- Home
- Telangana
- ఉద్యోగులు, విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. 2026 లో ఏకంగా 49 సెలవులు, పూర్తి హాలిడే లిస్ట్..!
ఉద్యోగులు, విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. 2026 లో ఏకంగా 49 సెలవులు, పూర్తి హాలిడే లిస్ట్..!
2026 Holiday : రాబోయే 2026 సంవత్సరంలో విద్యార్థులు, ఉద్యోగులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఏడాదిలో ఎన్నిరోజులు సెలవులున్నాయో కేంద్రం ప్రకటించింది. ఆ హాలిడేస్ లిస్ట్ ఇక్కడుంది…

2026 లో సెలవులే సెలవులు
Holidays List in 2026 : ఇంకో నెలపది రోజుల్లో 2025 కి గుడ్ బై చెప్పి 2026 కి వెల్ కమ్ చెప్పబోతున్నాం. ఈ కొత్త సంవత్సరాన్ని సరికొత్త ఆశలతో ప్రారంభించేందుకు ప్రతిఒక్కరూ సిద్దమవుతున్నారు. నూతన సంవత్సరంలో కుటుంబంతో ఆనందంగా గడపాలి... స్నేహితులతో సరదాగా టైమ్ స్పెండ్ చేయాలి... కొత్తకొత్త ప్రాంతాలను చుట్టిరావాలని కోరుకునేవారు చాలామందే ఉంటారు. ఇలాంటివారు పండగలు, ప్రత్యేక పర్వదినాలు, జాతీయ దినోత్సవాల్లో వచ్చే సెలవుల్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. వీరికి గుడ్ న్యూస్... 2026 సెలవుల జాబితా వచ్చేసింది.
భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ india.gov.in లో కేంద్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ 2026 చూడవచ్చు. ఇక్కడ ఏడాది మొత్తం సెలవుల జాబితా విడుదలైంది. ఈ క్యాలెండర్‌లో జాతీయ సెలవుల నుండి వివిధ మతాలు, వర్గాల ముఖ్యమైన పండుగల వరకు అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం సెలవుల గురించి మాట్లాడితే దాదాపు 49 రోజులు ఉన్నాయి. జనవరి 2026 నుండి డిసెంబర్ 2026 వరకు అన్ని ముఖ్యమైన సెలవుల పూర్తి జాబితాను చూడండి, దీనివల్ల మీరు ఏడాది మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు.
జనవరి, ఫిబ్రవరి సెలవులు
జనవరి 2026 సెలవులు
1 జనవరి - (నూతన సంవత్సరాది) : ఈ రోజు దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. 2026 సెలవుతోనే ప్రారంభం అవుతుంది.
3 జనవరి - హజ్రత్ అలీ పుట్టినరోజు : ఇస్లామిక్ చరిత్రలో నాల్గవ ఖలీఫా, ప్రవక్త మహమ్మద్ అల్లుడైన హజ్రత్ అలీ జన్మదినాన్ని ఈ రోజు జరుపుకుంటారు. ఈరోజును ముస్లింలు చాలా పవిత్రంగా భావిస్తారు.
14 జనవరి - మకర సంక్రాంతి/మాఘ్ బిహు/ పొంగల్ : పంట కోతల పెద్ద పండుగ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండక్కి ఏపీ, తెలంగాణలో రెండ్రోజులు సెలవుండే అవకాశాలున్నాయి.
23 జనవరి - శ్రీ పంచమి/వసంత పంచమి : జ్ఞాన దేవత సరస్వతి పూజతో వసంత రుతువుకు స్వాగతం పలుకుతారు.
26 జనవరి - గణతంత్ర దినోత్సవం : భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, దేశవ్యాప్తంగా జాతీయ పర్వదినంగా జరుపుకుంటారు.
ఫిబ్రవరి 2026 సెలవులు
1 ఫిబ్రవరి - గురు రవిదాస్ జయంతి : సిక్కులు తమ మతగురువు సంత్ రవిదాస్ బోధనలు, జీవితాన్ని స్మరించుకునే రోజు.
12 ఫిబ్రవరి - స్వామి దయానంద సరస్వతి పుట్టినరోజు: ఆర్య సమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి జయంతిని జరుపుకుంటారు.
15 ఫిబ్రవరి - మహాశివరాత్రి: శివుడి ఆరాధనకు అతిపెద్ద పర్వదినం. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి.
19 ఫిబ్రవరి - ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి : మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ జన్మదినం.
మార్చి, ఏప్రిల్ సెలవులు
మార్చి 2026 సెలవులు
3 మార్చి - హోలికా దహన్/డోల్ యాత్ర: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలికా దహన్ జరుపుతారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ వేడుకలు జరుపుకుంటారు.
4 మార్చి - హోలీ: రంగుల అతిపెద్ద పండుగ, ఇది ఆనందం, స్నేహ సందేశాన్ని ఇస్తుంది.
19 మార్చి - చైత్ర శుక్లాది/ గుడి పడ్వా/ ఉగాది/ చేతి చంద్: అనేక భారతీయ క్యాలెండర్ల ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు. తెలుగువాళ్లకు కూడా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు.
20 మార్చి - జుమాత్-ఉల్-విదా : రంజాన్ చివరి శుక్రవారం రోజు. చాలా రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.
21 మార్చి- ఈద్-ఉల్-ఫితర్: రంజాన్ నెల ముగిసిన తర్వాత జరుపుకునే పెద్ద పండుగ.
