MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Tips
  • Tips and Tricks: అరటి తొక్కను ఇలా వాడితే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!

Tips and Tricks: అరటి తొక్కను ఇలా వాడితే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు!

ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే.. రాత్రుళ్లు సరిగ్గా నిద్రపోలేము. దోమకాటు వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి దోమలను తరిమికొట్టడం ముఖ్యం. అందుకు అరటి తొక్క చక్కగా ఉపయోగపడుతుంది. అరటి తొక్కను ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Jul 11 2025, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దోమలను తరిమికొట్టే చిట్కాలు
Image Credit : stockPhoto

దోమలను తరిమికొట్టే చిట్కాలు

వానాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమల వల్ల కొన్నిసార్లు నిద్రకూడా ఉండదు. అయితే అరటి తొక్కతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీని ఘాటైన వాసన దోమలను రాకుండా చేస్తుంది. అంతేకాదు అరటి తొక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దోమకాటు వల్ల కలిగే దురద, మంటను తగ్గిస్తాయి. మరి దోమలను తరిమికొట్టేందుకు అరటి తొక్కను ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అరటి పండు ప్రయోజనాలు
Image Credit : stockPhoto

అరటి పండు ప్రయోజనాలు

అరటిపండు ఎంత రుచికరమైందో అంత ఆరోగ్యకరమైంది. దాని తొక్క కూడా చాలా ఉపయోగకరమైంది. అవును.. అరటి తొక్కలోని గుణాలు నిద్రను మెరుగుపరచడమే కాకుండా.. చర్మాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాదు అరటి తొక్కతో దోమలను కూడా తరిమికొట్టవచ్చు. దోమకాటు నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఈ తొక్క సహాయపడుతుంది.  

35
దోమల నివారణకు అరటి తొక్క
Image Credit : Pinterest

దోమల నివారణకు అరటి తొక్క

సాధారణంగా వానాకాలంలో దోమల బెడద ఎక్కువవుతుంది. వాటి వల్ల డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అయితే అరటి తొక్కతో దోమల సమస్యకు చెక్ పెట్టవచ్చు. అరటి తొక్కలోని ఘాటైన వాసన దోమలను ఇంట్లోకి రాకుండా చేస్తుంది.  

45
అరటి తొక్కను ఎలా ఉపయోగించాలి?
Image Credit : Pinterest

అరటి తొక్కను ఎలా ఉపయోగించాలి?

దోమలను ఇంట్లో నుంచి తరిమికొట్టేందుకు ముందుగా మీరు అరటి తొక్కను తీసుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి.. ఇంటి మూలల్లో ఉంచాలి. కావాలంటే.. అరటి తొక్కను కాల్చి ఇంట్లో పొగను వ్యాపింపజేయవచ్చు. ఆ పొగ, వాసన వల్ల దోమలు పరార్ అవుతాయి.

55
దోమకాటు నుంచి ఉపశమనం..
Image Credit : Pinterest

దోమకాటు నుంచి ఉపశమనం..

దోమ కుడితే దురద, మంట రావడం సహజం. అయితే దోమ కుట్టినప్పుడు.. అరటి తొక్కలోని తెల్లటి భాగాన్ని తీసుకొని కుట్టిన చోట రుద్దవచ్చు. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దురద, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాదు.. అరటి తొక్కలోని సహజ ఎంజైమ్‌లు దోమల లాలాజలంలో ఉండే ప్రోటీన్‌లను విచ్ఛిన్నం చేస్తాయి. దానివల్ల వాపు, మంట నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
Insect Remove from Ear: చెవిలోకి చీమలు, పురుగులు వెళ్లినప్పుడు ఏం చేయాలో తెలుసా?
Recommended image2
Insects Control Tips: ఇలా చేస్తే ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులు వెంటనే పారిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved