MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!

Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!

Hyderabad Bullet Train: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు ఇక్కడి నుంచే హైస్పీడ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 12 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శంషాబాద్ వద్ద 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ హబ్.. సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే
Image Credit : AI

శంషాబాద్ వద్ద 650 ఎకరాల్లో బుల్లెట్ ట్రైన్ హబ్.. సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదే

హైదరాబాద్ సిటీ గ్లోబల్ లెవల్‌లో దూసుకుపోతోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాల్లో టాప్‌లో ఉన్న మన భాగ్యనగరం.. త్వరలో 'సౌత్ ఇండియా బుల్లెట్ ట్రైన్ గేట్‌వే'గా మారబోతోంది. జెట్ స్పీడ్ దూసుకెళ్లే బుల్లెట్ రైళ్ల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పక్కనే ఒక మెగా హబ్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ, తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా వేగంగా జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బహదూర్‌గూడ ఇక బుల్లెట్ అడ్డా
Image Credit : Gemini

బహదూర్‌గూడ ఇక బుల్లెట్ అడ్డా

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేకు అత్యంత సమీపంలో ఉన్న బహదూర్‌గూడ ప్రాంతాన్ని ఈ భారీ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. ఇక్కడ దాదాపు 650 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటం విశేషం. ఈ హబ్ కోసం కనీసం 400 నుంచి 500 ఎకరాలు అవసరమవుతాయని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు ఆనుకుని ఉండటంతో ట్రాన్స్‌పోర్ట్ కనెక్టివిటీ ఇబ్బందులు ఉండవు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ హబ్ ఎయిర్‌పోర్ట్‌కు వీలైనంత దగ్గరగా ఉండాలని పట్టుబట్టడంతో అధికారులు ఈ లొకేషన్‌ను ఫైనల్ చేశారు.

Related Articles

Related image1
Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?
Related image2
Countries With No Snakes: పాముల భయం లేని దేశాలు ఇవి.. అక్కడ ఒక్క పాము కూడా ఎందుకు ఉండదో తెలుసా?
35
ముంబై, బెంగళూరులకు గంటల్లోనే..
Image Credit : Gemini

ముంబై, బెంగళూరులకు గంటల్లోనే..

ఈ హబ్ నుంచి హైదరాబాద్‌ను దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో అనుసంధానించనున్నారు.

• హైదరాబాద్ - ముంబై

• హైదరాబాద్ - బెంగళూరు

• హైదరాబాద్ - చెన్నై (వయా అమరావతి)

ఈ రూట్లలో బుల్లెట్ రైళ్లు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రైలులో ముంబై వెళ్లాలంటే రోజంతా పడుతుంది, కానీ బుల్లెట్ ట్రైన్ వస్తే కేవలం కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చు. అంటే పొద్దున్నే ముంబైలో మీటింగ్ ముగించుకుని సాయంత్రానికల్లా భాగ్యనగరంలో బిర్యానీ తినేయొచ్చన్నమాట! బుల్లెట్ ట్రైన్ హబ్ తో జర్నీ ఇలా సూపర్ ఫాస్ట్ కానుంది.

45
ఎయిర్‌పోర్ట్, బస్ టెర్మినల్ కనెక్టివిటీ కూడా
Image Credit : Gemini

ఎయిర్‌పోర్ట్, బస్ టెర్మినల్ కనెక్టివిటీ కూడా

ఈ ప్రాజెక్టు కేవలం రైల్వే స్టేషన్‌కే పరిమితం కాదు. ఇది ఒక 'మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్'గా మారబోతోంది. విమానంలో వచ్చే ప్రయాణికులు నేరుగా బుల్లెట్ ట్రైన్ ఎక్కేలా, అలాగే బుల్లెట్ ట్రైన్ దిగే వారు వెంటనే ఫ్లైట్ అందుకొనేలా కనెక్టివిటీ ఉంటుంది. దీనికి తోడు, సుమారు 150 ఎకరాల్లో భారీ బస్ టెర్మినల్ కూడా పక్కనే రాబోతోంది. ఏపీ, కర్ణాటక నుంచి వచ్చే బస్సులన్నీ ఇక్కడికే వస్తాయి. అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా సిటీలోకి ప్రయాణికులను చేరవేస్తారు.

55
రియల్ ఎస్టేట్ రేంజ్ మారిపోతుంది
Image Credit : Gemini AI

రియల్ ఎస్టేట్ రేంజ్ మారిపోతుంది

ఈ మెగా ప్రాజెక్టుతో శంషాబాద్, తుక్కుగూడ పరిసర ప్రాంతాల రూపురేఖలు ఇంకా పూర్తిగా మారిపోనున్నాయి. 650 ఎకరాల విస్తీర్ణంలో హబ్ రావడం వల్ల ఇక్కడ వేల కోట్లలో పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి లభించనుంది. ఫలితంగా ఈ సరౌండింగ్స్ లో రియల్ ఎస్టేట్ రేట్లు ఆకాశాన్ని తాకడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి మన హైదరాబాద్ నెక్స్ట్ లెవల్ డెవలప్‌మెంట్‌కు ఈ బుల్లెట్ ట్రైన్ హబ్ ఒక మైలురాయి కాబోతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
హైదరాబాద్
తెలంగాణ
వ్యాపారం
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
Zebra Crossings : జీబ్రా క్రాసింగ్ నలుపు తెలుపులోనే ఎందుకు ఉంటుంది? ఎల్లో ఎందుకు వాడరు?
Recommended image2
Countries With No Snakes: పాముల భయం లేని దేశాలు ఇవి.. అక్కడ ఒక్క పాము కూడా ఎందుకు ఉండదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved