MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Telangana
  • Petrol: పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? అస‌లు వాస్త‌వం ఏంటి.?

Petrol: పెట్రోల్ సంక్షోభం రానుందా.? ఎందుకీ భారీ క్యూలు.? అస‌లు వాస్త‌వం ఏంటి.?

Petrol: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, నగరంలో పెట్రోల్ సరఫరాపై వస్తున్న వార్తలు కలిసి గందరగోళ పరిస్థితి తీసుకొచ్చాయి. కొన్నిచోట్ల పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూతపడటం, మరికొన్నిచోట్ల నో స్టాక్ బోర్డులతో గంద‌ర‌గోళం నెల‌కొంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 25 2026, 03:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నగరంలో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ
Image Credit : Gemini AI

నగరంలో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ

హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద అసాధారణ రద్దీ కనిపిస్తోంది. కూకట్‌పల్లి, అమీర్‌పేట, సనత్‌నగర్, బేగంపేట, ఖైరతాబాద్, అబిడ్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో వాహనదారులు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద నిలబడ్డారు. కొన్ని బంకుల వద్ద గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల స్టాక్ త్వరగా అయిపోవడంతో బంకులు తాత్కాలికంగా మూసివేస్తున్నారు. దీంతో తెరిచి ఉన్న బంకుల వద్ద మరింత రద్దీ పెరుగుతోంది. ఈ పరిస్థితి నగర ట్రాఫిక్‌పై కూడా ప్రభావం చూపుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పుకార్లతో పెరిగిన ఆందోళన
Image Credit : Gemini AI

పుకార్లతో పెరిగిన ఆందోళన

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రజల్లో భయం పెరిగి పెద్ద ఎత్తున బంకుల వద్దకు వెళ్లడం ప్రారంభమైంది. మెదక్, కరీంనగర్, సిద్ధిపేట‌, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఇంధన కొరత లేదని, ప్రజలు వదంతులను నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు. సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని చెబుతున్నారు.

35
అసలు సమస్య ఏమిటి?
Image Credit : Getty

అసలు సమస్య ఏమిటి?

నిపుణుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏర్పడిన సమస్యకు యుద్ధ పరిస్థితులతో పెద్దగా సంబంధం లేదని తెలుస్తోంది. ప్రధాన కారణం ఆయిల్ కంపెనీలతో పాటు పెట్రోల్ బంకు యజమానుల మధ్య తలెత్తిన ఆర్థిక వివాదం. గతంలో ఆయిల్ కంపెనీలు బంకు యజమానులకు క్రెడిట్ సౌకర్యం కల్పించేవి. అంటే ముందుగా ఇంధనం సరఫరా చేసి తరువాత చెల్లింపులు తీసుకునే విధానం ఉండేది. కానీ ఇటీవల ఆయిల్ కంపెనీలు ఈ విధానాన్ని నిలిపివేసి ముందుగానే డబ్బులు చెల్లించాలని కొత్త నిబంధన పెట్టాయి. ఇప్పటికే ఉన్న బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని చెప్పడంతో కొంతమంది బంకు యజమానులు కొత్త స్టాక్ తెప్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడుతున్నాయి.

45
ప్రభుత్వ జోక్యం అవసరం
Image Credit : X

ప్రభుత్వ జోక్యం అవసరం

పెట్రోల్ బంకుల వద్ద పెరుగుతున్న రద్దీ ట్రాఫిక్ సమస్యలను కూడా పెంచుతోంది. రోడ్లపై వాహనాలు వరుసగా నిలబడటంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ త్వరగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్ కంపెనీలు, బంకు యజమానుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలి. అదనపు ఇంధన సరఫరా అందించే చర్యలు తీసుకుంటే పరిస్థితి త్వరగా మెరుగుపడే అవకాశం ఉంది. అప్పటివరకు ప్రజలు కూడా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు.

55
ఆర్టీసీ నుంచి ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్
Image Credit : TGSRTC

ఆర్టీసీ నుంచి ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు ప్రత్యేక రాయితీ ప్రకటించింది. హైదరాబాద్ పరిధిలో నడిచే మెట్రో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో టికెట్ ధరలపై 30 శాతం తగ్గింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సొంత వాహనాలతో పెట్రోల్ కోసం గంటల పాటు వేచి ఉండటం కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం మంచిదని ఆయన సూచించారు. ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగిస్తే ఇంధనం ఆదా అవుతుందని, ట్రాఫిక్ కూడా తగ్గుతుందని తెలిపారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఐటీ కారిడార్‌కు ద‌గ్గ‌ర్లో సొంతింటి క‌ల సాకారం.. జ‌స్ట్ 10 కిలోమీట‌ర్లు వెళ్తే చాలు
Recommended image2
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల‌ను పేద‌ల‌కు పంచుతాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Related Stories
Recommended image1
Tollywood: మోహ‌న్ బాబును కాపీ కొట్టిన మ‌హేష్ బాబు.. 35 ఏళ్ల క్రిత‌మే పోకిరీ సీన్‌. వైర‌ల్ వీడియో
Recommended image2
Portable Neck Fan: ఎండ‌ను త‌రిమి కొట్టే నెక్ ఫ్యాన్‌.. ఎలా ప‌నిచేస్తుంది, ధ‌ర ఎంతంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved