MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • Gold Price: అమాంతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలే !

Gold Price: అమాంతం పెరిగిన బంగారం ధరలు.. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడికి చుక్కలే !

Import Duty On Gold : కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం (మే 13) నుంచి అమలులోకి వచ్చిన ఈ నిర్ణయంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరగనున్నాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 13 2026, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు.. ఆకాశానికి బంగారం, వెండి ధరలు
Image Credit : Gemini AI

దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు.. ఆకాశానికి బంగారం, వెండి ధరలు

బంగారం అంటే భారతీయులకు కేవలం లోహం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, ఆపదలో ఆదుకునే ఆస్తి. అయితే, ఇప్పుడు అదే పసిడిని కొనాలంటే సామాన్యుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. మే 13 నుంచే ఈ కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. దీంతో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగనున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పన్నుల బాదుడు.. జేబుకు చిల్లు
Image Credit : stockPhoto

పన్నుల బాదుడు.. జేబుకు చిల్లు

తాజా నిర్ణయంతో బంగారం, వెండిపై మొత్తం పన్ను భారం 15 శాతానికి చేరుకుంది. గతంలో (2024 బడ్జెట్‌లో) ప్రభుత్వం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి ఈ సుంకాన్ని 6 శాతానికి తగ్గించింది. కానీ, ఇప్పుడు మళ్లీ పాత పద్ధతినే అవలంబిస్తూ బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతానికి పెంచింది.

దీనికి అదనంగా 5 శాతం అగ్రికల్చర్ సెస్ కూడా తోడవ్వడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల తులం బంగారం ధర సుమారు ₹1,53,497 మార్కును తాకింది. ఒక్కసారిగా తులంపై ₹4,000 నుండి ₹6,000 వరకు పెరగడం షాక్ కు గురిచేస్తోంది.

34
రూపాయిని కాపాడుకోవడానికేనా?
Image Credit : Asianet News

రూపాయిని కాపాడుకోవడానికేనా?

ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా బంగారం దిగుమతులు అదుపు లేకుండా పెరిగిపోవడంతో మన విదేశీ మారక నిల్వలు కరిగిపోతున్నాయి.

దీనివల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయింది. కరెంట్ అకౌంట్ లోటును తగ్గించుకుని, రూపాయికి సపోర్టు ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.

44
సామాన్యులు, పరిశ్రమపై ప్రభావం
Image Credit : freepik/chatgpt

సామాన్యులు, పరిశ్రమపై ప్రభావం

డిమాండ్ తగ్గే అవకాశం: ధరలు ఒక్కసారిగా పెరగడం, పైగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల "ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని" పిలుపునివ్వడంతో డిమాండ్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

పెరగనున్న అక్రమ రవాణా: సుంకాలు భారీగా పెరగడంతో, గతంలో తగ్గిన స్మగ్లింగ్ మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జ్యువెలరీ షేర్లు: స్టాక్ మార్కెట్‌లో టైటాన్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి కంపెనీల షేర్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.

మొత్తానికి, ప్రభుత్వ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడే దిశగా ఉన్నప్పటికీ, సామాన్యుడికి మాత్రం బంగారం మళ్లీ అందని ద్రాక్షలా మారేలా కనిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
బంగారం
వ్యాపారం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Low Investment Business: ఇంటి నుంచే సంపాదించాలనుకుంటున్నారా? 7 హోం బిజినెస్ ఐడియాస్
Recommended image3
Best Selfie Phones: రూ.20 వేల బడ్జెట్‌లో వచ్చే బెస్ట్ సెల్ఫీ ఫోన్ల జాబితా ఇదిగో
Related Stories
Recommended image1
Hyderabad Bullet Train : హైదరాబాద్ టు ముంబై, బెంగళూరు ఇక జెట్ స్పీడ్ జర్నీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద బుల్లెట్ ట్రైన్ భారీ హబ్!
Recommended image2
Amazon Great Summer Sale : అమెజాన్ సమ్మర్ సేల్ ధమాకా.. ఐక్యూ, వివో ఫోన్లపై రూ. 40 వేల వరకు డిస్కౌంట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved