MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heart Shaped Glass Bridge: ప్రేమికులకు పండగే.. హార్ట్ షేప్ లో తెలంగాణ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జి! ఎక్కడంటే?

Heart Shaped Glass Bridge: ప్రేమికులకు పండగే.. హార్ట్ షేప్ లో తెలంగాణ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జి! ఎక్కడంటే?

Telangana Glass Bridge: తెలంగాణలో మొదటి హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జిని హుస్నాబాద్‌లో నిర్మిస్తున్నారు. రూ.18 కోట్లతో డెవలప్‌మెంట్‌ పనులతో ఎల్లమ్మ చెరువు పర్యాటక హబ్‌గా రూపుదిద్దుకుంటోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 13 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలోనే ఫస్ట్.. హుస్నాబాద్‌లో హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జి: మరో 3 నెలల్లో ఓపెనింగ్
Image Credit : Gemini

తెలంగాణలోనే ఫస్ట్.. హుస్నాబాద్‌లో హార్ట్ షేప్ గ్లాస్ బ్రిడ్జి: మరో 3 నెలల్లో ఓపెనింగ్

తెలంగాణ పర్యాటక రంగం కొత్త అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రత్యేకించి ఇది హార్ట్ షేప్ లో ఉండటం విశేషం. మూడు నెలల్లోనే పర్యాటకుల సందడి కోసం ఈ వంతెన సిద్ధం కానుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
రూ. 5 కోట్లతో గ్లాస్ వండర్
Image Credit : Gemini

రూ. 5 కోట్లతో గ్లాస్ వండర్

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ గ్లాస్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. సుమారు రూ. 5 కోట్ల వ్యయంతో ఈ గ్లాస్ వంతెనను నిర్మిస్తున్నారు. దీని పొడవు 150 మీటర్లు కాగా, వెడల్పు 1.5 మీటర్లు ఉంటుంది. నీటి మట్టానికి దాదాపు 20 అడుగుల ఎత్తులో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీనిపై నడుస్తుంటే గాలిలో తేలియాడుతున్న అనుభూతి కలుగుతుందనీ, దీనికోసం అత్యంత బలమైన ట్రాన్స్‌పరెంట్ గ్లాస్ ప్యానెల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇంజనీర్లు సేఫ్టీ టెస్టులు నిర్వహిస్తున్నారు.

Related Articles

Related image1
Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!
Related image2
Gold Price: అమాంతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలే !
35
హార్ట్ షేప్ అట్రాక్షన్.. కొత్త పర్యాటక హబ్
Image Credit : Gemini

హార్ట్ షేప్ అట్రాక్షన్.. కొత్త పర్యాటక హబ్

మొత్తం రూ. 18 కోట్ల భారీ వ్యయంతో ఎల్లమ్మ చెరువు ఫ్రంట్ డెవలప్‌మెంట్ పనులు జరుగుతున్నాయి. సిద్దిపేటలోని కోమటి చెరువు తరహాలో దీనిని తీర్చిదిద్దుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. హుస్నాబాద్‌ను ఒక మేజర్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనివల్ల స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

45
ఏమేం ఉండబోతున్నాయి?
Image Credit : Gemini

ఏమేం ఉండబోతున్నాయి?

గ్లాస్ బ్రిడ్జితో పాటు ఇక్కడ మరిన్ని హంగులు సిద్ధమవుతున్నాయి. పర్యాటకుల కోసం అందమైన గార్డెన్లు, వాకింగ్ ట్రాక్, పచ్చదనంతో నిండిన ల్యాండ్‌స్కేప్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ ఘాట్‌ను కూడా నిర్మిస్తున్నారు. సాయంత్రం వేళల్లో పర్యాటకులు ఎంజాయ్ చేయడానికి స్పెషల్ లైటింగ్ సిస్టమ్, సెల్ఫీలు దిగడానికి ప్రత్యేక ఫోటో పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే ఫ్యామిలీతో కలిసి వీకెండ్ గడపడానికి ఇదొక బెస్ట్ ప్లేస్ అవుతుంది.

55
మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి..
Image Credit : Gemini

మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి..

మున్సిపల్ కమిషనర్ టి. మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ, గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపారు. సాంకేతిక పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని ఆయన చెప్పారు. మరో మూడు నెలల్లో అన్ని భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసి, తుది మెరుగులు దిద్ది ప్రజల సందర్శనార్థం దీనిని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ టూరిజం మ్యాప్‌లో హుస్నాబాద్ పేరు మార్మోగిపోవడం ఖాయం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad: ఒక్క ఫ్లాట్ ధ‌ర రూ. 23 కోట్లు.. హైదరాబాద్‌లో అత్యంత ఖ‌రీదైన అపార్ట్‌మెంట్స్ ఇవే
Recommended image2
IMD Rain Alert : రోహిణి కార్తె ఎండల వేళ ఏమిటీ వానలు...? ఇక దబిడిదిబిడే..!
Recommended image3
Hyderabad: రూ. 530 కోట్ల‌తో మెగా ప్రాజెక్ట్‌.. హైద‌రాబాదీలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి
Related Stories
Recommended image1
Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!
Recommended image2
Gold Price: అమాంతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved