School Holiday : రేపు స్కూళ్లకి సెలవు..? ఈ సడన్ హాలిడే ఎందుకో తెలుసా?
Vaikunta Ekadasi, Mukkoti Ekadasi 2025 : డిసెంబర్ 30న అంటే రేపు కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఇప్పటికే పేరెంట్స్ కు హాలిడే మెసేజ్ కూడా వెళ్లిపోయింది. ఇంతకూ సెలవు ఎందుకో తెలుసా?

డిసెంబర్ 30న స్కూళ్ళకి సెలవేనా..?
School Holiday : హాలిడే.. ఈ పదం వింటేచాలు విద్యార్థులు ఎగిరిగంతేస్తారు. రెగ్యులర్ గా వచ్చే సండే సెలవు కోసమే ఎదురుచూస్తుంటారు... అలాంటిది ప్రత్యేకంగా పండగలు, పర్వదినాలకు సెలవు వచ్చిందంటే మురిసిపోతారు. ఇక సడన్ గా ఏదైనా ఊహించని హాలిడే వచ్చిందా... వారి ఆనందానికి అవధులుండవు. అలాంటి సెలవే తెలుగు రాష్ట్రాల్లోని కొందరు విద్యార్థులకు రేపు (డిసెంబర్ 30, మంగళవారం) వస్తోంది.
రేపు ఎందుకు సెలవు?
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రేపే (డిసెంబర్ 30). ఈరోజు శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనదని నమ్ముతారు... అందుకే ఈరోజు పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు అట్టహాసంగా జరుపుకుంటారు... భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలకు వెళుతుంటారు. చాలా దేవాలయాల్లో ఈరోజు ఉత్తరద్వార దర్శనం కల్పిస్తారు... ఈ ద్వారా గుండా వెళ్లడంతో మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని విద్యాసంస్థలకు సెలవులున్నాయి. ప్రత్యేకంగా హిందుత్వ సంస్థలు, ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచే ప్రైవేట్ స్కూల్స్, తిరుమల వంటి దేవాలయ ప్రాంతాల్లో నడిచే వేద పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని పాఠశాలలు వైకుంఠ ఏకాదశి సెలవుకు సంబంధించి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపించాయి.
తిరుపతిలో సెలవేనా..?
భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ద వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి ఒకటి. ఇక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా కొలుస్తుంటారు. ఇలాంటి ప్రాచీన దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు మామూలుగా ఉంటాయా..? కేవలం ఏడాదిలో ఒక్కసారే వైకుంఠ ద్వారం గుండా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు... ఇందుకోసం లక్షలాదిమంది భక్తులు తిరుమలకు తరలివెళుతుంటారు.
ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలు నేపథ్యంలో తిరుమలలోని వేద పాఠశాలలతో పాటు కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. తిరుపతిలో కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కొన్ని విద్యాసంస్థలు సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఈ సెలవు కేవలం స్కూల్స్ యాజమాన్యాల నిర్ణయాన్ని బట్టి ఉంటాయి... ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి సెలవు ప్రకటించలేదు.
జనవరి 1 సెలవు..?
న్యూ ఇయర్ వేడుకల కోసం కూడా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. ఇలా డిసెంబర్ 31న రాత్రి కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొనడంతో పాటు జనవరి 1, 2026 లో కూడా సంబరాలు జరుపుకుంటారు. అందుకే హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం, విజయవాడ వంటి కొన్ని నగరాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు జనవరి 1న కూడా సెలవు ప్రకటించాయి. ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటి విద్యాసంస్థలకు న్యూఇయర్ సెలవు ఉంటుంది.
జనవరి 2026 సెలవుల జాబితా
జనవరిలో కేవలం సంక్రాంతికి మాత్రమే కాదు ఇంకా అనేక సెలవులు వస్తున్నాయి. నెలలో సగంరోజులు సెలవులే. ఇలా తెలంగాణలో వచ్చే సాధారణ, ఆప్షనల్ హాలిడేస్ ఏవో తెలుసుకుందాం.
1. న్యూ ఇయర్ - 01 జనవరి ( గురువారం) - ఆప్షనల్ హాలిడే
2. హజ్రత్ అలీ భర్త్ డే - 03 జనవరి (శనివారం) - ఆప్షనల్ హాలిడే
3. భోగి - 14 జనవరి (బుధవారం) - అధికారిక సెలవు
4. సంక్రాంతి - 15 జనవరి (గురువారం) - అధికారిక సెలవు
5. కనుమ - 16 జనవరి (శుక్రవారం) - ఆప్షనల్ హాలిడే
6. షబ్-ఈ- మేరాజ్ - 17 జనవరి ( శనివారం) - ఆప్షనల్ హాలిడే
7. శ్రీ పంచమి - 23 జనవరి (శుక్రవారం) - ఆప్షనల్ హాలిడే
8. రిపబ్లిక్ డే - 26 జనవరి (సోమవారం) - జాతీయ సెలవు
వీటితో పాటు జనవరి 4,11,18, 25 (నాలుగు ఆదివారాలు) ఎలాగూ సెలవే... జనవరి 10న రెండో శనివారం కూడా సెలవే.
