MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్

Hyderabad పక్కన మరో నయా సిటీ.. 11 జోన్లతో బొమ్మ అద్దిరిపోయేలా ప్లాన్ చేసిన రేవంత్ సర్కార్

Future City : హైదరాబాద్‌కు పోటీగా 30 వేల ఎకరాల్లో రాబోతున్న ఫోర్త్ సిటీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఏసీలు లేకుండానే ఊరంతా కూల్‌గా ఉంచే టెక్నాలజీతో సాగే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆసక్తికర వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 27 2026, 11:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్ రేంజ్‌ను మార్చేయబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ
Image Credit : Gemini

హైదరాబాద్ రేంజ్‌ను మార్చేయబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ

హైదరాబాద్ అంటే మనకు గుర్తొచ్చేది సికింద్రాబాద్, సైబరాబాద్. కానీ త్వరలోనే వీటన్నింటికీ బాస్ లాంటి మరో సరికొత్త నగరం మన ముందుకు రాబోతోంది. అదే సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ (Fourth City).

కందుకూరు మండలంలోని మీర్‌ఖాన్‌పేట్, ముచ్చర్ల గ్రామాల మధ్య సుమారు 30 వేల ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రీన్ ఎన్విరాన్‌మెంట్‌కు పెద్ద పీట వేస్తూ, అస్సలు ఏసీల అవసరమే లేకుండా సరికొత్త టెక్నాలజీతో ఈ సిటీని డిజైన్ చేస్తున్నారు. కేవలం 30 నెలల్లోనే 11 అద్భుతమైన ఎకో ప్రెండ్లీ టౌన్‌షిప్‌లను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
11 జోన్లు... 762 చదరపు కిలోమీటర్ల మహా సామ్రాజ్యం
Image Credit : Gemini

11 జోన్లు... 762 చదరపు కిలోమీటర్ల మహా సామ్రాజ్యం

ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) పరిధిలోకి ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం, మంచాల, యాచారం లాంటి 7 మండలాల్లోని 56 గ్రామాలను చేర్చారు. మొత్తం 762 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ అథారిటీ విస్తరించి ఉంటుంది. ఇందులో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ వస్తుండగా, అందులో సగానికి సగం అంటే 15 వేల ఎకరాలను అభయారణ్యంగా (ఫారెస్ట్ జోన్) కాపాడుతున్నారు.

మిగిలిన 15 వేల ఎకరాల్లో 11 ప్రత్యేక జోన్లను క్రియేట్ చేస్తున్నారు. ఇందులో లైఫ్ సైన్సెస్ హబ్‌కు అత్యధికంగా 4,000 ఎకరాలు, నివాస సముదాయాల కోసం 2,477 ఎకరాలను కేటాయించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీర్‌ఖాన్‌పేట్‌లో రూపుదిద్దుకున్న ఐకానిక్ ‘గ్రీన్ బిల్డింగ్’ FCDA ఆఫీస్ గ్రాండ్‌గా ఓపెన్ కానుంది.

Related Articles

Related image1
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Related image2
EPF + SIP అదిరిపోయే కాంబో.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో మీ అకౌంట్‌లోకి రూ. 1 కోటి పక్కా బాస్ !
35
గ్లోబల్ బ్రాండ్స్ టార్గెట్.. ఆల్రెడీ మొదలైన ఎడ్యుకేషన్ హబ్
Image Credit : Gemini

గ్లోబల్ బ్రాండ్స్ టార్గెట్.. ఆల్రెడీ మొదలైన ఎడ్యుకేషన్ హబ్

మొదట్లో ఈ సిటీలో కేవలం స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ మాత్రమే అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి దీన్ని వరల్డ్ క్లాస్ లెవెల్‌కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'ఫార్చ్యూన్ 500' కంపెనీల్లో కనీసం 70 శాతం సంస్థల ఆఫీసులు ఇక్కడే ఉండేలా ప్లాన్ మార్చేశారు.

ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిటీలో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే హెల్త్ సిటీ (200 ఎకరాలు), ఏఐ సిటీ (300 ఎకరాలు) పనులు కూడా పట్టాలెక్కనున్నాయి.

45
ఏసీలు లేవు.. అంతా కూల్ కూల్
Image Credit : Gemini

ఏసీలు లేవు.. అంతా కూల్ కూల్

ఈ సిటీ స్పెషాలిటీ ఏంటంటే.. ఇక్కడ బిల్డింగ్‌ల బయట మనకు పిచ్చిపిచ్చిగా ఏసీ అవుట్‌డోర్ యూనిట్లు కనిపించవు. ఎందుకంటే ఇక్కడ 'డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్' వాడుతున్నారు. మన ఇళ్లలో వాడే నార్మల్ ఏసీల వల్ల బయట వేడి పెరిగిపోయి నగరాలు హీట్ ఐలాండ్స్ లా మారుతున్నాయి. దానికి చెక్ పెట్టేందుకే ఈ గ్రీన్ టెక్నాలజీ. గుజరాత్ గిఫ్ట్ సిటీలో, అలాగే మన హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఆల్రెడీ ఇలాంటి సిస్టమ్ వాడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక సిటీ మొత్తానికి దీన్ని అప్లై చేస్తున్నారు.

55
ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే?
Image Credit : Gemini

ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే?

• ఒక పెద్ద సెంట్రల్ ప్లాంట్‌లో వాటర్‌ను 5 డిగ్రీల సెల్సియస్ వరకు బాగా చల్లబరుస్తారు.

• ఆ చల్లటి నీటిని సిటీలోని ప్రతి బిల్డింగ్‌కు, ప్రతి రూమ్‌కు అండర్ గ్రౌండ్ పైప్‌లైన్స్ ద్వారా సప్లై చేస్తారు.

• బిల్డింగ్‌లలో ఉండే ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు ఆ పైపుల ద్వారా వచ్చే చల్లదనాన్ని రూమ్ అంతా స్ప్రెడ్ చేస్తాయి.

• గదిలోని వేడిని లాగేసుకోవడం వల్ల ఆ నీరు మళ్లీ వేడెక్కుతుంది. ఆ వేడి నీటిని మళ్లీ పైపుల ద్వారా మెయిన్ ప్లాంట్‌కు పంపి చల్లబరుస్తారు.

• ఈ ప్రాసెస్ నిరంతరం లూప్‌లా సాగుతూనే ఉంటుంది. దీనివల్ల నార్మల్ ఏసీలతో పోలిస్తే 30 శాతం కరెంట్ ఆదా అవుతుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
పేదలకు ప్రభుత్వం శుభవార్త.. రూ.10 లక్షల కవరేజ్‌తో 1,800కు పైగా చికిత్సలు
Recommended image2
వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
Recommended image3
Now Playing
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Related Stories
Recommended image1
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Recommended image2
EPF + SIP అదిరిపోయే కాంబో.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో మీ అకౌంట్‌లోకి రూ. 1 కోటి పక్కా బాస్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved