100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం

Share this Video

హైదరాబాద్‌ జలమండలిలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. జలమండలిలో పనిచేస్తున్న జనరల్‌ మేనేజర్‌ కుమార్‌పై ఏసీబీ భారీ స్థాయిలో దాడులు నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మంగళవారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్‌తో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మల్లాపూర్‌లోని కుమార్ నివాసంలో ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. కుమార్‌కు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.

Related Video