MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Telangana
  • షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ లవ్ స్టోరీ.. "ఏ మాయ చేశావే'' సినిమా స్టైల్లో ఉందిగా..!

షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ లవ్ స్టోరీ.. "ఏ మాయ చేశావే'' సినిమా స్టైల్లో ఉందిగా..!

షాాబాద్ హత్యల కేసులో సంచలన విషయాలు బైటపడుతున్నాయి. తాజాగా రాజ్ కుమార్ సోదరి అతడి ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇది అచ్చం ‘ఏ మాయ చేశావే’ సినిమా స్టైల్లో ఉంది.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 13 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
షాబాద్ వరుస హత్యల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Image Credit : X

షాబాద్ వరుస హత్యల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

Shabad Murder Case : షాబాద్ వరుస హత్యల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రాజ్ కుమార్ అనే కిరాతకుడు పెళ్లయి పిల్లలున్నప్పటికీ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరిట వేధిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. తమ అమ్మాయి జోలికి రావద్దని హెచ్చరించినా వినలేదు... చివరకు చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించడంతో కక్షగట్టి ఆ కుటుంబం మొత్తాన్ని పొట్టనబెట్టుకున్నాడు. ఇలా ఫోక్సో కేసు పెట్టించారని మైనర్ బాలికను, ఆమె తల్లిని, నాన్నమ్మను అతి దారుణంగా చంపాడు రాజ్ కుమార్. ఇదే సమయంలో అతడు భార్యాపిల్లలను ఎందుకు చంపాడు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది… తాజాగా పోలీసుల దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాజ్ కుమార్ భార్యాబిడ్డలను ఎందుకు చంపాడు?
Image Credit : Asianet News

రాజ్ కుమార్ భార్యాబిడ్డలను ఎందుకు చంపాడు?

షాబాద్ వరుస హత్యల కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఓవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజ్ కుమార్ కోసం పోలీస్ టీమ్స్ గాలింపు చేపట్టాయి... మరోవైపు ఈ హత్యలకు వెనకున్న కారణాలు తెలుసుకునేందుకు మరికొన్ని పోలీస్ టీమ్స్ విచారణ చేపట్టాయి. ఈ క్రమంలోనే రాజ్ కుమార్ భార్యాపిల్లలను ఎందుకు చంపాడో బైటపడింది.

రాజ్ కుమార్ మొదట్లో డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఇలా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో అతడు చెడు అలవాట్లకు బానిసయ్యాడు... ఈజీగా డబ్బు సంపాదించాలనుకుని బెట్టింగ్స్, జూదం వంటివాటికి అలవాటు పడ్డాడు... ఇందుకోసం పెద్దమొత్తంలో అప్పుచేశాడు. రాజ్ కుమార్ దాదాపు రూ.2 కోట్ల వరకు అప్పులు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఇలా బెట్టింగ్, జూదం ఆడుతూ కుటుంబ పోషణను మరిచిపోవడంతో భార్య సరిత పిల్లల ఆలనాపాలనా చూసుకునేది. అయితే తాగిన మత్తులో ఇంటికి వచ్చే రాజ్ కుమార్ ఆమెను వేధించేవాడు... దుర్భాషలాడటమే కాదు బౌతిక దాడులకు దిగేవాడు. ఇలా భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన సరిత పుట్టింటివారి సాయంతో విడాకులకు సిద్దమయ్యింది. రాజ్ కుమార్ విడాకుల విషయం చెప్పింది... దీంతో భార్యపై కూడా పగ పెంచుకున్నాడు. అందుకే మైనర్ బాలిక కుటుంబాన్ని చంపాలని నిర్ణయించుకున్న అతడు కట్టుకున్న భార్యను, ఇద్దరు పిల్లలను కూడా చంపడానికి సిద్దమయ్యాడు. గత శుక్రవారం (జూలై 10) అర్థరాత్రి ప్రేమిస్తున్నానని వేధించిన అమ్మాయి, ప్రేమించి పెళ్లిచేసుకున్న అమ్మాయితో సహా ఆరుగురిని హతమార్చి మారణహోమం సృష్టించాడు.

