ జరీ వర్క్ ను వెండి లేదా బంగారు దారాలతో నేస్తారు. అసలైన పట్టు చీరలకు వాడే జరీ, స్వచ్ఛమైన వెండి దారాల మీద బంగారు పూత ఉంటుంది. ఇలా కూడా మీరు అసలైన పట్టు చీరలను గుర్తించొచ్చు. చౌక చీరలకు రోమన్ జరీ లేదా కృత్రిమ జరీ ని ఉపయోగిస్తారు.మీరు కొన్ని స్వచ్ఛమైన పట్టుచీర జరీ దట్టంగా,  కళాత్మకంగా ఉందో లేదో చెక్ చేయండి.అయితే అసలైన పట్టు  చీరలకు ముందు, వెనుక భాగంలో ఒకే డిజైన్ కనిపిస్తుంది. 

35
అసలైన పట్టు చీర
Image Credit : stockPhoto

అసలైన పట్టు చీర

బనారస్ చీరలను చేనేత టెక్నిక్ తో తయారుచేస్తారు. అంటే చీరపై నేరుగా డిజైన్ ను నేస్తారు. అదే మగ్గంలో అయితే మెషిన్ వర్క్ లా నీట్ గా కాకుండా చేతితో నేసినట్టుగా ఉంటుంది. ఒరిజినల్ బనారస్ చీరలను "జాక్వర్డ్" మగ్గం  డిజైన్లు ఉంటాయి. ఇవి ఎక్కువగా చీరల అంచు, ముందు భాగంలో కనిపిస్తాయి. 

45
ఒరిజినల్ పట్టు చీరలు
Image Credit : stockPhoto

ఒరిజినల్ పట్టు చీరలు

ఒరిజినల్ పట్టు చీరలు వేరే పట్టు చీరల కంటే కొంచెం బరువుగా ఉంటాయి. దీనికి దట్టమైన జరీ వర్క్ యే కారణం. 

చీరను చేతితో పట్టుకుని చూడండి. ఇది బరువుగా ఉంటే జరీని ఎక్కువగా ఉపయోగించినట్టు అర్థం. ఒరిజినల్ కానీ పట్టు చీరలు పలుచగా ఉంటాయి. తక్కువ బరువుగా ఉంటాయి. 

55
ఒరిజినల్ పట్టు
Image Credit : stockPhoto

ఒరిజినల్ పట్టు

ఒరిజినల్ పట్టు చీరలను తయారుచేయడానికి మంచి నైపుణ్యం, నాణ్యమైన ముడి పదార్థాలు అవసరమవుతాయి. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధర చీరలు కల్తీవి లేదా కృత్రిమ పట్టుతో తయారుచేయబడినవి. అందుకే నమ్మదగిన షాపుల్లోనే కొనాలి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
మహిళలు
జీవనశైలి
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved