- Home
- Telangana
- School Holidays : ఆగస్ట్ లో తెలుగు స్టూడెంట్స్ కి సెలవులే సెలవులు... ఎన్నిరోజులో తెలుసా?
School Holidays : ఆగస్ట్ లో తెలుగు స్టూడెంట్స్ కి సెలవులే సెలవులు... ఎన్నిరోజులో తెలుసా?
ఒకట్రెండు రోజులు సెలవులు వస్తేనే చిన్నారులు ఆనందంతో గంతులేస్తారు… అలాంటిది వచ్చేనెలలో ఏకంగాా పదిరోజులు సెలవులున్నాయి.. అందులో రెండు లాంగ్ వీకెండ్స్. ఏఏ రోజుల్లో ఎందుకు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఆగస్ట్ 2025 లో సెలవులే సెలవులు
Holidays : ప్రతి ఆదివారం వచ్చే సెలవుకే పిల్లలు మురిసిపోతారు... ఎందుకంటే స్కూలుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఈరోజు హాయిగా కుటుంబంతో గడపొచ్చు, స్నేహితులతో సరదాగా ఆడుకోవచ్చు... అందుకే ఆ ఆనందం. మరి వారం మధ్యలో మరేదైనా సెలవు వస్తే... ఆదివారానికి మరికొన్ని సెలవులు కలిసివచ్చి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారితే... పిల్లలే కాదు ఉద్యోగాలు చేసే పెద్దలు కూడా ఎగిరిగంతేస్తారు. అలాంటి సెలవులే వచ్చే నెల (ఆగస్ట్ 2025) రాబోతున్నాయి.
జూన్ లో వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభయ్యాక అసలు సెలవులేమీ రాలేవు... ఈనెల విద్యార్థులకు భారంగా గడిచింది. ఇక జులైలో కూడా పెద్దగా సెలవులేమీ లేవు... రెండో శనివారం, ఆదివారాలు మాత్రమే సెలవులున్నాయి. తెలంగాణలో మాత్రం బోనాలు పండక్కి జులై 21న సెలవు ఇచ్చారు... ఏపీలో అయితే ఇదికూడా లేదు. మొహర్రం పండక్కి అధికారిక సెలవు ఉన్నా ఇది ఆదివారం(జులై 6) వస్తోంది... కాబట్టి ఓ సెలవు మిస్ అయినట్లే.
ఇలా సెలవులు రావట్లేవని బాధపడుతున్న విద్యార్థులకు ఆగస్ట్ ఆశలు రేకెత్తిస్తోంది. ఈ నెలలో విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా భారీగా సెలవులు ఉన్నాయి. ఇందులో చాలా సెలవులు ఆదివారంతో కలిసిరావడంతో లాంగ్ వీకెండ్స్ గా మారుతున్నాయి. ఇలా పిల్లలు, పెద్దలకు వరుస సెలవులు వస్తున్నాయి... వాతావరణం కూడా వర్షాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి మంచి హాలిడే టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
ఆగస్ట్ 2025 సెలవుల జాబితా
1. వరలక్ష్మి వ్రతం
జులై ముగియగానే ఇలా ఆగస్ట్ లోకి ఎంటర్ అవుతామో లేదో ఆదివారం (ఆగస్ట్ 3) వస్తుంది. మరో నాలుగురోజులు గడవగానే మరో సెలవు... ఆగస్ట్ 8న అంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉంది. అయితే ఇది ఆప్షనల్ హాలిడే. ముఖ్యంగా హిందు మహిళలు ఈరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకుంటారు... కాబట్టి హిందుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లకు సెలవు ఉంటుంది. ఉద్యోగులు కూడా అవసరం అనుకుంటే సెలవు తీసుకోవచ్చు.
కొన్ని విద్యాసంస్థలకు శని, ఆదివారం రెండ్రోజులు సెలవు ఉంటుంది. అలాగే ఐటీ, కార్పోరేట్ సంస్థలకు కూడా వారంలో రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలాంటి స్కూల్ విద్యార్థులు, ఉద్యోగులకు శుక్రవారం సెలవు వర్తిస్తే వరుసగా మూడ్రోజులు హాలిడేస్... వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతుంది.
2. రాఖీ పౌర్ణమి/ శ్రావణ పూర్ణిమ
తోబుట్టువుల అనుబంధాలు, ఆత్మీయతల పండగే రాఖీ. ఏపీ, తెలంగాణలో ఈ పండగను అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్లు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈసారి రాఖీ పండగ ఆగస్ట్ 9న వస్తోంది. అంటే వరలక్ష్మీవ్రతం తర్వాతి రోజే... ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే. ఈ రెండ్రోజుల సెలవులకు ఆదివారం కలిసివస్తుంది... అంటే వరుసగా మూడురోజుల సెలవులన్నమాట. అయితే ఈ సెలవు అందరు విద్యార్థులకు వర్తించవు... కొన్ని స్కూళ్లకు మాత్రమే ఆగస్ట్ 8,9 సెలవులుండే అవకాశం ఉంది.
3. స్వాతంత్య్ర దినోత్సవం/ పార్సీ న్యూ ఇయర్
భారతీయులు కులమతాలకు అతీతంగా జరుపుకునే పర్వదినాల్లో స్వాతంత్య్ర దినోత్సవం ఒకటి. దేశానికి స్వాతంత్య్ర లభించిన ఆగస్ట్ 15న యావత్ దేశప్రజలు రెపరెపలాడే జాతీయజెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాలాపన చేస్తారు. ప్రతి స్కూల్, ప్రభుత్వ కార్యాలయంలో ఈ వేడుకలను జరుపుకుంటారు.. తర్వాత విద్యార్థులు, ఉద్యోగులు సెలవు ఉంటుంది.
ఇక ఈసారి ఇదేరోజు అంటే ఆగస్ట్ 15న పార్సీ న్యూఇయర్ వస్తోంది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. కానీ ఎలాగూ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెలవు ఉంది.. కాబట్టి అందరు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది.
4. శ్రీకృష్ణాష్టమి
భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులే. కాబట్టి ముఖ్యమైన హిందూ పండగలకు సెలవులు ఉంటాయి. ఇలా ఆగస్ట్ 16 (శనివారం) శ్రీ కృష్ణుని జన్మదినం... ఈరోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటారు. కాబట్టి శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ఉంటుంది.
ఇలా ఆగస్ట్ 15 శుక్రవారం, ఆగస్ట్ 16 శనివారం సెలవులు వస్తున్నాయి. ఇక ఆగస్ట్ 17 ఆదివారం ఎలాగూ సెలవే. ఇలా వరుసగా మూడురోజులు సెలవులు కలిసివచ్చి లాంగ్ వీకెండ్ గా మారుతోంది. ఈ మూడ్రోజులు పిల్లలకే కాదు ఉద్యోగాలు చేసే పేరెంట్స్ కు కూడా సెలవులే... కాబట్టి కుటుంబమంతా ఏదయినా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
5. వినాయక చవితి
ఆగస్ట్ చివర్లో వినాయక చవితి వస్తోంది. ఈ పండగవేళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి వీధి ఓ దేవాలయంగా మారిపోతుంది... వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి యువత తెగ సందడి చేస్తుంది. ఈ పండగ నేపథ్యంలో ఆగస్ట్ 27న (బుధవారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు ఉంది.
ఆగస్ట్ లో వచ్చే మొత్తం సెలవులెన్ని?
జాతీయ పర్వదినం, పండగలు, ఆదివారాలు... ఇవన్నీ కలిపి ఆగస్ట్ లో భారీగా సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ 8,9,15,16,27 ప్రత్యేక సెలవులు వస్తుంటే... ఆగస్ట్ 3,10,17,24.31 ఆదివారం సెలవులు. మొత్తం కలిపి పదిరోజుల సెలవులు వస్తున్నాయి. రెండో శనివారం, పార్సీ న్యూఇయర్ హాలిడేస్ వేరే సెలవులతో కలిసిపోయాయి... లేదంటే మరో రెండ్రోజుల సెలవులు అదనంగా వచ్చేవి.
అయితే ఆగస్ట్ లో భారీ వర్షాలుంటాయి... కాబట్టి ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిసి వరద పరిస్థితులు వస్తే స్కూళ్లు, కాలేజీలకు అదనంగా సెలవులు రానున్నాయి. ఇక బంద్ లు, ధర్నాలు ఉంటే సడన్ సెలవులు వస్తాయి. ఇలా ఆగస్ట్ లో తెలుగు స్టూడెంట్స్ కు సెలవులే సెలవులు రానున్నాయి.