34
'ఏ మాయ చేశావే' మూవీని తలపించేలా రాజ్ కుమార్ లవ్ స్టోరీ
Image Credit : Asianet News

'ఏ మాయ చేశావే' మూవీని తలపించేలా రాజ్ కుమార్ లవ్ స్టోరీ

షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ చిన్నప్పటినుండే జులాయి వేశాలు వేసేవాడట. ఇంటర్మీడియట్ చదివే సమయంలో ప్రేమ వ్యవహారాలు నడిపించాడట. ఇలా ఇంటర్ విద్యార్థిగా ఉండగా తనకి ట్యూషన్ చెప్పే టీచర్ ను ఇష్టపడ్డాడు. వయసులో తనకన్నా ఆరేళ్లు పెద్దది అయినప్పటికీ ఆ ట్యూషన్ టీచర్ వెంటపడ్డాడు. ఆమెకు పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూడగా వాటిని చెడగొట్టాడు. ఇలా వెంటపడటంతో మనసు కరిగి తనకంటే చిన్నవాడైన రాజ్ కుమార్ ప్రేమను ఆమె అంగీకరించింది. ఆమే ఇప్పుడు రాజ్ కుమార్ కిరాతకంగా చంపిన సరిత.

2018 లో పెద్దలను ఎదిరించి మరీ రాజ్ కుమార్, సరిత పెళ్లిచేసుకున్నారు. కొంతకాలం వీరి సంసారం సాఫీగా సాగింది... దీంతో ఇద్దరు పిల్లలు సంతానం కలిగారు. ఇలా జీవితం హాయిగా సాగుతున్న సమయంలో రాజ్ కుమార్ బెట్టింగ్స్, జూదంతో పాటు తాగుడుకు అలవాటు పడ్డాడు... చివరకు అతడి తల్లిదండ్రులు పొలం అమ్మేసి అప్పులు కట్టాల్సి వచ్చింది. భర్త తీరు మారకపోవడంతో పిల్లలను తీసుకుని ఒంటరిగా జీవించాలనుకుంది సరిత... ఆ నిర్ణయం భర్తకు చెప్పడమే ఆమెపాలిట శాపం అయ్యింది. భార్యపై కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ అతి కిరాతకంగా ఆమెను, ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకున్నాడు.

44
దైవాలగూడలో ఆ రాత్రి ఏం జరిగింది?
Image Credit : X

దైవాలగూడలో ఆ రాత్రి ఏం జరిగింది?

రంగారెడ్డి షాబాద్ మండలకేంద్రం దైవాలగూడలో రాజ్ కుమార్ నివాసం ఉండేవాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉండగానే ఇంటిపక్కన ఉండే ఓ బాలికను ప్రేమపేరిట వేధించేవాడు రాజ్ కుమార్. ఇలా మైనర్ బాలికను లైంగికంగా వేధించడంతో రాజ్ కుమార్ పై షాబాద్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. దీంతో గత శుక్రవారం (జూలై 10న) రాత్రి 11 గంటల నుండి 1 గంటల వరకు అంటే రెండుగంటల్లో ఆరుగురిని హతమార్చాడు. మొదట బాలిక ఇంటికి వెళ్లి ఆమె కళ్లముందే తల్లిని, నాన్నమ్మను హతమార్చాడు.. బాలికను ఊరి చివరికి ఎత్తుకెళ్లాడు. అక్కడ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి గొంతు కోసం దారుణంగా చంపేశాడు.

ఇలా ముగ్గురిని చంపిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళాడు రాజ్ కుమార్. గాఢ నిద్రలో ఉన్న భార్యను లేపి కత్తితో దాడి చేశాడు... అతడినుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినా వదల్లేదు. అతి కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. తర్వాత ఇద్దరు పిల్లలను కూడా హతమార్చాడు. ఇలా ఆరుగురిని హతమార్చిన తర్వాత కారులో పరారయ్యాడు రాజ్ కుమార్. ఈ హత్యల గురించి తండ్రికి ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
నేరాలు, మోసాలు
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Recommended image2
School Holidays : విద్యార్థులు, ఉద్యోగులు ఎగిరిగంతేసే మ్యాటర్.. వినాయక నిమజ్జనానికి మూడ్రోజులు సెలవులే
Recommended image3
ఒక‌ప్పుడు గ్రామీణ ప్రాంతం, ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌.. జెడ్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం
Related Stories
Recommended image1
Now Playing
Ketan Agarwal murder case: కేతన్ మ*ర్డర్ మిస్టరీ.. విగ్ వివాదం నిజమేనా? | Asianet News Telugu
Recommended image2
Shabad Mass Murders : పోక్సో కేసులో రాజ్ కుమార్ అరెస్టే కాలేదా..? అతడిపై పోలీసులు పెట్టిన కేసులేంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved