MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సిద్ధిపేట‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 544 కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు

సిద్ధిపేట‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి.. రూ. 544 కోట్ల‌తో భారీ ప్రాజెక్టులు

Telangana: తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేటపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేట జిల్లాలో పర్యటించి మొత్తం రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 19 2026, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.400 కోట్లతో రెండు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు
Image Credit : Revanth Reddy/Youtube

రూ.400 కోట్లతో రెండు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు

జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఇందులో భాగంగా సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాలను రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. మొత్తం రూ.400 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విద్యాసంస్థలను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు జిల్లాలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.15.44 కోట్లు కేటాయించారు. దౌల్తాబాద్ మండలంలో రూ.7.80 కోట్లు, చిన్నకోడూరు మండలంలో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల నిర్మాణానికి కూడా పునాది వేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పరిపాలనా సౌకర్యాల కోసం కొత్త భవనాలు
Image Credit : Revanth Reddy/Youtube

పరిపాలనా సౌకర్యాల కోసం కొత్త భవనాలు

ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పరిపాలనలో సౌలభ్యం కల్పించేందుకు రెవెన్యూ శాఖలోనూ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. జిల్లాలో ఆరు నూతన తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి రూ.13.50 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ భవనాల నిర్మాణంతో రెవెన్యూ సేవల నిర్వహణకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు జనగామ నియోజకవర్గంలో మూడు విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణానికి రూ.6.89 కోట్లతో పనులు ప్రారంభించారు. మొత్తంగా కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టుల కోసం రూ.451.13 కోట్లతో ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.

35
రూ.54.67 కోట్లతో 14 విద్యుత్ సబ్‌స్టేషన్లు ప్రారంభం
Image Credit : Facebook

రూ.54.67 కోట్లతో 14 విద్యుత్ సబ్‌స్టేషన్లు ప్రారంభం

జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచే దిశగా ఇప్పటికే పూర్తయిన 14 విద్యుత్ సబ్‌స్టేషన్లను సీఎం ప్రారంభించారు. వీటి నిర్మాణానికి రూ.54.67 కోట్లు వెచ్చించారు. కొత్త సబ్‌స్టేషన్ల అందుబాటులోకి రావడంతో విద్యుత్ పంపిణీ సామర్థ్యం పెరగడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవకాశం కలగనుంది. గజ్వేల్‌లో రూ.1.59 కోట్లతో నిర్మించిన విద్యుత్ డివిజన్ కార్యాలయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. విద్యుత్ శాఖ కార్యకలాపాల నిర్వహణకు ఈ కార్యాలయం ఉపయోగపడనుంది.

45
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తులకు మెరుగైన వసతులు
Image Credit : ANI

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తులకు మెరుగైన వసతులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల సౌకర్యాల పెంపునకు చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా రూ.14.35 కోట్లతో నిర్మించిన ఆలయ సత్రాన్ని, రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన క్యూ కాంప్లెక్స్‌ను సీఎం ప్రారంభించారు. పండుగలు, జాతరలు, ప్రత్యేక సందర్భాల్లో ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఈ వసతులు ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా భక్తుల బస, దర్శనం కోసం వేచి ఉండే సమయంలో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఇవి దోహదపడనున్నాయి.

55
మహిళా సంఘాలకు భవనాలు.. బాలికలకు కొత్త విద్యాలయం
Image Credit : Asianet News

మహిళా సంఘాలకు భవనాలు.. బాలికలకు కొత్త విద్యాలయం

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.6.50 కోట్లతో నిర్మించిన 53 గ్రామ సంఘాల భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ భవనాలు మహిళా సంఘాల సమావేశాలు, ఇతర సామూహిక కార్యక్రమాలకు ఉపయోగపడనున్నాయి. అలాగే రాయపోల్ మండలంలో రూ.3.87 కోట్లతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. బాలికలకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడంలో ఈ భవనం కీలకంగా మారనుంది. ఇలా ఇప్పటికే పూర్తయిన రూ.92.98 కోట్ల విలువైన పనులను సీఎం ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనుల ప్రారంభోత్సవాలతో సిద్దిపేట జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఊతమిచ్చింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
 
1st TEST • NZ vs IND 2026
Stumps
NZNZ
(82.0 ov)243/5
INDIND
-
Day 1
Schedule ›
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(93.0 ov) 98 & 309/9
Day 3
Schedule ›
28th T20 • WBBLT20
AS-WAS-W
Fri, 20 Nov, 2026
MR-WMR-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
Result
BH-WBH-W
225/3
ST-WST-W
226/4
Sydney Thunder Women beat Brisbane Heat Women by 6 wickets
Schedule ›
26th T20 • WBBLT20
Result
HH-WHH-W
120
PS-WPS-W
148
Perth Scorchers Women beat Hobart Hurricanes Women by 28 runs
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
29th T20 • WBBLT20
HH-WHH-W
Sat, 21 Nov, 2026
ST-WST-W
06:30 am
Match yet to begin.
Schedule ›
30th T20 • WBBLT20
SS-WSS-W
Sat, 21 Nov, 2026
PS-WPS-W
10:00 am
Match yet to begin.
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
2nd TEST • NZ vs IND 2026
NZNZ
Fri, 27 Nov, 2026
INDIND
03:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
సిద్ధిపేట‌లో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌లు
Recommended image2
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే?
Recommended image3
School Holidays : కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఈరోజు సెలవు ఉన్నట్లా, లేనట్లా?
Related Stories
Recommended image1
మీ కూతురు పెళ్లి స‌మ‌యానికి రూ. 70 ల‌క్ష‌లు కావాలా.? వెంట‌నే ఈ అకౌంట్ ఓపెన్ చేయండి
Recommended image2
రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై 24 గంట‌లూ షాప్స్‌ ఓపెన్‌, మ‌ద్యం దుకాణాలు కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved