- Home
- Telangana
- వీకెండ్ వెజిటెబుల్ మార్కెట్ కు వెళుతున్నారా? అయితే కూరగాయల ధరలు తెలుసుకొండి, మనీ సేవ్ చేసుకొండి
వీకెండ్ వెజిటెబుల్ మార్కెట్ కు వెళుతున్నారా? అయితే కూరగాయల ధరలు తెలుసుకొండి, మనీ సేవ్ చేసుకొండి
Today Vegetable Prices : మీరు ఈ వారాంతం సంతలో కూరగాయలు కొనేందుకు వెళ్లేముందు వాటి ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏ కూరగాయ ఎంతకు కొనుగోలు చేయాలో తెలుస్తుంది… డబ్బులు ఆదా అవుతాయి.

ఈ వారం కూరగాయల ధరలు
Vegetable Price : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాదు కొన్ని పల్లెల్లో సాధారణంగా వారాంతమే కూరగాయల సంత ఉంటుంది. ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి శని, ఆదివారమే ఏవైనా వ్యక్తిగత పనులు చేసేందుకు సమయం దొరుకుతుంది… పిల్లలకు సెలవు ఉంటుంది కాబట్టి గృహిణులు కూడా వారాంతంలోనే బయటకు వెళ్ళేందుకు ఇష్టపడతారు. అందువల్లే వీకెండ్ లోనే ఎక్కువగా కూరగాయల సంతలుంటాయి.
వీకెండ్ వచ్చేసింది… మీరు వచ్చే వారానికి సరిపడా కూరగాయలు కొనేందుకు దగ్గర్లోని మార్కెట్ కు వెళుతున్నారా? అయితే ఓసారి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొండి. ఏ కూరగాయ ధర ఎంతుంది? ఎంతకు కొనుగోలు చేయాలి? తెలుసుకోవడం ద్వారా మీ డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
టమాట ధర పెరుగుతుందా?
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ వారంరోజులు ఈ వర్షాల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వర్షాలదాటికి టమాటా పంట దెబ్బతింటోంది... ఇప్పటికే మార్కెట్లోకి టమాటా సరఫరా తగ్గింది. దీంతో కొద్దిరోజులుగా రూ.15 నుండి రూ.20 పలికిన కిలో టమాటా ఇప్పుడు రూ.25 నుండి 35 కు చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
ఉల్లిపాయల ధరలు ఎలా ఉన్నాయి?
ప్రతి వంటకంలో ఉల్లిపాయలను ఉపయోగిస్తుంటారు... దీన్నిబట్టే వంటింట్లో దీనికి ఏ స్థాయిలో డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయ ధరలు ఒక్కోసారి కన్నీరు తెప్పిస్తుంటాయి... కానీ ప్రస్తుతం వీటిధర చాలా తక్కువగా ఉంది. హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాల్లోనూ కిలో ఉల్లిపాయ ధర రూ.20 కి అటుఇటుగా ఉంది... రూ.100 కు ఐదారు కిలోల వరకు లభిస్తున్నాయి. ఉల్లిపాయలు తొందరగా పాడవవు... నిల్వ ఉంటాయి కాబట్టి ధర తక్కువగా ఉన్నపుడే కొనుగోలు చేసుకోవడం మంచిది.
ఇతర కూరగాయల ధరలు...
పచ్చిమిర్చీ ధర ఘాటెక్కింది... కిలో రూ.40-50 వరకు ఉంది. అలాగే కిలొ బెండకాయ రూ.20-30, కాకరకాయ కిలో రూ.30, బీరకాయ కిలో రూ.40-50, క్యాబేజీ కిలో రూ.20, బీన్స్ కిలో రూ.45, క్యారెట్ కిలో రూ.38-40 గా ఉంది.
ఇక ఆలుగడ్డలు కిలో రూ.29-32, క్యాప్సికం కిలో రూ.50, సొరకాయ కిలో రూ.35, క్యాలిఫ్లవర్ కిలో రూ.31-34, దోసకాయ కిలో రూ.30, వంకాయలు కిలొ రూ.36-39, సొరకాయ కిలొ రూ.35, అమ్ముతున్నారు.
ఆకుకూరల ధరలు
ఇక పాలకూర కిలో రూ.13-15, పూదీనా రూ.3-5 కట్ట, కరివేపాకు రూ.5-10 కట్ట, కొత్తిమీర రూ.10 కట్ట, మెంతి కూర కిలో రూ.12-13, చామకూర కిలో రూ.16-18 లభిస్తున్నాయి. అయితే ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.