MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?

Heavy Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో ముంబై తరహా కుండపోత వర్షాలే, ఇక అల్లకల్లోలమేనా?

బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ అవుతోంది… ఇది రుతుపవనాలను చురుగ్గా మారుస్తుందట. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Jul 15 2026, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇక వర్షాలు షురూ..
Image Credit : Gemini AI

ఇక వర్షాలు షురూ..

IMD Weather Update : నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెలరోజులు కావస్తోంది... అయినా ఇప్పటికీ లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూన్ మొత్తం చెదురుమదురు వర్షాలతోనే సరిపోయింది... భారీ వర్షాల జాడే లేదు. ఇక జూలై ఫస్ట్ హాఫ్ మరీ దారుణం... వానలు కురవకపోగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో వర్షాలపై భరోసాతో పంటలు పెట్టుకున్న రైతులు వరుణ దేవుడిని కరునించాలని వేడుకుంటున్నారు... వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. ఆ దేవుళ్లు రైతుల మొర ఆలకించారో ఏమోగానీ జూలై సెకండాఫ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల వాతావరణ విభాగాలు, నిపుణులు చల్లని కబురు అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇక భారీ వర్షాలే
Image Credit : ANI

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇక భారీ వర్షాలే

కొద్ది రోజులుగా మందగించిన రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని... ఇది రాబోయే 24 నుండి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉంటుందని... ఇవాళ్టి (జూలై 15, బుధవారం) నుండే వర్షాలు మొదలవుతాయట. ఈ వర్షాలు మరింత జోరందుకుని జూలై సెకండాఫ్ (15-31 తేదీల్లో) లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

35
జూలైలో వర్షాల లోటు తీరుతుందా?
Image Credit : Gemini AI

జూలైలో వర్షాల లోటు తీరుతుందా?

ఇప్పటివరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూలై సెకండాఫ్ లో కురిసే వర్షాలు ఈ లోటును భర్తీచేసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నమాట.

ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో... తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, ఒకటిరెండు చోట్ల కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు వంకలు, జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకుంటాయని చెబుతున్నారు.

45
నేటినుండే తెలంగాణలో వర్షాలు
Image Credit : Perplexity AI

నేటినుండే తెలంగాణలో వర్షాలు

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం... ఇవాళ్టి (జూలై 15) నుండి మెళ్లిగా వర్షాలు షురూ కానున్నాయి. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగింది, వేసవి తరహాలో ఎండలు మండిపొతూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగి మారబోతోందని వెదర్ మ్యాన్ తెలిపారు. 

ఇవాళ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కొనసాగినా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి చిరుజల్లులు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రివరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

RAINS TO SLOWLY START FROM TODAY

JULY 15, 2026 FORECAST ⚠️⛈️ 

Last 5days have been completely dry

But from today, few rains will start

HOT & HUMID WEATHER to continue in entire Telangana even today 

Today, ISOLATED - SCATTERED RAINS ahead in Vikarabad, Sangareddy,…

— Telangana Weatherman (@balaji25_t) July 15, 2026

55
హైదరాబాద్ వాతావరణం..
Image Credit : X/Hyderabad Traffic Police

హైదరాబాద్ వాతావరణం..

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే... అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. సాయంత్రం సమయంలో హైదరాబాద్ తో పాటు శివారుజిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇవాళ మొదలయ్యే వర్షాలు రానురాను జోరందుకుంటాయని... రేపు (జూలై 16, గురువారం) మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయట. ఇలా జూలై 19 వరకు భారీ వర్షాలుగా మారతాయని.. ఆ తర్వాత కూడా కొనసాగుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్, వాతవారణ శాఖ అంచనా వేస్తున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు.. షాక్‌కి గురి చేస్తున్న ఏఐ మోడ‌ల్ తీరు
Recommended image2
మ‌రో 5 ఏళ్ల‌లో ఈ ప‌ట్ట‌ణం హైద‌రాబాద్‌లో క‌ల‌వ‌డం ఖాయం.. ఇప్పుడు కొంటే మీ పంట పండిన‌ట్లే
Recommended image3
Danam Nagender : హైదరాబాద్ ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు.. కేటీఆర్ రియాక్షన్ ఇదే..
Related Stories
Recommended image1
Weather Update : మినీ సమ్మర్ లోడింగ్.. ఇక నడి వర్షాకాలంలోనూ 40 డిగ్రీల మండుటెండలే
Recommended image2
Now Playing
Rain Alert: జూలై సెకండాఫ్ లో వర్షాలే వర్షాలు | Heavy Rains Likely Across Andhra Pradesh & Telangana
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved