MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • IMD Rain Alert : మళ్లీ వర్ష బీభత్సం.. ఈ 16 జిల్లాల్లో అల్లకల్లోలమే, ఎల్లో అలర్ట్

IMD Rain Alert : మళ్లీ వర్ష బీభత్సం.. ఈ 16 జిల్లాల్లో అల్లకల్లోలమే, ఎల్లో అలర్ట్

IMD Rain Alert : తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్. ఇవాళ ఒక్కరోజే ఎండలు మండిపోతాయట… రేపటి నుండి ఉష్ణోగ్రతలు తగ్గుతాయట. ఆదివారం నుండి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 12 2026, 07:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్
Image Credit : Getty

తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి... ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెబుతోంది. నేటి (మార్చి 12, గురువారం) నుండి ఎండల తీవ్రత క్రమక్రమంగా తగ్గుతుందని తెలంగాణ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మార్చి 15 అంటే వచ్చే ఆదివారం నుండి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మార్చి 16/17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాలు కురుస్తాయని... మూడునాలుగు రోజులు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తెలంగాణలో వర్షాలు
Image Credit : X/metcentrehyd

తెలంగాణలో వర్షాలు

మార్చి 15న తేలిపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

36
తస్మాత్ జాగ్రత్త..
Image Credit : X/APSDMA

తస్మాత్ జాగ్రత్త..

తెలంగాణలో కేవలం వర్షాలు కాదు గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. కొన్నిచోట్ల పిడుగులు, వడగళ్ల వానలు కురిసే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

46
తెలంగాణ మొత్తం వర్షాలే..
Image Credit : Getty

తెలంగాణ మొత్తం వర్షాలే..

మొదట ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మొదలయ్యే వర్షాలు క్రమక్రమంగా అన్ని జిల్లాలకు వ్యాపిస్తాయట. కాబట్టి రైతులు ఈ అకాల వర్షాలతో నష్టపోకుండా పంటలను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. వర్షాల సమయంలో రైతులు, కూలీలు చెట్లకింద అస్సలు ఉండకూడదని... ఇది చాలా ప్రమాదకరం అని సూచించారు. ప్రజలు కూడా వర్షంలో బయటకు రావద్దని సూచిస్తున్నారు.

56
హైదరాబాద్ వెదర్
Image Credit : Getty

హైదరాబాద్ వెదర్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో ఇవాళ (గురువారం) ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 33-34° సెల్సియస్, కనిష్ఠంగా 22° సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటాయని తెలిపింది. తర్వాత రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని... ఆదివారం నగరంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

66
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..
Image Credit : Asianet News

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది... దీని ప్రభావంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఇప్పటికే తమిళనాడు తీరప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి... ఇవి ఇతర దక్షిణాది రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలున్నట్లు తెలిపింది. మార్చి 13 నుండి 16 వరకు దక్షిణ తమిళనాడు తీరప్రాంతాల్లో వర్షాలు మరింత జోరందుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
IMD Rain Alert : తెలంగాణలో జోరువానలు.. ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో అల్లకల్లోలమే
Recommended image2
IMD Rain Alert : మళ్లీ వర్షాలు... ఈసారి ఫిబ్రవరిలో కంటే భారీగా, బిఅలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved