- Home
- Business
- Bank Holidays: జూలైలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఉద్యోగులకు పండగే.. బ్యాంకు పనులు ముందే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులే
Bank Holidays: జూలైలో బ్యాంకులకు ఇన్ని సెలవులా? ఉద్యోగులకు పండగే.. బ్యాంకు పనులు ముందే ప్లాన్ చేసుకోండి. లేకపోతే ఇబ్బందులే
జూలై 2025లో బ్యాంకులకు ఎన్ని సెలవులో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది బ్యాంకు ఉద్యోగులకు ఆనందాన్ని కలిగించే విషయమే అయినా ప్రజలు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. జూలైలో ఏఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని సెలవులో వివరంగా తెలుసుకుందాం.

బ్యాంకులకు 13 రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూలై 2025కి అధికారిక బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు మొత్తం 13 రోజులు మూసి ఉంటాయి. ఇందులో జాతీయ వారాంతపు రోజులు, వివిధ రాష్ట్రాల పండుగలు కూడా ఉన్నాయి. మీకు ఏవైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
బ్యాంకులు మూసి ఉన్నా ఇబ్బంది లేదు..
ఈ రోజుల్లో బ్యాంకులు మూసి ఉన్నా ఎక్కువ మంది అక్కడకు వెళ్లడం లేదు. UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ATMలు వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకుంటూ బ్యాంకుల ఊసే ఎత్తడం లేదు. అయితే కొన్ని పనులు మాత్రం బ్యాంకులకు వెళ్లేనే అవుతాయి. ఉదాహరణకు చెక్ డిపాజిట్, చెక్ ద్వారా విత్ డ్రా, లోన్ వెరిఫికేషన్ లాంటి కొన్ని పనులు చేసుకోవాలంటే కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాలి. జూలై నెలలో మీకు అలాంటి ముఖ్యమైన పనులుంటే ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 13 రోజులు సెలవులంటే మామూలు విషయం కాదు. అత్యవసరమైనప్పుడు బ్యాంకులు క్లోజ్ చేసి ఉంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
జూలైలోనే శ్రావణమాసం ప్రారంభం
దేశవ్యాప్త వారాంతపు సెలవులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జూలై నెలలోనే శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. జూలై 25 శుక్రవారం నాడు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సాధారణంగా శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఆరోజు అన్ని బ్యాంకులు సెలవు ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు మొదటి శుక్రవారం కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
ఇది కాకుండా హరియాలి అమావాస్య (జూలై 24), హరియాలి తీజ్ (జూలై 27), నాగ పంచమి (జూలై 29) వంటి అనేక సాంప్రదాయ పండుగలు జరుపుకుంటారు. అయితే ఇవన్నీ ప్రతి రాష్ట్రంలో అధికారిక బ్యాంకు సెలవులు కావు.
కొన్ని రాష్ట్రాలు కార్చి పూజ, గురు హర్గోబింద్ జీ జయంతి, ముహర్రం, బెహ్ దియెంఖ్లామ్, హరేలా, కెర్ పూజ వంటి స్థానిక పండుగలను కూడా జరుపుకుంటాయి. వాటి ప్రాధాన్యాన్ని బట్టి బ్యాంకులు సెలవు ఇచ్చే అవకాశం ఉంటుంది.
జూలైలో బ్యాంకు సెలవులు
1. జూలై 3 (గురువారం) – కార్చి పూజ – అగర్తలా (త్రిపుర)లో బ్యాంకులు మూసివేత
2. జూలై 5 (శనివారం) – గురు హర్గోబింద్ జీ జయంతి – జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులు మూసివేత
3. జూలై 6 (ఆదివారం) – వారాంతపు సెలవు – ఇండియా అంతటా
4. జూలై 7 (సోమవారం) – ముహర్రం – చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేత
5. జూలై 12 (శనివారం) – రెండవ శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
6. జూలై 13 (ఆదివారం) – వారాంతపు సెలవు – దేశవ్యాప్తంగా
7. జూలై 14 (సోమవారం) – బెహ్ దియెంఖ్లామ్ – షిల్లాంగ్ (మేఘాలయ)లో బ్యాంకులు మూసివేత
జూలైలో బ్యాంకు సెలవులు
8. జూలై 16 (బుధవారం) – హరేలా – డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)లో బ్యాంకులు మూసివేత
9. జూలై 17 (గురువారం) – యూ టిరోట్ సింగ్ స్మారక దినం – షిల్లాంగ్ (మేఘాలయ)లో బ్యాంకులు మూసివేత
10. జూలై 19 (శనివారం) – కెర్ పూజ – అగర్తలా (త్రిపుర)లో బ్యాంకులు మూసివేత
11. జూలై 20 (ఆదివారం) – వారాంతపు సెలవు – ఇండియా అంతటా
12. జూలై 26 (శనివారం) – నాల్గవ శనివారం – దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేత
13. జూలై 27 (ఆదివారం) – వారాంతపు సెలవు – ఇండియా అంతటా