MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !

Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !

Lalit Modi: మాజీ ఐపీఎల్ బాస్ లలిత్ మోదీ బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌తో తన రిలేషన్‌షిప్‌పై స్పందించారు. ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం తప్పు అని, బయటకు వెళ్తే ఖర్చులు ఆమెనే పెట్టుకునేదని పేర్కొన్నారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 02 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Lalit Modi: నేను ఆమె దగ్గర కెప్ట్ బాయ్‌ఫ్రెండ్ లా ఉన్నా.. సుస్మితా సేన్‌పై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
Image Credit : X/LalitKModi

Lalit Modi: నేను ఆమె దగ్గర కెప్ట్ బాయ్‌ఫ్రెండ్ లా ఉన్నా.. సుస్మితా సేన్‌పై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ మాజీ చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ, బాలీవుడ్ స్టార్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ రిలేషన్‌షిప్ 2022లో దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి.

అయితే, ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తాజాగా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో లలిత్ మోదీ తన పాత లవ్ స్టోరీ గురించి, సుస్మితా సేన్‌తో ఉన్న బాండింగ్ గురించి ఓపెన్ అయ్యారు. సుస్మితా సేన్ తన జీవితంలో ఎప్పటికీ వెరీ స్పెషల్ అని చెప్పుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నేను ఆమె దగ్గర కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉన్నా
Image Credit : X/LalitKModi

నేను ఆమె దగ్గర కెప్ట్ బాయ్‌ఫ్రెండ్‌లా ఉన్నా

2022లో వీరిద్దరి రిలేషన్ బయటకు రాగానే, సోషల్ మీడియాలో సుస్మితా సేన్‌ను చాలా మంది ట్రోల్ చేశారు. లలిత్ మోదీ డబ్బు చూసే ఆమె ప్రేమించిందంటూ గోల్డ్ డిగ్గర్ అని కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణలపై లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు.

"సుస్మిత చాలా అందమైన, సొంతంగా ఎదిగిన మహిళ. ఆమె ఎవరి డబ్బు పైనా ఆధారపడలేదు. మా ఇద్దరిలో ఎప్పుడు బయటకు వెళ్లినా రూపాయి కూడా నన్ను ఖర్చు పెట్టనిచ్చేది కాదు. అన్నింటికీ ఆమెనే డబ్బులు కట్టేది. నిజం చెప్పాలంటే నేను ఆమె దగ్గర ఒక కెప్ట్ బాయ్‌ఫ్రెండ్ లా ఉండేవాడిని" అంటూ లలిత్ మోదీ నవ్వుతూ చెప్పారు. ఆమె ఎవరి దగ్గర నుండి ఏమీ ఆశించదని, అందుకే ఆమెను గోల్డ్ డిగ్గర్ అనడం పూర్తిగా తప్పని అన్నారు. ఒకవేళ అనాలనుకుంటే తనను డైమండ్ డిగ్గర్ అనవచ్చని, ఎందుకంటే సుస్మిత ఒక రియల్ డైమండ్ అని అన్నారు.

35
ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు సుస్మితా సేన్ దగ్గరే ఉన్నాయి
Image Credit : X/LalitKModi

ప్రపంచంలోనే ఎక్కువ వజ్రాలు సుస్మితా సేన్ దగ్గరే ఉన్నాయి

సుస్మితా సేన్ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ లలిత్ మోదీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "సుస్మిత చాలా ధనవంతురాలు. ఈ విషయం ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు కానీ, నాకు తెలిసిన వాళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా వజ్రాలు ఉన్న మహిళ సుస్మితా సేన్. అవన్నీ ఆమె సొంత కష్టంతో సంపాదించుకుంది. ఆమెకు డైమండ్ స్టోర్స్ కూడా ఉన్నాయి" అని తెలిపారు. సుస్మితా సేన్ ఒక ప్రౌడ్, సెల్ఫ్ మేడ్ ఉమెన్ అని, వారి రిలేషన్‌లో డబ్బు అనేది ఎప్పుడూ ఒక మ్యాటరే కాదని స్పష్టం చేశారు.

