MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update : ఈ తెలుగు జిల్లాల్లో వింత వెదర్.. పగలంతా పీక్ ఎండలతో ఆరెంజ్, సాయంత్రం జోరువానలతో ఎల్లో అలర్ట్

Weather Update : ఈ తెలుగు జిల్లాల్లో వింత వెదర్.. పగలంతా పీక్ ఎండలతో ఆరెంజ్, సాయంత్రం జోరువానలతో ఎల్లో అలర్ట్

ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండావాన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అత్యధిక ఎండలు నమోదయ్యే జిల్లాల్లోనే వర్షాలు కూడా కురుస్తున్నాయి. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 28 2026, 08:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
తెలుగు రాష్ట్రాల వెదర్ అప్ డేట్..
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్ డేట్..

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. తెల్లవారుజామున శీతాకాలంలో మాదిరి చల్లగా... మధ్యాహ్నం వేసవి ఎండలు... సాయంత్రం వర్షాకాలంలో మాదిరిగా వానలు పడుతున్నాయి. దీంతో అసలు ఇది వేసవి కాలమేనా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే గత వారంరోజులుగా అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి... మరో నాలుగైదు రోజులు ఇవి ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఎండలు మరింత తీవ్రరూపం దాలుస్తాయని... వడగాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హెచ్చరించింది.

28
పగలు ఎండలు, సాయంత్రం వానలు..
Image Credit : Gemini AI

పగలు ఎండలు, సాయంత్రం వానలు..

తెలంగాణలో పగలంతా ఎండలు మండిపోతోంది... అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోత, వడగాలులు సతమతం చేస్తున్నాయి. ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు ఆకాశం మేఘాలతో కప్పేసి మొదట ఈదురుగాలులు, తర్వాత వాన మొదలవుతోంది. ఇలా గత వారం రోజులుగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (మార్చి 28, శనివారం) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Related Articles

Related image1
Weather: ప్ర‌మాదంలో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు.. 2050 నాటికి జ‌రిగేది ఇదేనా?
Related image2
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!
38
నేడు తెలంగాణలో వర్షాలు
Image Credit : Gemini AI

నేడు తెలంగాణలో వర్షాలు

ఇవాళ తెలంగాణలో ఉరములు మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో కూడా వర్షాలుంటాయని... సాయంత్రం సమయంలో నగరప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

48
మరో రెండ్రోజులు వర్షాలు..
Image Credit : Getty

మరో రెండ్రోజులు వర్షాలు..

తెలంగాణలో మరో రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని... ఎండావాన పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే పగలంతా అత్యధిక ఉష్ణోగ్రతలో ఎండలు మండిపోయి సాయంత్రం వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తాయన్నమాట. వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్... ఎండలు మండిపోయే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.

58
ఈ తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలే..!
Image Credit : Getty

ఈ తెలంగాణ జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలే..!

నేడు ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు (41-44 డిగ్రీలు) నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లోనూ రాబోయే రోజుల్లో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం సమయంలో జాగ్రత్తగా ఉండాలని... ఎండలు, ఉక్కపోత నుండి కాపాడుకునే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

68
ఈ మండలాలకు వడగాలుల హెచ్చరికలు..
Image Credit : Getty

ఈ మండలాలకు వడగాలుల హెచ్చరికలు..

ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం విషయానికి వస్తే.. ఇవాళ (మార్చి 28, శనివారం) ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం,రేగడి, ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని APSDMA ఎండీ ప్రఖర్ తెలిపారు.

78
 రాయలసీమలో మండుటెండలు..
Image Credit : Getty

రాయలసీమలో మండుటెండలు..

ఇక రాయలసీమ జిల్లాల్లో 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ఆదివారం (మార్చి 29న) 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని ప్రఖర్ జైన్ సూచించారు.

88
ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే..
Image Credit : Getty

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలివే..

నిన్న (మార్చి 27, శుక్రవారం) రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గుల్లదుర్తలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక కడప జిల్లా కమలాపురంలో 42, పల్నాడు జిల్లా గురజాల, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 41.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.6, కర్నూల్ జిల్లా తోవిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 41, ఏలైరు జిల్లా ధర్మాజీపేటలో 40.4, మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 40.2, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లెలో 40.1, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
రాములోరి కళ్యాణం వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు | Asianet News Telugu
Recommended image2
Jobs : తెలుగు యువత బీ రెడీ... ఏకంగా 68,150 ఉద్యోగాలు వచ్చేస్తున్నాయ్..!
Recommended image3
Now Playing
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వైభవంగా సీతారాముల కళ్యాణం | Sitaramula Kalyanam Bhadrachalam
Related Stories
Recommended image1
Weather: ప్ర‌మాదంలో ల‌క్ష‌లాది మంది ప్రాణాలు.. 2050 నాటికి జ‌రిగేది ఇదేనా?
Recommended image2
IMD Rain Alert : హైదరబాదీలు బిఅలర్ట్.. సాయంత్రం ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే, ఇక్కడ 51 మి.మీ వర్షపాతమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved