Beauty Care: షేవింగ్ చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా?
అందంగా కనిపించడానికి మనలో చాలా మంది చాలా పనులు చేస్తూ ఉంటాం. కానీ, ఆ విషయంలోనూ చాలా అపోహలు ఉంటాయి. కొన్ని బ్యూటీ రెమిడీస్ ఫాలో అవ్వడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అని చాలా మంది భయపెడుతూ ఉంటారు. వాటిలో నిజం ఎంత? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

ప్రతి అమ్మాయి అందమైన , ఆరోగ్యకరమైన స్కిన్ కావాలని కోరుకుంటుంది. అలా అందంగా కనిపించడానికి చాలా మంది తమకు తెలిసిన పనులు ఏవేవో చేస్తూ ఉంటారు. అలా మనం ఫాలో అయ్యే వాటిల్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. చేతులు, కాళ్లు, అండర్ ఆర్మ్స్ షేవ్ చేస్తే.. అక్కడ హెయిర్ మరింత వేగంగా పెరుగుతుందని, మొటిమలు కేవలం టీనేజ్ లో మాత్రమే వస్తాయి అని ఇలా మంది చెబుతుంటారు. కానీ, అవి నిజమేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? అసలు నిజం ఏది? అపోహలు ఏంటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..
స్కిన్ ప్రొడక్ట్స్..
స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు చాలా మంది చాలా రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటిని వాడినప్పుడు స్కిన్ పై ఏదైనా దురద, మంట వస్తేనే అది చాలా ప్రభావవంతంగా పని చేసినట్లు అని చాలా మంది నమ్ముతారు. కానీ, అది అపోహ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. నిజంగా అలా మంట, దురద వచ్చింది అంటే, అలాంటి వాటిని మనం వాడకూదడదు. మన స్కిన్ పై అలా సెన్సేషన్ ఏమీ లేకుండా హాయిగా ఉండే ఉత్పత్తులను మాత్రమే వాడాలి.
ఒక్కోసారి ఎక్కువ నిద్రపోయినా, లేక నిద్ర తక్కువైనా ా చాలా మంది ముఖం, కళ్లు వాచిపోతూ ఉంటాయి. అలా అయినప్పుడు కళ్లను రుద్దడం వల్ల.. ఆ వాపు తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ, అలా చేయడం వల్ల వాపు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. చర్మంలోని సున్నితమైన రక్త నాళాలను విచ్ఛిన్నం చేసి వాపు పెంచుతుంది. బదులుగా.. ఏవైనా చల్లటి క్లాత్ లేదంటే, ఐస్ క్యూబ్ ని ఓ క్లాత్ లో పెట్టి, కంటిపై ఉంచుకోవాలి.
మొటిమలు కేవలం టీనేజ్‌లోనే వస్తాయా?
మొటిమలు కేవలం కౌమారదశలోనే వస్తాయనేది తప్పుడు భావన. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తుల వల్ల పెద్దవారిలో కూడా మొటిమలు రావచ్చు. అందువల్ల, అన్ని వయసుల వారు తమ చర్మ సంరక్షణపై శ్రద్ధ వహించాలి.
వెంట్రుకలను సహజంగా ఆరనివ్వడం మంచిదా?
వెంట్రుకలను గాలిలో ఆరనివ్వడం వల్ల, జుట్టు ఆరోగ్యంగా ఉంచుతుందని భావించడం ఒక అపోహ. నిజానికి, తడి వెంట్రుకలు మరింత సున్నితంగా ఉంటాయి, ఎక్కువసేపు తడిగా ఉండటం వల్ల అవి బలహీనపడతాయి. తక్కువ ఉష్ణోగ్రత వద్ద హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించడం, అలాగే హీట్ ప్రొటెక్టెంట్‌ను ఉపయోగించడం వెంట్రుకలకు మరింత సురక్షితం.
షేవింగ్ వల్ల వెంట్రుకలు మందంగా, నల్లగా అవుతాయా?
షేవింగ్ వల్ల వెంట్రుకలు మందంగా, నల్లగా అవుతాయనేది ఒక సాధారణ అపోహ. నిజానికి షేవింగ్ వెంట్రుకలను ఉపరితలం నుండి మాత్రమే కత్తిరిస్తుంది, వెంట్రుకల మందం లేదా రంగుపై ఎలాంటి ప్రభావం చూపదు. వెంట్రుకల ఆకృతి, రంగు జన్యుపరమైనవి.