MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !

WhatsApp e Challan: వాహనదారులకు అలర్ట్.. వాట్సాప్‌లోనే ట్రాఫిక్ చలాన్లు.. 30 రోజుల్లో ఆ పని చేయకపోతే లైసెన్స్ కట్ !

WhatsApp e Challan: తెలంగాణలో ఇకపై వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా కూడా ట్రాఫిక్ చలాన్లు జారీ కానున్నాయి. వాహనదారులు 30 రోజుల్లోగా వాహన్ పోర్టల్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరని ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 03 2026, 08:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వాహనదారులకు బిగ్ షాక్.. మెసేజ్ చూడలేదంటే కుదరదు, నెల రోజుల్లోగా ఇది మార్చాల్సిందే!
Image Credit : Gemini

వాహనదారులకు బిగ్ షాక్.. మెసేజ్ చూడలేదంటే కుదరదు, నెల రోజుల్లోగా ఇది మార్చాల్సిందే!

డ్రైవర్లకు, వాహన యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, ఇంటికి కాగితం చలాన్లు రావడం అనే పాత పద్ధతికి కాలం చెల్లిపోయింది. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా సిగ్నల్ జంప్ చేసినా లేదా హెల్మెట్ లేకుండా దొరికిపోయినా.. చలాన్లు నేరుగా మీ వాట్సాప్, ఎస్‌ఎమ్‌ఎస్ లేదా ఈ-మెయిల్‌కే వచ్చేస్తుంది.

"మాకు మెసేజ్ రాలేదు.. మేము చూసుకోలేదు" అంటూ ఇకపై సాకులు చెబితే అస్సలు కుదరదు. ఈ సరికొత్త డిజిటల్ సిస్టమ్‌ను తీసుకొస్తూ రవాణా శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన జూన్ 2 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్‌కు 30 రోజుల డెడ్‌లైన్
Image Credit : Gemini AI

వాహన్ పోర్టల్‌లో అప్‌డేట్‌కు 30 రోజుల డెడ్‌లైన్

రాష్ట్రంలోని వాహన యజమానులంతా తమ ప్రస్తుత వాడుకలో ఉన్న మొబైల్ నంబర్‌ను, ఈ-మెయిల్ ఐడీని కేంద్ర ప్రభుత్వ అధికారిక ‘వాహన్’ (Vahan) పోర్టల్‌లో కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం 30 రోజులు టైమ్ ఇచ్చింది. ఒకవేళ మీరు గడువు ముగిసేలోపు నంబర్ అప్‌డేట్ చేసుకోకపోతే, లేదా పాత నంబర్‌నే అలాగే వదిలేస్తే.. ఆ పాత నంబర్‌కు వెళ్లిన చలాన్లు మీకు అందినట్లుగానే అధికారులు చట్టబద్ధంగా భావిస్తారు. నాకు తెలియదు అని తప్పించుకోవడానికి వీల్లేకుండా ఈ రూల్‌ను చాలా స్ట్రిక్ట్‌గా డిజైన్ చేశారు.

Related Articles

Related image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Related image2
IMD Rain Alert: రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు
35
45 రోజుల్లో క్లియర్ చేయకపోతే లైసెన్స్ కట్
Image Credit : Asianet News

45 రోజుల్లో క్లియర్ చేయకపోతే లైసెన్స్ కట్

కేంద్ర మోటారు వాహనాల నిబంధనల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన కేవలం మూడు రోజుల్లోనే ఈ-చలాన్లు డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డైరెక్ట్‌గా పంపాల్సి వస్తే 15 రోజుల్లోగా సదరు వ్యక్తికి చేరాలి. అయితే, వాట్సాప్ లేదా ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా చలాన్లు అందిన తర్వాత వాహనదారుడికి జరిమానా చెల్లించడానికి లేదా దాన్ని సవాల్ చేయడానికి గరిష్ఠంగా 45 రోజుల గడువు ఉంటుంది.

ఈ 45 రోజుల్లోగా చలాన్లు క్లియర్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. పెండింగ్ చలాన్లు అలాగే ఉంచేస్తే, సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్, లేదా బండి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఎలాంటి అప్లికేషన్లను రవాణా శాఖ ప్రాసెస్ చేయదు. అంటే మీ లైసెన్స్, ఆర్‌సీ బ్లాక్ అయినట్లే.

45
తప్పుడు చలాన్లు పడితే ఆన్‌లైన్‌లోనే సవాల్ చేయొచ్చు
Image Credit : Asianet News

తప్పుడు చలాన్లు పడితే ఆన్‌లైన్‌లోనే సవాల్ చేయొచ్చు

కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా వేరే బండి నంబర్ పడటం వల్లనో, సాంకేతిక లోపాల వల్లానో మనకు తప్పుడు చలాన్లు వస్తుంటాయి. ఇలాంటి టైమ్‌లో కంగారు పడాల్సిన అవసరం లేదు. చలాన్లు తప్పనిపిస్తే దాన్ని ఆన్‌లైన్ ద్వారానే సవాల్ చేసే ఛాన్స్ ప్రభుత్వం కల్పించింది. నిర్దేశిత ఆన్‌లైన్ పోర్టల్‌లో తగిన ఆధారాలు (ఫోటోలు లేదా డాక్యుమెంట్లు) అప్‌లోడ్ చేసి అప్పీల్ చేసుకోవచ్చు.

వీటిని పరిష్కరించడానికి జిల్లావారీగా పోలీస్, రవాణా శాఖ అధికారులను గ్రీవెన్స్ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. వీరు మీ ఫిర్యాదును పరిశీలించి చలాన్లు తప్పని తేలితే, దాన్ని రద్దు చేసి ఆ ఆర్డర్ కాపీని డైరెక్ట్‌గా మీ మొబైల్‌కే పంపుతారు. ఒకవేళ మీ అభ్యంతరాన్ని అధికారి తిరస్కరిస్తే, ఆ ఆర్డర్ వచ్చిన 30 రోజుల్లోగా ఫైన్ కట్టాలి. లేదంటే 50% డిపాజిట్ చేసి కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.

55
ఆరు నెలల్లో మారనున్న టోటల్ సిస్టమ్
Image Credit : PTI

ఆరు నెలల్లో మారనున్న టోటల్ సిస్టమ్

ప్రస్తుతం మన రాష్ట్రంలో లోకల్ ఆన్‌లైన్ చలాన్లు సిస్టమ్ నడుస్తోంది. దీనికి ప్రభుత్వం 6 నెలల గడువు విధించింది. రాబోయే ఆరు నెలల్లోగా తెలంగాణ పోలీస్, రవాణా శాఖలు తమ పాత చలాన్ల వ్యవస్థను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సారథి–వాహన్’ ఈ-చలాన్ సిస్టమ్‌కు పూర్తిగా బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనివల్ల దేశవ్యాప్తంగా చలాన్ల ప్రక్రియ అంతా ఒకే తాటిపైకి వస్తుంది. అలాగే, ఒక ఏడాదిలో ఏదైనా వాహనం లేదా వ్యక్తి 5 కంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, దాన్ని సీరియస్ కేస్‌గా పరిగణిస్తారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert: రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
మనల్ని ఎవర్రా ఆపేది.. తెలంగాణలో తిరుగుతాం..పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Latest Speech| Asianet Telugu
Recommended image3
Now Playing
తెలంగాణ రాజకీయాల్లో దడ పుట్టించే పవన్ ఫైర్ స్పీచ్ | Pawan Kalyan Pressmeet | Asianet News Telugu
Related Stories
Recommended image1
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Recommended image2
IMD Rain Alert: రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved