MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • KCRకి ఇష్ట‌మైన కూర‌ ఏంటి.? షాపింగ్ ఎక్క‌డ చేస్తారో తెలుసా.? 50 ఏళ్ల నుంచి అక్క‌డే

KCRకి ఇష్ట‌మైన కూర‌ ఏంటి.? షాపింగ్ ఎక్క‌డ చేస్తారో తెలుసా.? 50 ఏళ్ల నుంచి అక్క‌డే

KCR: తెలంగాణ సాధించిన వ్య‌క్తిగా, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా ఎన‌లేని కీర్తిని గ‌డించారు కేసీఆర్‌. కేవ‌లం రాజ‌కీయం త‌ప్ప మ‌రోటి తెలియ‌ద‌ని చెప్పే కేసీఆర్ ఆస‌క్తులు, ఆయ‌న‌కు ఇష్ట‌మైన ఫుడ్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 05 2026, 06:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజకీయాలను ‘టాస్క్‌’గా చూసే నాయకత్వం
Image Credit : KCR/X

రాజకీయాలను ‘టాస్క్‌’గా చూసే నాయకత్వం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ రాజకీయాలను ఓ బాధ్యతగా, ఓ టాస్క్‌లా చూస్తారని ఆయన మాటల్లోనే పలుమార్లు వెల్లడైంది. ఈ దృక్పథమే ఆయనను దేశ రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలబెట్టింది. నిరంతర అధ్యయనం, అంశాలపై లోతైన అవగాహన, పరిస్థితిని తక్షణమే అంచనా వేసే సామర్థ్యం ఆయన రాజకీయ శైలికి పునాది. అదే సమయంలో ఆయన ప్రసంగాలు శ్రోతల్ని ఆకట్టుకుంటాయి. ఉత్తేజం కలిగిస్తాయి. ఆలోచన రేకెత్తిస్తాయి. అవసరమైతే ఆవేశం కూడా రగిలిస్తాయి. ఎప్పుడు ఏ అంశాన్ని ఎంత లోతుగా మాట్లాడాలో స్పష్టత ఉన్న నాయకుడిగా కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రసంగానికి ముందు ప్రత్యేకంగా సిద్ధమయ్యే అలవాటు పెద్దగా లేకపోయినా, మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉండాలన్న నమ్మకం మాత్రం ఆయనలో బలంగా కనిపిస్తుంది.

25
వ్యవసాయం పట్ల ప్రత్యేక మక్కువ
Image Credit : KCR Twitter

వ్యవసాయం పట్ల ప్రత్యేక మక్కువ

రాజకీయాలతో బిజీగా ఉండే కేసీఆర్‌కు వ్యవసాయం అంటే ప్రత్యేక ఆసక్తి. వ్యవసాయ క్షేత్రంలో కొత్త ప్రయోగాలు చేయడం ఆయనకు ఇష్టం. గతంలో క్యాప్సికం, ఆలూ, అల్లం వంటి పంటలపై ప్రయోగాలు చేశారు. వాణిజ్య పంటల సాగుపై దృష్టి పెట్టే వ్యక్తిగా కూడా ఆయనకు పేరు ఉంది. వ్యవసాయాన్ని కేవలం ఉపాధిగా కాకుండా గౌరవప్రదమైన రంగంగా చూడాలన్న ఆలోచన ఆయనలో ఎప్పుడూ కనిపిస్తుంది. కారు డ్రైవింగ్‌ కూడా ఆయనకు ఇష్టమైన వ్యాపకాల్లో ఒకటి. ఎర్ర‌వ‌ల్లిలోని ఆయ‌న వ్య‌వ‌సాయం క్షేత్రంలో పెద్ద ఎత్తున పంట‌లు పండిస్తుంటారు.

Related Articles

Related image1
Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
Related image2
Interesting facts: బార్డ‌ర్‌లో ఫెన్షింగ్‌కు ఇలా ఖాళీ సీసాలు ఎందుకు వేలాడ‌దీస్తారో తెలుసా.?
35
వ్యక్తిగత జీవితం, ఇష్టాలు
Image Credit : KCR Twitter

వ్యక్తిగత జీవితం, ఇష్టాలు

సీరియస్‌ రాజకీయ నాయకుడిగా కనిపించే కేసీఆర్‌ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా సింపుల్‌. సతీమణి శోభమ్మకు అప్పుడప్పుడు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌లు ఇవ్వడం ఆయనకు అలవాటు. ఇక జేమ్స్‌బాండ్‌ సిరీస్‌, షోలే, సాగరసంగమం, స్వాతిముత్యం వంటి సినిమాలు ఆయనకు ఇష్టమైనవి. అమితాబ్‌బచ్చన్‌, ఎన్టీఆర్‌, కృష్ణ పాత సినిమాలు చూడటం ఆయనకు ఇష్టం. నాటుకోడి, టమాట పప్పు, రోటి పచ్చడి, పచ్చిపులుసు లాంటి సంప్రదాయ వంటకాలు ఇష్టపడతారు. భోజనంలో మితాహారం పాటిస్తారు. తెలుపు, మెరూన్‌ రంగులంటే ప్రత్యేక అభిమానం.

45
50 ఏళ్లుగా అక్క‌డే
Image Credit : KCR Twitter

50 ఏళ్లుగా అక్క‌డే

‘ఓల్గా నుంచి గంగకు’ అనే పుస్తకం ఆయనకు ఎంతో ఇష్టం. అబిడ్స్‌ మెట్రో ఫుట్‌వేర్‌, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర ఉన్న శ్రీ సాయి ఖాదీ వస్త్రాలయం ఆయనకు నచ్చిన షాపింగ్‌ కేంద్రాలు. దాదాపు 50 ఏళ్లుగా అక్కడే దుస్తులు కొనుగోలు చేస్తున్నానని కేసీఆర్‌ స్వయంగా చెప్పారు. ఇక కేసీఆర్‌ ఎప్పుడూ తెలుపు రంగు దుస్తుల‌ను మాత్ర‌మే ధ‌రిస్తుంటారు.

55
కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన కర్రీ ఇదే
Image Credit : KCR Twitter

కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన కర్రీ ఇదే

భోజన ప్రియుడిగా కేసీఆర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. చూసేందుకు సన్నగా కనిపించినా, అతిథులకు విందు పెట్టడంలో ఆయనది పెద్ద మనసు. అధికారంలో ఉన్న సమయంలోనే కాదు, ప్రస్తుతం కూడా ఫామ్‌హౌజ్‌కు వచ్చే అతిథులతో కలిసి భోజనం చేయడం ఆయనకు అలవాటు. శాఖాహారం, మాంసాహారం రెండింటిలోనూ రకరకాల వంటకాలు వండిస్తుంటారు. అయితే భోజనంలో మాంసాహారం లేకపోతే ముద్ద దిగదన్న విషయం సన్నిహితులు అంటుంటారు. నాటుకోడి కూర, మేక మాంసం, బోటి, చేపలు తరచూ ఆయన భోజనంలో ఉంటాయి.

అయితే వీటన్నింటిలోకీ కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన కర్రీ తలకాయ కూర. తెలంగాణ ప్రత్యేక వంటకాలలో ఇది ఒకటి. ఈ వంటకం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమని ఆయన సన్నిహితులు పలుమార్లు వెల్లడించారు. కేసీఆర్‌ స్వయంగా కూడా ఈ విషయాన్ని వివిధ సందర్భాల్లో ప్రస్తావించారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Actor Chiranjeevi: వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమంలో చిరు పంచ్ లకి నవ్వులే నవ్వులు | Asianet Telugu
Recommended image2
Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
Recommended image3
Now Playing
మీరు ఎంత ఎగిరినా... ఈసారి కేసీఆరే సీఎం | Ravula Sridhar Reddy on Revanth Reddy | Asianet News Telugu
Related Stories
Recommended image1
Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం
Recommended image2
Interesting facts: బార్డ‌ర్‌లో ఫెన్షింగ్‌కు ఇలా ఖాళీ సీసాలు ఎందుకు వేలాడ‌దీస్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved