- Home
- Telangana
- Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబర్ 31న ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబర్ 31న ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Liquor sales: కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. ఇక మందు బాబుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిసెంబర్ 31న ఉదయం నుంచే దుకాణం షురూ చేశారు. దీంతో తెలంగాణలో ఆల్కహాల్ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదైంది.

తెలంగాణలో రికార్డు స్థాయికి ఆల్కహాల్ అమ్మకాలు
కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే క్రమంలో తెలంగాణలో ఆల్కహాల్ విక్రయాలు ఆల్‌టైం రికార్డును తాకాయి. డిసెంబర్ 31 రాత్రి నగరాలు, పట్టణాలు, పల్లెలు అన్నిచోట్లా మందుబాబుల సందడి కనిపించింది. వైన్ షాపులు, బార్లు, పబ్బులు, క్లబుల్లో భారీగా అమ్మకాలు జరిగాయి. న్యూ ఇయర్ వేడుకలతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.
ఒంటి గంట వరకూ అనుమతులు…
న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. వైన్ షాపులు ఒంటి గంట వరకు తెరిచి ఉంచుకునే అవకాశం ఇచ్చింది. బార్లు, రెస్టారెంట్లు, పబ్బుల్లో కూడా అదే సమయం వరకు ఆల్కహాల్ సర్వ్ చేసేందుకు అనుమతి లభించింది. ఈ నిర్ణయం అమ్మకాలపై భారీ ప్రభావం చూపింది. నగరాల్లో ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనిపించాయి. కౌంటర్లకు క్షణం తీరిక లేకుండా పోయింది.
ఇప్పటికే రూ.5 వేల కోట్లకు పైగా సేల్స్
ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం ఈ డిసెంబర్ నెలలోనే ఆల్కహాల్ అమ్మకాలు రూ.5 వేల కోట్ల మార్కును దాటేశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి సేల్స్ గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. గత న్యూ ఇయర్‌తో పోలిస్తే సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్టు అంచనా. డిసెంబర్ 31 రాత్రి పూర్తి లెక్కలు వెలువడితే ఈసారి చరిత్రలోనే అతిపెద్ద రికార్డు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల హీట్‌తో గ్రామాల్లో అమ్మకాల ఉధృతి
న్యూ ఇయర్ ఉత్సాహానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు కూడా అమ్మకాల్ని పెంచాయి. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేశారు. విందులు, దావత్‌ల పేరుతో ఆల్కహాల్ వినియోగం పెరిగింది. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు గ్రామీణ ప్రాంతాల్లో వైన్స్ షాపులు పండుగ వాతావరణాన్ని తలపించాయి. దీంతో డిపోల నుంచి స్టాక్ వేగంగా బయటకు వెళ్లింది.
చివరి నాలుగు రోజుల్లోనే వేల కోట్ల వ్యాపారం
డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లోనే అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం
డిసెంబర్ 28న రూ.182 కోట్లు
డిసెంబర్ 29న రూ.282 కోట్లు
డిసెంబర్ 30న రూ.375 కోట్లు
డిసెంబర్ 31న రూ.400 కోట్లకు పైగా డిపోల నుంచి వైన్ షాపులకు చేరాయి. ప్రీమియం బ్రాండ్లు, బీర్లు, విస్కీలు భారీగా విక్రయమయ్యాయి. కొత్త విధానం డిసెంబర్‌లోనే అమల్లోకి రావడం కూడా సేల్స్‌కు మరింత బలం చేకూర్చింది. స్టాక్ కొరత రాకుండా వ్యాపారులు ముందుగానే పెద్ద ఎత్తున సరుకును లిఫ్ట్ చేయడం కనిపించింది.

