Portable Neck Fan: ఎండను తరిమి కొట్టే నెక్ ఫ్యాన్.. ఎలా పనిచేస్తుంది, ధర ఎంతంటే.?
Portable Neck Fan: సమ్మర్‌లో బయటకు వెళ్లేటప్పుడు చెమట, వేడి చాలా ఇబ్బంది పెడతాయి. అలాంటి సమయంలో ఓ చిన్న ప్రొడక్ట్ మీ వెంట ఉంటే కూల్‌గా ఉండొచ్చు. మెడకు ధరించుకునే ఈ ఫ్యాన్ చేతులు ఉపయోగించకుండా చల్లదనం ఇస్తుంది.

ఎక్కడైనా ఉపయోగించుకునే వేరబుల్ డిజైన్
ఈ నెక్ ఫ్యాన్ ప్రత్యేకంగా మెడకు ధరించే విధంగా రూపొందించారు. హెడ్‌ఫోన్‌లా మెడకు పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు. ఇది బ్లేడ్‌లెస్ డిజైన్ కావడంతో జుట్టు చిక్కుకునే ప్రమాదం ఉండదు. పని చేస్తూనే, వంట చేస్తూనే, ప్రయాణాల్లోనూ చేతులు ఉపయోగించకుండా చల్లదనం పొందవచ్చు. ఇంట్లో పనులు చేస్తూ, ఆఫీస్‌లో పనిచేస్తూ లేదా బయట తిరుగుతూ కూడా దీన్ని సులభంగా వాడుకోవచ్చు. ధర విషయానికొస్తే అసలు ధర రూ. 3599 కాగా అమెజాన్‌లో 81 శాతం డిస్కౌంట్‌కి లభిస్తోంది. దీంతో ఈ ప్రొడక్ట్‌ను రూ. 699కి సొంతం చేసుకోవచ్చు.
శక్తివంతమైన గాలి ప్రవాహం – 3 స్పీడ్ సెట్టింగ్స్
ఈ ఫ్యాన్‌లో 48 డబుల్ టర్బో ఎయిర్ అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఇవి మెడ చుట్టూ గాలిని సమంగా పంపుతాయి. ఇందులో 3 స్పీడ్ మోడ్‌లు ఉన్నాయి. తక్కువ స్పీడ్, మధ్యస్థ స్పీడ్, ఎక్కువ స్పీడ్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి గాలి వేగాన్ని మార్చుకోవచ్చు. ఇది నిశ్శబ్దంగా పని చేయడం వల్ల ఇతరులకు కూడా ఇబ్బంది కలగదు.
రీచార్జ్ బ్యాటరీ – 2.5 నుంచి 6 గంటల వరకు
ఈ నెక్ ఫ్యాన్ బ్యాటరీతో పనిచేసే రీచార్జబుల్ డివైస్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 3 నుంచి 6 గంటల వరకు పనిచేస్తుంది (స్పీడ్ మీద ఆధారపడి). ఈ ఫ్యాన్‌ను USB కేబుల్ ద్వారా, పవర్ బ్యాంక్, ల్యాప్‌టాప్, ఛార్జర్ వంటి వాటితో సులభంగా రీచార్జ్ చేసుకోవచ్చు.
సౌకర్యంగా ఉండే మెటీరియల్
ఈ ఫ్యాన్ తయారీలో సాఫ్ట్ సిలికా జెల్ మెటీరియల్ ఉపయోగించారు. దీని వల్ల మెడకు సౌకర్యంగా ఉంటుంది, ఎక్కువసేపు ధరించినా ఇబ్బంది ఉండదు, చెమట వచ్చినా సమస్య ఉండదు. ఇందులో అడ్జస్టబుల్ గూస్‌నెక్ డిజైన్ ఉంది. అవసరానికి అనుగుణంగా ఆకారాన్ని మార్చుకోవచ్చు.
ట్రావెల్, అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కు బెస్ట్ గాడ్జెట్
ఈ పోర్టబుల్ నెక్ ఫ్యాన్ చాలా తేలికగా ఉంటుంది. అందుకే ట్రావెల్, క్యాంపింగ్, పిక్నిక్, ఆఫీస్, వాకింగ్, వంట లాంటివి చేస్తున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఇది మోడ్రన్ స్టైల్ డిజైన్‌తో అందంగా ఉంటుంది. వైట్, బ్లాక్ గ్రీన్, బ్లూ వంటి రంగుల్లో లభిస్తుంది. కాబట్టి వేసవిలో చల్లదనం కోసం ఇది మంచి ఎంపిక. అలాగే బర్త్‌డే లేదా గిఫ్ట్‌గా కూడా ఇవ్వడానికి మంచి గాడ్జెట్గా చెప్పొచ్చు.

