MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్

Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్

హైదరాబాద్ లో వర్షం మొదలయ్యింది… సరిగ్గా బోనాల వేళ గొల్కొండ ప్రాంతాన్ని చిరుజల్లులు చల్లబర్చాయి. ఈ సాయంత్రం మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 16 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గోల్కొండ బోనాలను తడిపిన వర్షాలు
Image Credit : Gemini AI

గోల్కొండ బోనాలను తడిపిన వర్షాలు

Rain Alert : ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలు చల్లబడుతున్నాయి... మెళ్లిగా వర్షాలు మొదలవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు ఊపందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.. వాళ్లు చెప్పినట్లే జరుగుతోంది. తెలంగాణలో నిన్న (జూలై 15, బుధవారమే) ఎండల తీవ్రత తగ్గి వర్షాలు మొదలయ్యాయి... ఇవాళ మరిన్ని జిల్లాలకు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ లో కూడా వర్షాలు మొదలయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
హైదరాబాద్ లో వర్షం
Image Credit : Gemini AI

హైదరాబాద్ లో వర్షం

హైదరాబాద్ నగరంలో ఇవాళ బోనాల వేడుకలు మొదలయ్యాయి. ప్రాచీన గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. ఈ వేడుక కోసం గొల్కొండ కోటవద్దకు భారీగా భక్తులు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో భక్తులు తడిసిముద్దయ్యారు. గత కొద్దిరోజులుగా ఎండలు మండిపోతుండటంతో నగరవాసులు అల్లాడిపోతున్నారు... అలాంటిది సరిగ్గా బోనాల వేళ వర్షం కురవడం ఆ అమ్మవారి మహిమే అంటున్నారు భక్దులు. ఇక ఈ ఆషాడమాసం మొత్తం ఇలాగే వర్షాలు కురవాలని నగరవాసులు కోరుకుంటున్నారు.

గోల్కొండతో పాటు రాజేంద్రనగర్, మణికొండ, షేక్ పేట్, శంషాబాద్, టోలిచౌకి ప్రాంతాల్లో వర్షం కురిసింది. చిరుజల్లులు కొద్దిసేపే కురిసినా వాతావరణం చల్లబడి ఆహాదకరంగా మారింది. సాయంత్రం సౌత్, వెస్ట్, ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. మరో రెండుగంటల్లో బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్, నారపల్లి, ఘట్కేసర్, తట్టిఅన్నారం, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇలా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... బయటకు వెళుతుంటే వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలని వెదర్ మ్యాన్ సూచించారు.

HyderabadRains UPDATE 2 - 3.20PM ⚠️⛈️ 

While Rajendranagar, Manikonda, Shaikpet, Shamshabad, Tolichowki, Golconda i.e South, West HYD continues to get SCATTERED RAINS, the action shifts to East

SCATTERED RAINS ahead in Uppal, Boduppal, Peerzadiguda, Narapally, Ghatkesar,…

— Telangana Weatherman (@balaji25_t) July 16, 2026

34
తెలంగాణలో వర్షాలు
Image Credit : Gemini AI

తెలంగాణలో వర్షాలు

తెలంగాణ విషయానికి వస్తే.... యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, గద్వాల, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. అయితే భారీ వర్షాలేమీ ఉండవని... చెదురుమదురు జల్లులే పడతాయని వెల్లడించారు. జూలై ఎండింగ్ వరకు ఇలాంటి వర్షాలే ఉంటాయని... ఆగస్ట్ లో భారీ వర్షాలుండే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం మాత్రం ఈ సాయంత్రం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి, తేమతో కూడిన పరిస్థితులు ఉంటాయని తెలిపింది. అలాగే ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిస్తోంది.

तेलंगाना का 7-दिन का पूर्वानुमान (मध्याह्न) 0300 UTC पर आधारित, 1300 घंटे IST पर जारी किया गया दिनांक:/ 7- day forecast(mid day) of Telangana Based on 0300 UTC issued at 1300 Hours IST dated : 16.07.2026 pic.twitter.com/OjZIFmh2nO

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 16, 2026

44
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
Image Credit : Gemini

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఇది ఈరోజు (జూలై 16న) 'స్పష్టమైన అల్పపీడనం'గా (Well Marked Low Pressure Area) బలపడి,వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు (గురు, శుక్రవారం) ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుండి మోస్తరు వర్ష సూచన ఉందని APSDMA పేర్కొంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TASK: విద్యార్థుల‌కు టెక్ స్కిల్స్‌లో శిక్ష‌ణ‌.. డెల్ కంపెనీతో ప్ర‌భుత్వం కీల‌క ఒప్పందం
Recommended image2
Weather Update : బంగాళాఖాతంలో తుపాను లోడింగ్... ఇక కాస్కొండి, ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలే
Recommended image3
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
Related Stories
Recommended image1
Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?
Recommended image2
Now Playing
Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved