- Home
- Technology
- Tips
- Gas Burner Cleaning Tips: ఈ చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్లను ఈజీగా క్లీన్ చేయచ్చు!
Gas Burner Cleaning Tips: ఈ చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్లను ఈజీగా క్లీన్ చేయచ్చు!
గ్యాస్ స్టవ్ బర్నర్లు మూసుకుపోతే సరిగ్గా వెలగవు. దీనివల్ల వంట చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. గ్యాస్ కూడా వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో గ్యాస్ స్టవ్ బర్నర్లను ఈజీగా క్లీన్ చేయచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
గ్యాస్ స్టవ్ బర్నర్లను శుభ్రం చేసే చిట్కాలు
గ్యాస్ స్టవ్ బర్నర్లపై మురికి, నూనె మరకలు పేరుకుపోయినప్పుడు అవి మూసుకుపోయి.. గ్యాస్ సరిగ్గా రాదు. దీనివల్ల వంట తొందరగా పూర్తిచేయలేము. గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చవుతుంది. అయితే బర్నర్లను తరచుగా క్లీన్ చేయడం ద్వారా వంట పని త్వరగా పూర్తవడమే కాదు.. గ్యాస్ ని కూడా ఆదా చేయవచ్చు. గ్యాస్ బర్నర్లను ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఇక్కడ చూద్దాం.
ఈనోతో ఇలా చేయండి..
బర్నర్లు మూసుకుపోవడానికి ప్రధానం కారణం.. వాటిపై పేరుకుపోయే నూనె మరకలే. నూనె మరకలను తొలగిస్తే సగం సమస్య తీరిపోతుంది. ఇందుకోసం ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో గ్యాస్ బర్నర్లను ఉంచి.. అందులో మరిగే నీళ్లు పోయాలి. అందులో కొద్దిగా నిమ్మరసం, ఈనో కలపాలి. దీనివల్ల నీరు బాగా పొంగుతుంది. ఈ మిశ్రమంలో రాత్రంతా బర్నర్లను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి మురికి, నూనె మరకలు తొలగిపోతాయి.
వెనిగర్‌తో శుభ్రం చేసే విధానం..
ఒక పాత్రలో కొంచెం వేడి నీళ్లు పోసి, వెనిగర్ వేయాలి. అందులో బర్నర్లను వేయాలి. ఒక గంట తర్వాత బర్నర్లను బయటకు తీసి.. చింతపండుతో బర్నర్లను రుద్దాలి. దీనివల్ల మురికి సులభంగా తొలగిపోతుంది. ఇంకా మురికి మిగిలి ఉంటే.. ఒక చిన్న సూదితో ప్రతి రంధ్రంలో గుచ్చితే సరిపోతుంది.
బేకింగ్ సోడాతో బర్నర్ శుభ్రం చేసే పద్ధతి
ఒక వెడల్పాటి పాత్రలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని.. అందులో రెండు నుంచి మూడు స్పూన్ల బేకింగ్ సోడా కలిపి, పాత్రలు తోమే సబ్బు కూడా కలపాలి. దాంట్లో కాస్త నిమ్మరసం వేయాలి. ఈ మిశ్రమంలో బర్నర్లను 30 నిమిషాల వరకు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక పాత టూత్ బ్రెష్‌తో రుద్ది కడిగితే శుభ్రం అవుతాయి.
గ్యాస్ ఆదా చేసుకోండి!
నెలకి ఒకసారైనా ఇలా బర్నర్లను శుభ్రం చేయాలి. వంట అయిపోయాక తడిబట్టతో తుడిస్తే మరకలు పడకుండా ఉంటాయి. ఈ చిట్కాలను ఉపయోగించి గ్యాస్ బర్నర్లను సులభంగా శుభ్రం చేయవచ్చు. దీనివల్ల స్టవ్ మన్నిక పెరుగుతుంది. గ్యాస్ కూడా వృథా కాకుండా ఉంటుంది.