MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జూన్ 2వ తేదీ చాలా కీల‌కం.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల‌తో పాటు మరెన్నో

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జూన్ 2వ తేదీ చాలా కీల‌కం.. ప్ర‌తీ కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల‌తో పాటు మరెన్నో

Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతోంది. జూన్ 2న పలు కొత్త పథకాలు ప్రారంభించడంతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న స్కీమ్స్‌ను మరింత విస్తరించే ప్రణాళికను రూపొందించింది. 

3 Min read
Author : Narender Vaitla
Published : May 20 2026, 07:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకానికి శ్రీకారం
Image Credit : Gemini AI

ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకానికి శ్రీకారం

రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా’ పథకాన్ని ప్రారంభించబోతోంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ స్కీమ్ కింద ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల వరకు జీవిత భీమా రక్షణ కల్పించనున్నారు. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో భారీ నిధులు కేటాయించింది. ఈ స్కీమ్ అమలు కోసం ఎల్‌ఐసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే విధివిధానాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కుటుంబ పెద్ద మరణించిన సందర్భంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకం పెద్ద ఊరటనివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు లక్షల కొత్త పెన్షన్లు.. చేయూత విస్తరణ
Image Credit : iSTOCK

రెండు లక్షల కొత్త పెన్షన్లు.. చేయూత విస్తరణ

ప్రస్తుతం అమలులో ఉన్న చేయూత పథకాన్ని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కొత్తగా సుమారు రెండు లక్షల మంది అర్హులకు వృద్ధాప్య, వితంతు, ఇతర సామాజిక భద్రతా పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ పెన్షనర్లకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ఆర్థిక సాయం అందుతోంది. కొత్త లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. పెన్షన్ మొత్తాన్ని పెంచే అంశంపై కూడా ప్రభుత్వం పరిశీలన జరుపుతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో వేలాది కుటుంబాలు ఈ నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Related Articles

Related image1
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Related image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు
35
ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రత్యేక దృష్టి
Image Credit : Asianet News

ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రత్యేక దృష్టి

సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో దశను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది. సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. జూన్ 2 నుంచి ఇందుకు సంబంధించిన నిధుల విడుదల ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్రజల ఉపాధికి దూరంగా కాకుండా, ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్ల కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇప్పటికే నిర్మాణం పూర్తై, మౌలిక సదుపాయాల లేమితో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లకు విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కల్పించి అర్హులకు అప్పగించనున్నారు.

45
ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం.. డిజిటల్ హెల్త్ కార్డులు
Image Credit : Getty

ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం.. డిజిటల్ హెల్త్ కార్డులు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకురానుంది. దాదాపు 23 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిగా క్యాష్‌లెస్ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం కింద వేల సంఖ్యలో వ్యాధులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల డేటా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది.విద్య, ఉపాధి రంగాల్లో కొత్త కార్యక్రమాలు

విద్యార్థులు, నిరుద్యోగ యువత కోసం కూడా ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ప్రతి నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసే ప్రణాళికకు ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. డిజిటల్ క్లాస్‌రూమ్స్‌, ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాలు, మెరుగైన బోధన విధానాలతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది.

అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా విస్తరించనున్నారు. భవిష్యత్తులో అల్పాహారం అందించే అవకాశాలపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరోవైపు నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ‘సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నారు. జర్మనీ వంటి దేశాల్లో ఉపాధి అవకాశాలకు అవసరమైన భాషా శిక్షణ, వీసా మార్గదర్శకాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ఇక వైద్య రంగంలో భాగంగా సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిలో పాక్షిక సేవలను కూడా జూన్ 2 నుంచే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పలు శుభవార్తలు అందనున్నాయి.

55
విద్య, ఉపాధి రంగాల్లో కొత్త కార్యక్రమాలు

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
అనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్
Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rains : సాయంత్రం ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... రెడ్ అలర్ట్, ఇక అల్లకల్లోలమే..!
Recommended image2
National Highway: తెలంగాణలో ఆ జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి.. కేంద్రం మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ !
Recommended image3
Summer Holidays : తెలుగు పిల్లలు ఎగిరిగంతేసే సమాచారం.. మరో 13 రోజులు వేసవి హాలిడేస్ పొడిగింపు
Related Stories
Recommended image1
Projector: రూ. 3 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. హైఎండ్ ఫీచ‌ర్ల‌తో స్మార్ట్ ప్రొజెక్ట‌ర్‌
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 700 కోట్ల‌తో, 63 అంత‌స్థుల అపార్ట్‌మెంట్‌, ఒక్క ప్లాట్ ధ‌ర రూ. 6.2 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved