MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే

IPL 2026 Eliminator: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే

IPL 2026 Eliminator: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో 47 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. హైదరాబాద్ ప్లేఆఫ్స్ ప్రయాణానికి బ్రేక్ పడటానికి గల 5 ముఖ్య కారణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. 

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 28 2026, 06:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
15 ఏళ్ల కుర్రాడి చేతిలో పడి విలవిల్లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్
Image Credit : ANI

15 ఏళ్ల కుర్రాడి చేతిలో పడి విలవిల్లాడిన సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రయాణం ముగిసింది. ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన హై-స్కోరింగ్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 47 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఘోరంగా ఓడించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, ఈ కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి దారితీసిన 5 ప్రధాన కారణాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. బౌలర్ల వైఫల్యం
Image Credit : ANI

1. వైభవ్ సూర్యవంశీ ఊచకోత.. బౌలర్ల వైఫల్యం

సన్‌రైజర్స్ ఓటమికి అత్యంత ప్రధాన కారణం రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్. ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి హైదరాబాద్ బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేశాడు. కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

సన్‌రైజర్స్ బౌలర్లు వేసిన యార్కర్లు, స్లోయర్ డెలివరీలు, షార్ట్ పిచ్ బంతులు.. ఇలా దేన్నీ వదలకుండా స్టేడియం దాటించాడు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేయగా, అందులో సూర్యవంశీ చేసిన పరుగులే ఎక్కువ. ఇతని విధ్వంసం వల్లే రాజస్థాన్ అంతటి భారీ స్కోరు చేయగలిగింది.

36
2. ధృవ్ జురెల్ మెరుపు హాఫ్ సెంచరీ.. కమిన్స్ బిగ్ స్పెల్
Image Credit : ANI

2. ధృవ్ జురెల్ మెరుపు హాఫ్ సెంచరీ.. కమిన్స్ బిగ్ స్పెల్

సూర్యవంశీ 8వ ఓవర్లో అవుట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ బౌలర్లకు ప్రశాంతత దక్కలేదు. వన్ డౌన్ లో వచ్చిన ధృవ్ జురెల్ కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసి మొమెంటం తగ్గకుండా చూసుకున్నాడు. మరోవైపు సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు.

కమిన్స్ తన 4 ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు. అతని టీ20 కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన స్పెల్ కావడం గమనార్హం. హుస్సేన్ 4 ఓవర్లలో 52 పరుగులు, ప్రఫుల్ హింగే 3 వికెట్లు తీసినప్పటికీ 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి భారీగా పరుగులు ఇచ్చాడు.

46
3. పవర్ ప్లేలోనే జోఫ్రా ఆర్చర్ దెబ్బ.. అభిషేక్ శర్మ డక్ అవుట్
Image Credit : ANI

3. పవర్ ప్లేలోనే జోఫ్రా ఆర్చర్ దెబ్బ.. అభిషేక్ శర్మ డక్ అవుట్

244 పరుగుల భారీ టార్గెట్ చేజ్ చేయాలంటే సన్‌రైజర్స్‌కు పవర్ ప్లేలో అదిరిపోయే స్టార్ట్ కావాలి. కానీ, రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్‌ను పవర్ ప్లేలోనే కూల్చేశాడు. ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మను ఇన్నింగ్స్ రెండో బంతికే డక్ అవుట్ (0) చేసి ఆర్చర్ భారీ షాక్ ఇచ్చాడు.

ఈ ఏడాది టీ20ల్లో అభిషేక్ శర్మకు ఇది 8వ డక్ కావడం గమనార్హం. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రమాదకరంగా మారుతున్న ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33 పరుగులు) ను కూడా ఆర్చర్ పెవిలియన్‌కు పంపాడు. పవర్ ప్లే లోపలే సన్‌రైజర్స్ ప్రధాన వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది.

56
4. ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఘోర వైఫల్యం
Image Credit : Getty

4. ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఘోర వైఫల్యం

కీలక మ్యాచ్‌ల్లో జట్టును గెలిపిస్తారని నమ్ముకున్న స్టార్ బ్యాటర్లు ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ ఈ మ్యాచ్‌లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ట్రావిస్ హెడ్ 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను నిలబెడతాడనుకున్న హెన్రిచ్ క్లాసెన్ కూడా నిరాశపరిచాడు. యష్ రాజ్ పుంజా వేసిన 7వ ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడబోయి 18 పరుగులకే ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. దీంతో 83 పరుగులకే సన్‌రైజర్స్ 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

66
5. మిడిల్ ఆర్డర్ పోరాటం సరిపోలేదు.. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్ల పతనం
Image Credit : ANI

5. మిడిల్ ఆర్డర్ పోరాటం సరిపోలేదు.. రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వికెట్ల పతనం

టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (20 బంతుల్లో 38 పరుగులు), సలీల్ అరోరా (21 బంతుల్లో 35 పరుగులు) కాసేపు మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, రవీంద్ర జడేజా తన అనుభవాన్ని ఉపయోగించి ఒకే ఓవర్లో నితీష్ రెడ్డిని, ఆ తర్వాత ఓవర్లో సలీల్ అరోరాను అవుట్ చేసి హైదరాబాద్ ఆశలపై నీళ్లు చల్లాడు.

జడేజా 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఒకవైపు రన్ రేట్ బాగానే ఉన్నప్పటికీ, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం వల్ల సన్‌రైజర్స్ లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. చివరికి శివాంగ్ కుమార్ (27) అవుట్ కావడంతో సన్‌రైజర్స్ కథ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లు, నండ్రే బర్గర్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లతో అద్భుతంగా రాణించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
IPL Hit Wicket : హిస్టరీలోనే ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూసుండరు.. అయ్యో సాయి సుదర్శన్ ! ఇలా అవుటైతే ఏమనాలి బ్రో!
Recommended image2
Jio New OTT Pass: జియో మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. రూ.200 కే 15 ఓటీటీలు ఫ్రీ.. ఇక నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లొల్లి లేదు బాస్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved