MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert: రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు

IMD Rain Alert: రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు

IMD Rain Alert: తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణా, ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 03 2026, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వచ్చే 4 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
Image Credit : chatgpt

వచ్చే 4 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అదిరిపోయే చల్లటి కబురు చెప్పింది. భానుడి భగభగలకు బ్రేక్ పడే టైం వచ్చేసింది. రానున్న 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం తాజా బులిటెన్‌లో వెల్లడించింది. ఆకాశంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రుతుపవనాల జోరు.. కేరళ ఎంట్రీకి రూట్ క్లియర్
Image Credit : AI PHOTO

రుతుపవనాల జోరు.. కేరళ ఎంట్రీకి రూట్ క్లియర్

నైరుతి రుతుపవనాల గమనం ప్రస్తుతం చాలా చురుగ్గా సాగుతోంది. మొన్నటివరకు కాస్త స్తబ్దుగా ఉన్న రుతుపవనాలు ఇప్పుడు స్పీడందుకున్నాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించాయి. జూన్ 4వ తేదీ నాటికి ఇవి కేరళతో పాటు తమిళనాడు తీరాన్ని తాకేందుకు పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడిందని ఐఎండీ స్పష్టం చేసింది. కేరళ, అరేబియా సముద్రంపై ఉన్న ఉపరితల ఆవర్తనం వల్ల మేఘాలు ఏకంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయి. ఈసారి రుతుపవనాలు జూన్ 10 తర్వాత తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

36
పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. గంటకు 60 కిమీ వేగంతో గాలులు
Image Credit : chatgpt

పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. గంటకు 60 కిమీ వేగంతో గాలులు

రుతుపవనాల ముందస్తు ఆగమన సూచనలతో తెలంగాణకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతోంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.

46
గ్రేటర్ హైదరాబాద్‌కు వాన గండం..
Image Credit : Gemini

గ్రేటర్ హైదరాబాద్‌కు వాన గండం..

మరోవైపు భాగ్యనగరవాసులకు కూడా వాతావరణ శాఖ చల్లని ముచ్చట చెప్పింది. వచ్చే శుక్రవారం వరకు హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఐఎండీ తెలిపింది. ప్రముఖ వెదర్ అనలిస్ట్ టి. బాలాజీ అంచనా ప్రకారం.. బుధవారం సాయంత్రం లేదా రాత్రి వేళల్లో హైదరాబాద్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. నగరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

56
పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Image Credit : Meta AI

పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రంలో ఎండలు రికార్డులు బ్రేక్ చేశాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్‌ను దాటేసి జనాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిన్న సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో 44.8 డిగ్రీలు, నల్గొండలో 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, తాజా వర్ష సూచనతో టెంపరేచర్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా ఏన్కూరులో 7.9 సెం.మీ, తల్లాడలో 6 సెం.మీ, అశ్వారావుపేటలో 4 సెం.మీ చొప్పున భారీ వర్షపాతం రికార్డైంది. రాబోయే మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింత తగ్గి వాతావరణం పూర్తిగా కూల్ కానుంది.

66
ఏపీలోనూ అదే సీన్.. పిడుగులతో జాగ్రత్త
Image Credit : Getty

ఏపీలోనూ అదే సీన్.. పిడుగులతో జాగ్రత్త

తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమల్లోనూ జూన్ 3 నుంచి 6 వరకు వాతావరణం రసవత్తరంగా మారనుంది. కోస్తాంధ్రా, రాయలసీమల్లో పిడుగులు పడే ముప్పు చాలా ఎక్కువగా ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అటు బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వరకు ఉండటంతో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని స్పష్టం చేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Cyclone: తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు.. 5 ఐదు రోజులు భారీ వర్షాలు
Recommended image2
Cyclone Murasu : ఏపీనే కాదు తెలంగాణను వదలని మురసు తుపాను.. ఇక కుండపోత వర్షాలే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Recommended image3
వారికి వెంట‌నే చేయూత పింఛ‌న్‌.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం
Related Stories
Recommended image1
Amarnath Yatra 2026: లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే.. హైదరాబాద్ టు అమర్‌నాథ్ యాత్ర ఫుల్ ట్రైన్ ప్లాన్ ఇదిగో !
Recommended image2
Hyderabad Real Estate: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సునామీ.. పక్కనే మరో భాగ్యనగరం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved