- Home
- Telangana
- School Holiday : మీ ఫోన్ కి ఈ మెసేజ్ వచ్చిందో స్కూల్ హాలిడే కన్ఫర్మ్.. రాకుంటే సెలవు లేనట్లే
School Holiday : మీ ఫోన్ కి ఈ మెసేజ్ వచ్చిందో స్కూల్ హాలిడే కన్ఫర్మ్.. రాకుంటే సెలవు లేనట్లే
నవంబర్ 24 అంటే రేపు మంగళవారం కార్తీక పౌర్ణమితో పాటు గురునానక్ జయంతి కూడా ఉంది. మరి ఈరోజు తెలుగు ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ఉందా? లేదా? ఇక్కడ తెలుసుకొండి.

కార్తీక పౌర్ణమికి సెలవుందా?
School Holiday : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం కొనసాగుతోంది. రేపు (నవంబర్ 24, మంగళవారం) పౌర్ణమి ఉంది... కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని మరింత పవిత్రమైందిగా నమ్ముతారు. అందుకే ఈరోజు ఇళ్లముందు, దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు.. ప్రత్చేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇలా కార్తీక పౌర్ణమిని పండగలా జరుపుకుంటారు... అందుకే తెలుగువారు ఈరోజు సెలవు కోరుకుంటారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్తీక పౌర్ణమి సెలవుపై కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. మరి తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవుందా? ఆంధ్ర ప్రదేశ్ లో సెలవుల సంగతేంటి? ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో అధికారిక సెలవు
నవంబర్ 24న అంటే రేపు (మంగళవారం) కేవలం కార్తీక పౌర్ణమి మాత్రమే కాదు సిక్కుల గురువు గురునానక్ జయంతి కూడా ఉంది. ఇలా హిందువులకే కాదు సిక్కులకు కూడా ఎంతో పవిత్రమైన రోజు. ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది... రేపు ప్రభుత్వ కార్యాలయాలేవి పనిచేయవు.
అధికారిక సెలవే అయినా ప్రైవేట్ కార్యాయలయాలు యదావిధిగా పనిచేసే అవకాశాలున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలా, వద్దా అనేది ఆయా సంస్థల యాజమాన్యాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ఉందా?
తెలంగాణ విద్యాశాఖ కూడా కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్ల సెలవులపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ కు సెలవు మెసేజ్ వచ్చివుంటుంది... కాబట్టి స్కూల్ నుండి సమాచారం ఉంటే సెలవు ఉంటుంది... ఎలాంటి సమాచారం లేకుంటే సెలవు లేనట్లే, రేపు (మంగళవారం) యధావిధిగా స్కూల్ నడుస్తుంది. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు కూడా రేపు ఎలాంటి సెలవు లేదు... యదావిధిగా నడుస్తాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కార్తీక పౌర్ణమికి సెలవు ఉందా?
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించలేదు... అంటే రేపు (నవంబర్ 24, మంగళవారం) వర్కింగ్ డే అన్నమాట. ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి సెలవు లేదు. అయితే ఈరోజు ఉద్యోగులు కావాలనుకుంటే ఆప్షనల్ హాలిడే తీసుకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం... అంటే ముందస్తు అనుమతితో నవంబర్ 24న ఉద్యోగులు సెలవు తీసుకోవచ్చు... వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది. మహిళలు, సిక్కులు ఈ ఆప్షనల్ హాలిడేను ఎక్కువగా వాడుకునే అవకాశాలున్నాయి... మిగతా ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.
కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ ఆప్షనల్ హాలిడే వర్తిస్తుంది... విద్యార్థులకు కాదు. ఏపీలోని అన్ని విద్యాసంస్థలు నవంబర్ 24న యధావిధిగా పనిచేయనున్నాయి. అయితే కొన్ని హిందుత్వ ట్రస్టుల ఆధ్వర్యంలో నడిచేవి, సిక్కు కమ్యూనిటీ పిల్లలు ఎక్కువగా చదివే ప్రత్యేక విద్యాసంస్థలకు మాత్రం సెలవు ఉండే అవకాశాలున్నాయి.














