Telugu

వేసవిలో వర్షం పడుతున్నప్పడు చర్మ రక్షణ కోసం 7 బ్యూటీ టిప్స్

Telugu

మైల్డ్ ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోండి

వర్షాకాలంలో చర్మంపై మురికి, తేమ కారణంగా చెమట, నూనె పేరుకుపోతాయి. రోజుకి రెండుసార్లు మైల్డ్ ఫేస్ వాష్ తో ముఖం కడుక్కోవాలి.

Telugu

ఎక్స్‌ఫోలియేట్ చేయండి

వారానికి రెండుసార్లు స్క్రబ్ చేయడం వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. అయితే ఎక్కువగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం మంచిది కాదు.

Telugu

టోనర్ వాడండి

వర్షాకాలంలో ఓపెన్ పోర్స్ అందరికీ వచ్చే సాధారణ సమస్యే. కలబంద లేదా గులాబీ నీరు వంటి సహజ టోనర్‌లను వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది.

Telugu

ఆయిల్ లేని మాయిశ్చరైజర్ వాడండి

వాతావరణం తేమగా ఉన్నా, చర్మానికి తేమ అవసరం. అందువల్ల ఆయిల్ లేని మాయిశ్చరైజర్ వాడండి.

Telugu

సన్‌స్క్రీన్ వాడటం మర్చిపోవద్దు

వర్షాకాలంలో కూడా UV కిరణాలు మీ చర్మానికి హాని కలిగిస్తాయి. కనీసం SPF 30 ఉన్న సన్‌స్క్రీన్ అయినా వాడండి.

Telugu

తేలికపాటి మేకప్ వేసుకోండి

వర్షాకాలంలో హెవీ ఫౌండేషన్, ఆయిలీ ప్రొడక్ట్స్ వల్ల మొటిమలు పెరుగుతాయి. తేలికపాటి మేకప్ వేసుకుంటే చాలా అందంగా ఉంటారు.

Telugu

రాత్రిపూట చర్మ సంరక్షణ

రాత్రి పడుకునే ముందు చర్మాన్ని శుభ్రం చేసి, తేలికపాటి నైట్ క్రీమ్ లేదా సీరం రాసి శుభ్రం చేసుకొని పడుకోండి. ఉదయానికి మెరిసిపోతుంది.

బంగారాన్ని తలదన్నేలా హెవీ ఫ్యాన్సీ జుంకాలు

Gold: నడుము అందాన్ని పెంచే హిప్ చైన్స్

అనుష్క శర్మ బ్యూటీ సీక్రెట్ఇదే

Gold: బడ్జెట్ ధరకే వావ్ అనిపించే బంగారు ఉంగరాలు