MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?

నిర్మలా సీతారామన్ ఇంటి ముందు రాసున్న.. ఈ శ్లోకం అర్థం ఏంటో తెలుసా.?

Nirmala sitharaman: సాధార‌ణంగా ఇళ్ల ముందు ఎవ‌రైనా త‌మ పేరు రాసుకుంటారు. కానీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్‌లోని ఇంటి ముందు సంస్కృత ప‌దాలు ఉన్నాయి. దీంతో వీటి అర్థం ఏంట‌న్న ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Oct 08 2026, 08:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
“ఈశావాస్యమ్” అంటే ఏంటి?
Image Credit : Asianet News

“ఈశావాస్యమ్” అంటే ఏంటి?

ఇంటి గోడపై ఒకవైపు రాసి ఉన్న “ఈశావాస్యమ్” అనే పదం సంస్కృతంలోని “ఈశావాస్య” అనే పదం నుంచి వచ్చింది. దీని సరళమైన అర్థం “ఈ సమస్త ప్రపంచం ఈశ్వరుడితో నిండి ఉంది” అని. అంటే మన చుట్టూ ఉన్న సృష్టిలో ప్రతి చోటా దైవత్వాన్ని చూడాలనే భావన ఇందులో ఉంది. మనుషులు, జంతువులు, చెట్లు, ప్రకృతి, నీరు, గాలి ఇలా కనిపించే ప్రతి దానిలోనూ భగవంతుడి ఉనికి ఉందని భావించాలి. అందువల్ల ఏ జీవిని తక్కువగా చూడకూడదు. ప్రకృతిని నాశనం చేయకూడదు. ఇతరుల పట్ల గౌరవంతో వ్యవహరించాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
“ఈశావాస్యమిదం సర్వం” అంటే ఏమిటి?
Image Credit : Nirmala Sitharaman X Account

“ఈశావాస్యమిదం సర్వం” అంటే ఏమిటి?

ఇంటి ముందు రాసి ఉన్న పూర్తి మంత్రం. “ఈశావాస్యమిదం సర్వం యత్ కించ జగత్యాం జగత్. తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యస్విద్ధనం ॥” ఇది ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి మంత్రం. ఇందులోని మొదటి మాటలే “ఈశావాస్యమిదం సర్వం”. అంటే “ఈ సమస్త ప్రపంచం ఈశ్వరుడితో నిండి ఉంది” అని అర్థం. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి జీవి, ప్రతి వస్తువు దైవసృష్టిలో భాగమే అని ఈ మంత్రం చెబుతోంది. అందుకే మనిషి తనకు ఉన్న సంపద, అధికారం, సౌకర్యాలను మాత్రమే చూసుకోకుండా.. తన చుట్టూ ఉన్న సమాజం, ప్రకృతి, ఇతర జీవుల పట్ల కూడా బాధ్యతగా ఉండాలని ఈ భావన గుర్తు చేస్తుంది.

35
“తేన త్యక్తేన భుంజీథా”.. అర్థం ఏంటంటే.?
Image Credit : Asianet News

“తేన త్యక్తేన భుంజీథా”.. అర్థం ఏంటంటే.?

ఈ మంత్రంలోని మరో ముఖ్యమైన మాట “తేన త్యక్తేన భుంజీథా”. సాధారణంగా దీన్ని “త్యాగ భావంతో అనుభవించు” అని అర్థం చేసుకోవచ్చు. మనకు జీవితంలో ఇల్లు, డబ్బు, ఆస్తి, ఉద్యోగం, పదవి, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. వాటిని అనుభవించకూడదని ఈ మంత్రం చెప్పడం లేదు. అయితే అవే శాశ్వతంగా మనవే అనే భావనతో వాటిపై విపరీతమైన మమకారం పెంచుకోకూడదని చెబుతోంది. మనకు లభించిన దాన్ని సంతోషంగా ఉపయోగించుకోవాలి. అవసరానికి మించి స్వార్థంతో కూడబెట్టకూడదు. మన దగ్గర ఉన్నది ఇతరులకు కూడా ఉపయోగపడేలా చూసే మనస్తత్వం ఉండాలి. ఇదే ఈ భాగం ఇచ్చే ప్రధాన సందేశం.

45
“మా గృధః కస్యస్విద్ధనం”.. ఇతరుల సొమ్ముపై ఆశపడొద్దు
Image Credit : ANI

“మా గృధః కస్యస్విద్ధనం”.. ఇతరుల సొమ్ముపై ఆశపడొద్దు

ఈ శ్లోకంలోని చివరి భాగం “మా గృధః కస్యస్విద్ధనం”. దీని అర్థం “ఇతరులకు చెందిన ధనంపై ఆశపడవద్దు” అని. మనిషికి ఎంత ఉన్నా ఇంకా ఎక్కువ కావాలనే కోరిక రావచ్చు. ఇతరుల దగ్గర ఉన్న ఆస్తి, డబ్బు, సౌకర్యాలను చూసి వాటిని పొందాలనే ఆశ కలగవచ్చు. కానీ అత్యాశ మనిషిని తప్పు మార్గంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. అందుకే ఎవరి సంపద వారిదే అని గౌరవిస్తూ.. మనకు లభించిన దానితో సంతృప్తిగా, నిజాయితీగా జీవించాలని ఈ మంత్రం చెబుతోంది. ఇతరుల హక్కులను గౌరవించడం కూడా ఇందులోని ముఖ్యమైన సందేశమే.

55
“ఈశావాస్యం” మొత్తం చెప్పే జీవన సందేశం ఇదే
Image Credit : Getty

“ఈశావాస్యం” మొత్తం చెప్పే జీవన సందేశం ఇదే

“ఈశావాస్యం” అనే ఒక్క పదంలోనే ఈ మంత్రం మొత్తం భావం దాగి ఉంది. ప్రపంచంలోని ప్రతి దానిలో దైవత్వాన్ని చూడాలి. మనకు లభించిన వాటిని బాధ్యతగా ఉపయోగించాలి. వాటిపై అతిగా మమకారం పెంచుకోకూడదు. ఇతరుల సంపదను ఆశించకూడదు. అంటే ఈ శ్లోకం కేవలం ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు.. రోజువారీ జీవితానికి కూడా వర్తించే విలువలను చెబుతోంది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే.. “అంతటా దైవాన్ని చూడు.. నీకు లభించిన దానితో సంతృప్తిగా ఉండు.. దాన్ని సద్వినియోగం చేసుకో.. ఇతరుల సొమ్ముపై ఆశపడకు..” అనేదే ఈశావాస్య మంత్రం ఇచ్చే ప్రధాన సందేశం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక‌పై అమెరికా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో అమెరికా ప్ర‌భుత్వ వ‌ర్సిటీ వ‌స్తోంది
Recommended image2
Vegetables Price : హైదరాబాద్ లో టమాటా, ఉల్లి ధరలు ఎలా ఉన్నాయి? ఈ కూరగాయ కిలో రూ.100?
Recommended image3
Musi Riverfront Project: మూసీ నది ఒడ్డున రూ.1,108 కోట్లుతో ఓంకారేశ్వరాలయం
Related Stories
Recommended image1
రెపోరేటు పెంచిన ఆర్బీఐ.. రూ. 20 ల‌క్ష‌ల హోమ్‌లోన్‌పై ఎంత EMI పెర‌గ‌నుంది.?
Recommended image2
భార‌తీయ రైల్వేకు రోజుకు ఎంత ఖ‌ర్చ‌వుతుంది.? ఆదాయం ఎంత వ‌స్తుందో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved