Gold Price: ఇక్కడ తులం బంగారంపై రూ. 20 వేలు తగ్గింపు.. ఎందుకో తెలుసా.?
Gold Price: భారత్‌లో బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తులం బంగారం ధర ఏకంగా రూ. లక్ష 30 వేలు దాటేసింది. అయితే ఇదే తరుణంలో కొన్ని దేశాల్లో బంగారం ధరలు భారత్ కంటే తక్కువగా ఉంటాయని మీకు తెలుసా.? ఇంతకీ ఆ దేశాలు ఏంటంటే.?

దుబాయ్
దుబాయ్ బంగారానికి పెట్టింది పేరు. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,740 వద్ద కొనసాగుతోంది. ఇది భారత్‌లోని రూ. 1,30,000 కంటే దాదాపు రూ. 15 వేలు తక్కువని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దుబాయ్‌లో బంగారం ధర తక్కువగా ఉండడానికి ప్రధాన కారణాలు.
* GST లేకపోవడం.
* దిగుమతి సుంకాలు తక్కువగా ఉండడం.
* తయారీ ఛార్జీలు విభిన్నంగా ఉండడం.
* UAEలో ఉండే శుద్ధి కర్మాగారాలు ధరల స్థిరత్వానికి సహాయపడతాయి.
అమెరికా
అమెరికాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ. 1,15,360గా ఉంది. భారతదేశంలో బంగారంపై 3% GST వేశారు, కానీ అమెరికాలో కస్టమ్స్ సుంకం, పన్నులు తక్కువగా ఉంటాయి. తయారీ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి. డాలర్ బలపడినప్పుడు, ప్రపంచ మార్కెట్లో బంగారం చౌకగా మారుతుంది.
హాంగ్ కాంగ్
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,13,140గా ఉంది. పన్ను లేదా VAT ఉండదు. బహిరంగ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ వాణిజ్య కేంద్ర స్థానం. రాజకీయ పరిస్థితులు కొన్నిసార్లు ప్రభావం చూపుతాయి, కానీ స్థిరమైన ధరలు ఉంటాయి.
సింగపూర్
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,18,880గా ఉంది. GST లేకపోవడం వల్ల భారతదేశం కంటే 5–8% చౌకగా లభిస్తోంది. తయారీ ఖర్చులు తక్కువగా ఉంటాయి. టూరిస్టు రీఫండ్ స్కీమ్ (TFS) ద్వారా 7% వరకు GST రీఫండ్ పొందవచ్చు.
కువైట్
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,13,570 వద్ద కొనసాగుతోంది. పన్నులు, దిగుమతి సుంకాలు తక్కువగా ఉంటాయి. చమురు సంపన్న దేశం కాబట్టి కరెన్సీ స్థిరత్వం ఉండడం. ఈ దేశం నుంచి భారత్‌లోకి బంగారాన్ని తీసుకొచ్చేందుకు పరిమితులు ఉంటాయి. పురుషులు 20 గ్రాములు, మహిళలు 40 గ్రాములు మాత్రమే తీసుకురావచ్చు.
టర్కీ
టర్కీలో కూడా బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 1,13,040 వద్ద కొనసాగుతోంది. తక్కువ దిగుమతి సుంకాలు, VAT దీనికి కారణాలు చెప్పొచ్చు. 10–21 క్యారెట్ల బంగారు ఆభరణాల విస్తృత శ్రేణిలో లభిస్తుంది.