26 మార్చి- రామ నవమి : శ్రీరాముడి జన్మదినం... అయోధ్యతో పాటు భద్రాచలం, ఒంటిమిట్ట వంటి రామమందిరాల్లో వేడుకలు జరుగుతాయి.
31 మార్చి - మహావీర్ జయంతి : జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడి పుట్టినరోజు.
ఏప్రిల్ 2026 సెలవులు
3 ఏప్రిల్ - గుడ్ ఫ్రైడే: ఏసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకునే రోజు.
5 ఏప్రిల్- ఈస్టర్ సండే: ఏసుక్రీస్తు పునరుత్థాన వేడుక.
14 ఏప్రిల్- వైశాఖి/ విషు/ తమిళ నూతన సంవత్సరం (మేషాది): పంట కోత, కొత్త సంవత్సరం ప్రారంభ పండుగ.
15 ఏప్రిల్ - వైశాఖాడి(బెంగాల్)/ బోహాగ్ బిహు (అస్సాం) : వివిధ రాష్ట్రాల కొత్త సంవత్సరం, పంట పండుగల రోజు.
మే, జూన్, జూలై సెలవులు
మే 2026 సెలవులు
1 మే - బుద్ధ పౌర్ణమి : గౌతమ బుద్ధుని జననం, జ్ఞానోదయం, నిర్యాణం జరిగిన రోజు.
9 మే- రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి : గురుదేవ్ ఠాగూర్ స్మృతిలో జరుపుకునే రోజు.
27 మే - బక్రీద్ (ఈద్-ఉల్-జుహా): త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ముఖ్యమైన ఇస్లామిక్ పండుగ.
జూన్ 2026 సెలవులు
26 జూన్ - మొహర్రం: ఇస్లామిక్ కొత్త సంవత్సరం, కర్బలా అమరవీరుల స్మారకార్థం జరుపుకునే రోజు.
జూలై 2026 సెలవులు
16 జూలై - రథయాత్ర: జగన్నాథుని భవ్యమైన శోభాయాత్ర రోజు.
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ సెలవులు
ఆగస్టు 2026 సెలవులు
15 ఆగస్టు - స్వాతంత్య్ర దినోత్సవం: దేశ స్వాతంత్య్రానికి గుర్తుగా జరుపుకునే అతిపెద్ద జాతీయ పర్వదినం.
15 ఆగస్టు - పార్శీ నూతన సంవత్సరం (నౌరోజ్): పార్శీ సమాజం కొత్త సంవత్సరం ప్రారంభం.
26 ఆగస్టు - మిలాద్-ఉన్-నబీ / ఈద్-ఎ-మిలాద్: ప్రవక్త మహమ్మద్ జన్మదినం.
26 ఆగస్టు - ఓణం (తిరువోణం): కేరళ అతిపెద్ద పంట పండుగ.
28 ఆగస్టు - రక్షా బంధన్: అన్నాచెల్లెళ్ల ప్రేమకు ప్రతీక అయిన పండుగ.
సెప్టెంబర్ 2026 సెలవులు
4 సెప్టెంబర్ - జన్మాష్టమి (వైష్ణవ): శ్రీకృష్ణుడి జన్మదినం.
14 సెప్టెంబర్ - గణేష్ చతుర్థి: గణపతి విగ్రహాలను ఏర్పాటుచేయడం, భవ్యమైన ఉత్సవాల ప్రారంభ రోజు.
అక్టోబర్ 2026 సెలవులు
2 అక్టోబర్ - మహాత్మా గాంధీ జయంతి: జాతిపిత మహాత్మాగాంధీ పుట్టినరోజు... ఆయనకు యావత్ దేశం నివాళులు అర్పించే రోజు.
18-20 అక్టోబర్ - దుర్గా పూజ (సప్తమి, అష్టమి, నవమి), విజయదశమి: శక్తి ఆరాధన ముఖ్య పండుగ, రావణ దహనం రోజు.
26 అక్టోబర్ - మహర్షి వాల్మీకి జయంతి: రామాయణ రచయిత జయంతి.
29 అక్టోబర్ - కర్వా చౌత్: వివాహిత మహిళల వ్రతం, పూజల రోజు.
నవంబర్, డిసెంబర్ సెలవులు
నవంబర్ 2026 సెలవులు
8 నవంబర్ - దీపావళి: వెలుగుల పండుగ, లక్ష్మీ పూజ రోజు.
9 నవంబర్ - గోవర్ధన పూజ: ఈ రోజు అన్నకూటం, శ్రీకృష్ణుడి పూజ చేస్తారు.
11 నవంబర్ - భాయ్‌దూజ్: అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రత్యేకమైన పండుగ.
15 నవంబర్ - ఛఠ్ పూజ (ప్రథమ అర్ఘ్యం): సూర్య దేవుడు, ఛఠీ మాత ఆరాధన.
24 నవంబర్ - గురు నానక్ దేవ్ జయంతి: సిక్కు మత మొదటి గురువు జన్మదినం.
24 నవంబర్ - గురు తేగ్ బహదూర్ వర్ధంతి: తొమ్మిదవ సిక్కు గురువు త్యాగాన్ని స్మరించుకునే రోజు.
డిసెంబర్ 2026 సెలవులు
23 డిసెంబర్ - హజ్రత్ అలీ పుట్టినరోజు (రెండో తేదీ ప్రకారం)
24 డిసెంబర్ - క్రిస్మస్ ఈవ్: క్రిస్మస్‌కు ముందు రోజు వేడుక.
25 డిసెంబర్ - క్రిస్మస్ డే: ఏసుక్రీస్తు జన్మదినం.