45
ఫ్లైట్‌లో గొడవ.. ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఆ ఒక్క పోస్ట్
Image Credit : X/LalitKModi

ఫ్లైట్‌లో గొడవ.. ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఆ ఒక్క పోస్ట్

2022 జూలైలో సుస్మితా సేన్‌తో కలిసి దిగిన ఫోటోలను లలిత్ మోదీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆమె నా బెటర్ హాఫ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఆ సీక్రెట్ లవ్ స్టోరీ పోస్ట్ వెనుక ఉన్న అసలు కథను లలిత్ మోదీ ఇప్పుడు బయటపెట్టారు.

"ఆ పోస్ట్ పెట్టాలని మేము ముందే ఏమీ ప్లాన్ చేసుకోలేదు. మేము ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో విషయంలో ఇద్దరం వాదించుకున్నాం. 'నువ్వు ఈ ఫోటోలు పోస్ట్ చేయలేవు' అని ఆమె నాతో ఛాలెంజ్ చేసింది. నేను నవ్వుకుంటూ అక్కడికక్కడే ఆమె ముందే పోస్ట్ బటన్ నొక్కేశాను. మేము ఫ్లైట్ ల్యాండ్ అయ్యేసరికి ఇంటర్నెట్ ఊగిపోయింది. అంతా రచ్చ రచ్చ అయిపోయింది" అని లలిత్ మోదీ గుర్తు చేసుకున్నారు.

అయితే ఆ పోస్ట్ పెట్టినందుకు ఇద్దరిలో ఎవరికీ ఎలాంటి బాధ లేదని, ఆ బ్యూటిఫుల్ స్టోరీలో ప్రతి నిమిషాన్ని తాను ఎంజాయ్ చేశానని, ఎప్పటికీ రిగ్రెట్ అవ్వనని చెప్పారు. ఈ వైరల్ పోస్ట్‌ల వల్ల 2022 గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో లలిత్ మోదీ నాల్గవ స్థానంలో, సుస్మిత ఐదవ స్థానంలో నిలిచారు.

55
దూరం పెరిగింది.. కానీ గౌరవం అలాగే ఉంది
Image Credit : our own

దూరం పెరిగింది.. కానీ గౌరవం అలాగే ఉంది

ప్రస్తుతం వారిద్దరూ కలిసి లేకపోవడానికి గల కారణాన్ని కూడా లలిత్ మోదీ చెప్పారు. ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్లే బ్రేకప్ అయిందని హింట్ ఇచ్చారు. అయినప్పటికీ ఆమె ఇప్పటికీ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు.

"సుస్మితా సేన్ నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి. నేను ఈ రోజు ఇలా ఉండటానికి ఆమె ఎంతో హెల్ప్ చేసింది. ఆమెతో ఉన్న రోజులు నా లైఫ్‌లో బెస్ట్ మెమొరీస్. ఒక సింగిల్ మదర్‌గా తన కూతుళ్లు రెనీ, అలీషాలను ఆమె పెంచిన విధానం అద్భుతం. ఆమె ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను" అని లలిత్ మోదీ అన్నారు.

గతంలో సుస్మితా సేన్ కూడా ఈ ట్రోల్స్‌పై స్పందిస్తూ.. "నేను బంగారం కంటే లోతుగా ఆలోచిస్తాను.. నాకు ఎప్పుడూ వజ్రాలే ఇష్టం. వాటిని నేనే సొంతంగా కొనుక్కుంటాను" అని ఇన్‌స్టాగ్రామ్‌లో గట్టి కౌంటర్ ఇచ్చారు. అలాగే 2023లో ఒక ఇంటర్వ్యూలో లలిత్ మోదీతో రిలేషన్‌షిప్‌ను తన జీవితంలో జస్ట్ ఒక ఫేజ్ మాత్రమే అని పేర్కొన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వినోదం
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Cancer Fighting Fruits: క్యాన్సర్ రిస్క్‌కు చెక్ పెట్టే సూపర్ ఫ్రూట్స్.. ఈ 6 పండ్లు మీ డైట్‌లో ఉన్నాయా?
Recommended image2
SIP Investment: రూ.2,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో లఖ్‌పతి అయ్యే ఛాన్స్.. ఈ సింపుల్ ట్రిక్ అస్సలు మిస్ అవ్వకండి!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved