MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది

New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది

New Year: 2025కి గుడ్ బై చెప్పేసి కొత్తేడాదిలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఎన్నో ఆశ‌ల‌తో 2026కి వెల్‌క‌మ్ చెప్పారు. ఈ ఏడాది ఎన్నో మార్పుల‌కు సాక్ష్యంగా నిల‌వ‌నుంది. అయితే 2026 నెంబ‌ర్ చుట్టూ ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Jan 01 2026, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
2026 గణితం కూడా ఆశ్చర్యపోయే సంవత్సరం
Image Credit : ANI

2026 గణితం కూడా ఆశ్చర్యపోయే సంవత్సరం

2025 అనేది 45 × 45 = పూర్తి స్క్వేర్ సంఖ్య. దానికి వెంటనే వచ్చే ఏడాది 2026 = 45² + 1. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్‌కి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న సంవత్సరం. ఇలాంటి అవకాశం ప్రతి 20 ఏళ్లకోసారి మాత్రమే వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. 2026 లోని అంకెలను (2+0+2+6 = 10) కలిపితే,2026 ÷ 10 = 202.6 వస్తుంది. అంటే ఇది Harshad Year. సంఖ్య తన అంకెల మొత్తంతో భాగించబడుతుంది.

25
క్యాలెండర్‌లో టైమ్ ట్రావెల్ చేసే సంవత్సరం
Image Credit : Asianet News

క్యాలెండర్‌లో టైమ్ ట్రావెల్ చేసే సంవత్సరం

2026 క్యాలెండర్‌ను దాచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అదే క్యాలెండర్ 2037 లో మళ్లీ ఉపయోగపడుతుంది. తేదీలు, వారాలు, సెలవులు అన్నీ అచ్చుగానే ఉంటాయి. ఇంకా ఒక అరుదైన విషయం.. ఫిబ్రవరి 13 శుక్రవారం, అలాగే మార్చి 13 కూడా శుక్రవారం అవుతుంది. వరుసగా రెండు నెలల్లో శుక్ర‌వారం 13వ తేదీన రావడం చాలా అరుదు. దాదాపు 11–12 ఏళ్లకోసారి మాత్రమే ఇలా జరుగుతుంది.

Related Articles

Related image1
LIC: ఏడాదికి ల‌క్ష రూపాయ‌ల గ్యారంటీ పెన్ష‌న్‌.. ఎల్ఐసీ నుంచి అద్భుత‌మైన స్కీమ్
Related image2
Zodiac sign: నిరుద్యోగుల రాత మార‌నుంది.. 2026లో ఈ 5 రాశుల వారికి ఉద్యోగం రావ‌డం ఖాయం
35
సంఖ్యల ఆటలో 2026 ప్రత్యేకం
Image Credit : ANI

సంఖ్యల ఆటలో 2026 ప్రత్యేకం

2026 ను బైనరీ రూపంలో రాస్తే: 11111101010 ఇందులో దాదాపు అన్నీ 1లే ఉన్నాయి. ఈ శతాబ్దంలో ఇంత డెన్స్ బైనరీ ప్యాటర్న్ ఉన్న సంవత్సరం చాలా తక్కువ. ఇంకో స‌రదా విష‌యం ఏంటంటే.. 2 × 0 × 2 × 6 = 0. ఇంత పెద్ద సంఖ్య చివరకు సున్నా అవుతుంది. దీనినే “Zero-Product Year” అంటారు.

45
డిజిటల్ ప్రపంచం పేలిపోతున్న సంవత్సరం
Image Credit : Getty

డిజిటల్ ప్రపంచం పేలిపోతున్న సంవత్సరం

2026 లో ప్రపంచం సృష్టించే డిజిటల్ డేటా 300 జెట్టాబైట్స్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2010 కి ముందు మానవ చరిత్ర అంతా సృష్టించిన డేటా కన్నా ఎక్కువ. భూమిపై ఉన్న ఇసుక కణాల సంఖ్యకంటే ఎక్కువ బైట్స్. ఫోన్, ఏఐ, సోషల్ మీడియా, సర్వర్లు అన్నీ కలిసి డేటా తుపాన్ సృష్టించే ఏడాది ఇది.

55
2026 లో పుట్టిన పిల్లలు చూడబోయే భవిష్యత్
Image Credit : ANI

2026 లో పుట్టిన పిల్లలు చూడబోయే భవిష్యత్

2026 లో పుట్టిన పిల్లవాడు 2044 లో 18 ఏళ్లు, 2056 లో 30 ఏళ్లు ఉంటాడు. ఇక ఈ ఏడాది పుట్టిన చిన్నారి 2100 ప్రత్యక్షంగా చూస్తాడు. అప్ప‌టికి వారి వ‌య‌సు 74 ఏళ్లు ఉంటుంది. అంటే ఈ ఏడాది పుట్టే తరం.. “ఏఐ రాక ముందు జీవించిన పాత మనుషులు” అని మన గురించి మాట్లాడే తరం కానుంది. ఇంకో స‌ర‌దా లెక్క‌.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు 2026 లో 120 కాఫీ కప్పులు తాగితే, ఆ కప్పులను వరుసగా పెడితే చంద్రుడి వరకూ వెళ్లి, తిరిగి వచ్చి… మళ్లీ వెళ్లగలవు.

మొత్తం మీద చెప్పాలంటే.. 2026 సాధారణ సంవత్సరం కాదు. ఇది గ్లిచ్ ఇయర్. సంఖ్యలు, క్యాలెండర్, టెక్నాలజీ, మానవ జీవితం అన్నీ ఒకే చోట కలిసే మలుపు ఇది. భవిష్యత్తులో చెప్పే మాట.. “ఇక్కడినుంచే నిజమైన మార్పు మొదలైంది.” అని.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
ప్రపంచం
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Recommended image2
Now Playing
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu
Recommended image3
Now Playing
Lunar Eclipse Visuals From New Delhi: ఇండియా గేట్ పై కనువిందు చేసిన బ్లడ్ మూన్| Asianet News Telugu
Related Stories
Recommended image1
LIC: ఏడాదికి ల‌క్ష రూపాయ‌ల గ్యారంటీ పెన్ష‌న్‌.. ఎల్ఐసీ నుంచి అద్భుత‌మైన స్కీమ్
Recommended image2
Zodiac sign: నిరుద్యోగుల రాత మార‌నుంది.. 2026లో ఈ 5 రాశుల వారికి ఉద్యోగం రావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved