MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్

Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్

Weather Update: తెలంగాణలో ఎండల సెగ తగ్గుముఖం పట్టనుంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 28 2026, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఎండల సెగకు బ్రేక్.. తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు
Image Credit : Gemini

ఎండల సెగకు బ్రేక్.. తెలంగాణలో దంచికొట్టనున్న వర్షాలు

తెలంగాణలో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వానలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూల్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. మే 29 (శుక్రవారం) వరకు నగరానికి 'ఎల్లో అలర్ట్' జారీ చేస్తూ ఐఎండీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎండల నుంచి ఊరట.. భాగ్యనగరం కూల్ కూల్
Image Credit : chatgpt

ఎండల నుంచి ఊరట.. భాగ్యనగరం కూల్ కూల్

గత కొద్ది రోజులుగా భానుడు భగభగలాడుతూ చుక్కలు చూపించాడు. హైదరాబాద్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, మంగళవారం రాత్రి నుంచి అక్కడక్కడ కురుస్తున్న వర్షాలు సీన్ మార్చేశాయి. సికింద్రాబాద్, అమీర్‌పేట్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ఏరియాల్లో వాతావరణం చల్లబడటంతో జనం హమ్మయ్య అనుకుంటున్నారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించింది.

Related Articles

Related image1
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Related image2
Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
36
అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Image Credit : ANI

అప్రమత్తమైన ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు ఎలాంటి కష్టం రాకూడదని సీఎం నొక్కి చెప్పారు.

46
ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్
Image Credit : Gemini AI

ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్‌కే పరిమితం కాకుండా.. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి సహా 20కి పైగా జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కొన్ని చోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలుల వల్ల చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, వర్షం పడే సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

56
నైరుతి రుతుపవనాల రాక లేట్.. ఎందుకంటే?
Image Credit : X/APSDMA

నైరుతి రుతుపవనాల రాక లేట్.. ఎందుకంటే?

సాధారణంగా జూన్ 1 కల్లా కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి కొంచెం ఆలస్యమయ్యేలా ఉన్నాయి. మే 26న రావాల్సినవి ఇప్పుడు జూన్ 2 నుంచి 4 మధ్య వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. దీనివల్ల ఉత్తర భారతం ఎండలతో అల్లాడుతోంది. ఢిల్లీలో 45 డిగ్రీల దాకా టెంపరేచర్స్ వెళ్తున్నాయి. అయితే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కేవలం వాతావరణ మార్పుల వల్ల వస్తున్న ప్రీ-మాన్సూన్ వర్షాలే అని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు.

66
ఉరుములు, మెరుపులతో వర్షం.. జాగ్రత్తలు తీసుకోండి
Image Credit : Asianet News

ఉరుములు, మెరుపులతో వర్షం.. జాగ్రత్తలు తీసుకోండి

ఆఫీసులకి వెళ్లేవారు లేదా పనుల మీద బయట తిరిగేవారు తమ షెడ్యూల్‌ను వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవడం బెటర్. సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడే ఛాన్స్ ఉంది కాబట్టి వెంట గొడుగు లేదా రెయిన్ కోట్ ఉంచుకోవడం మంచిది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో వైరల్ ఫీవర్లు వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
Recommended image2
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ
Recommended image3
Now Playing
Advocate Allam Nagaraju : ఈ వీడియో చూడకపోతే ప్రమాదంలో పడొచ్చు| Asianet News Telugu
Related Stories
Recommended image1
IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే
Recommended image2
Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved