MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • PM Modi : తెలంగాణకు మోదీ వరాలు.. గోల్డ్ కొనొద్దని ప్రధాని ఎందుకు అన్నారు?

PM Modi : తెలంగాణకు మోదీ వరాలు.. గోల్డ్ కొనొద్దని ప్రధాని ఎందుకు అన్నారు?

PM Modi Telangana Visit: తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ. 9,377 కోట్ల వరాలు ప్రకటించారు. సైబరాబాద్ ఉపాధి కేంద్రంగా మారిందని ప్రశంసలు కురిపించారు. అలాగే, బంగారం కొనుగోళ్లపై పీఎం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 10 2026, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణా డెవలప్‌మెంట్ గేర్ మార్చిన మోదీ
Image Credit : X/narendramodi

తెలంగాణా డెవలప్‌మెంట్ గేర్ మార్చిన మోదీ

తెలంగాణ గడ్డపై ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి జాతర మొదలుపెట్టారు. హైదరాబాద్‌లోని HICC లో సుమారు రూ. 9,377 కోట్ల విలువైన పలు భారీ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు అటు రాజకీయంగా, ఇటు సామాజికంగా పెద్ద చర్చకు దారితీశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సైబరాబాద్: టెక్కీల అడ్డా కాదు.. ఉపాధి కేటలిస్ట్
Image Credit : Asianet News

సైబరాబాద్: టెక్కీల అడ్డా కాదు.. ఉపాధి కేటలిస్ట్

హైదరాబాద్‌లోని సైబరాబాద్ ప్రాంతం ఇప్పుడు కేవలం ఐటీ కంపెనీలకే పరిమితం కాలేదని, దేశంలోనే అతిపెద్ద ఎంప్లాయ్‌మెంట్ హబ్ గా అవతరించిందని మోదీ కొనియాడారు. సైబర్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ రంగాల్లో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. "తెలంగాణ వికసిస్తేనే.. దేశం వికసిస్తుంది" అంటూ  కామెంట్స్ చేశారు.

Related Articles

Related image1
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
36
వరంగల్‌కు పీఎం మిత్ర.. జహీరాబాద్‌కు స్మార్ట్ సిటీ
Image Credit : X/narendramodi

వరంగల్‌కు పీఎం మిత్ర.. జహీరాబాద్‌కు స్మార్ట్ సిటీ

టెక్స్‌టైల్ రంగంలో విప్లవం తెచ్చేందుకు వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్కును మోదీ ప్రారంభించారు. దీనివల్ల వేలాది మందికి స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయని భరోసా ఇచ్చారు. దీంతో పాటు..

• జహీరాబాద్: రూ. 2,360 కోట్లతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ.

• రైల్వేలు: కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ (రూ. 1,243 కోట్లు).

• రోడ్లు: గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు హైవే విస్తరణ (రూ. 3,175 కోట్లు).

46
బంగారం కొనడం ఆపేద్దాం.. మోదీ షాకింగ్ పిలుపు
Image Credit : X/narendramodi

బంగారం కొనడం ఆపేద్దాం.. మోదీ షాకింగ్ పిలుపు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ ఒక ఆసక్తికరమైన రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ కారణాల వల్ల బంగారం ధరలు మండిపోతున్నాయని, కాబట్టి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. బంగారం దిగుమతులు తగ్గితే విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్లస్ అవుతుందని వివరించారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లాలని సూచించారు.

56
రేవంత్ రెడ్డి వర్సెస్ మోదీ.. నిధుల లెక్క
Image Credit : X/narendramodi

రేవంత్ రెడ్డి వర్సెస్ మోదీ.. నిధుల లెక్క

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉంది. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదుగుతుంది. గతంలో మన్మోహన్ సింగ్ గుజరాత్‌ను ఎలా సపోర్ట్ చేశారో, మీరు కూడా తెలంగాణను అలానే ఆశీర్వదించాలి" అని కోరారు. దీనికి మోదీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గత పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ఇచ్చామో, తెలంగాణకు అంతే ఇచ్చామని, ఇంకా చెప్పాలంటే గుజరాత్ లెక్కల ప్రకారం ఇస్తే తెలంగాణకు ఇప్పుడు వస్తున్న దానికంటే సగం నిధులే వస్తాయని అన్నారు.

66
బెంగాల్ సీన్ రిపీట్.. నెక్స్ట్ తెలంగాణే
Image Credit : Getty

బెంగాల్ సీన్ రిపీట్.. నెక్స్ట్ తెలంగాణే

రాజకీయంగా కూడా మోదీ గట్టి సౌండ్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి, కుటుంబ పార్టీలను ప్రజలు ఎలాగైతే ఓడించారో, తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని అన్నారు. "బెంగాల్ గెలిచాం.. ఇప్పుడు మా టార్గెట్ తెలంగాణ" అంటూ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. రాబోయే రోజుల్లో ఇక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇలా మోదీ పర్యటన అటు డెవలప్‌మెంట్ ఫుల్ డోస్, ఇటు పాలిటిక్స్ హీట్‌తో తెలంగాణలో కొత్త చర్చకు తెరలేపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
నరేంద్ర మోదీ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రాజకీయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ‌లో మ‌ళ్లీ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌..? కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన హైకోర్టు
Recommended image2
హైద‌రాబాద్‌కి 70 కి.మీల దూరంలో.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే డ‌బుల్‌ కావ‌డం ఖాయం
Recommended image3
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Related Stories
Recommended image1
Trisha Krishnan: విజయ్ ఈవెంట్‌లో అందరి కళ్లు ఆమెపైనే! త్రిష గ్లామర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved