Vegetable Price : వీకెండ్ మార్కెట్ లో కూరగాయల ధరలు... ఎలా ఉన్నాయో తెలుసా?
Vegetable Prices in Weekend Market : దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వీకెండ్ మార్కెట్స్ లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

కూరగాయల ధరలు
Today Vegetable Price : ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నెల (నవంబర్) ఆరంభంనుండి ధరలు మెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి.. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి జీవులకు బతుకుబండిని లాగడం మరింత భారంగా మారింది. ప్రస్తుతం ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.40-50 గా ఉంది... కొన్ని అయితే సెంచరీకి చేరువయ్యాయి. అమాంతం కూరగాయల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
సాధారణంగా ప్రతి వీకెండ్ లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలతో పాటు చిన్నచిన్న పట్టణాల్లోనూ కూరగాయల సంతలు జరుగుతాయి. వీకెండ్ లో ఖాళీగా ఉండే ఉద్యోగులు, గృహిణులు కూడా వీకెండ్ లోనే కూరగాయల మార్కెట్ కు వెళుతుంటారు. ఇలా మీరుకూడా కూరగాయలు కొనేందుకు వెళుతున్నారా..? అయితే మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలాముఖ్యం. దీంతో సరైన ధరలకు కూరగాయలను కొనుగోలు చేసే వీలుంటుంది... డబ్బులు వృథా కావు.
టమాటా ధరలు ఎలా ఉన్నాయి?
ప్రస్తుతం టమాటా ఎవరిమాటా విననంటోంది... సామాన్యులతో ఓ ఆట ఆడుకునేందుకు సిద్దమవుతోంది. కొద్దిరోజుల కింద కిలో రూ.15-20 పలికిన టమాటా ప్రస్తుతం రూ.40-50 పలుకుతోంది. అంటే టమాటా ధర డబుల్ అయ్యింది. ప్రస్తుతం పెళ్ళిళ్లు, పండగల సీజన్ కాబట్టి టమాటాకు డిమాండ్ పెరిగింది... కానీ సరఫరా తగ్గింది... కాబట్టి దీని ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. త్వరలోనే టమాటా ధర రూ.100 కు చేరుకోవడం చూస్తామంటున్నారు
కిలో ఉల్లిపాయల ధర ఎంత?
వంటకాల్లో ఉల్లిపాయలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు... అందుకే ప్రతి వంటింట్లో ఇవి ఉండి తీరాల్సిందే. ఇలా డిమాండ్ ఎక్కువగా ఉన్నా సరపరా కూడా ఎక్కువగానే ఉంది... అందుకే ఉల్లి ధర రోజురోజుకు తగ్గుతుందే తప్ప పెరగడంలేదు. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.15 నుండి 20 ఉంది... రూ.100 కు ఐదారు కిలోల ఉల్లిపాయలు వస్తున్నాయి. ఉల్లిపాయలు ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి... అందుకే చాలామంది ఎక్కువమొత్తంలో కొంటుంటారు... ఇలాంటివారికి ధర మరింత తగ్గే అవకాశం ఉంది.
మిగతా కూరగాయల ధరలు
చిక్కుడు కిలో రూ.60-70
పచ్చిమిర్చి కిలో రూ.40-50
బీట్ రూట్ కిలో రూ.35-40
ఆలుగడ్డ కిలో రూ.29-32
క్యాప్సికం కిలో రూ.55
కాకరకాయ కిలో రూ.45-50
సొరకాయ కిలో రూ.39-43
బీన్స్ కిలో రూ.46-51
క్యాబేజీ కిలో రూ.23-30
క్యారెట్ కిలో రూ.60
వంకాయలు కిలో రూ.45-50
బెండకాయలు కిలో రూ.55
బీరకాయ కిలో రూ. 45
ఆలుగడ్డ కిలో రూ.30-35
ఆకుకూరల ధరలు
పాలకూర కిలో రూ.17-20
పూదీనా రూ.5-10 కట్ట
కరివేపాకు రూ.5-10 కట్ట (కిలో రూ.80)
కొత్తిమీర రూ.20 కట్ట,
మెంతి కూర కిలో రూ.20
చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

