MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం

Hyderabad: అప్పుడు కొన‌లేద‌ని బాధ‌ప‌డుతున్నారా.? ఈ గ్రామాలు త్వ‌ర‌లోనే మ‌రో హైటెక్ సిటీ కావ‌డం ఖాయం

Hyderabad: హైద‌రాబాద్‌లో ఒక‌ప్పుడు హైటెక్ సిటీ, గ‌చ్చిబౌలి ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన వారు నేడు కోటీశ్వ‌రుల‌య్యారు. ఆ స‌మ‌యంలో భూములు కొన‌క బాధ‌ప‌డుతున్న వారికి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్‌. హైద‌రాబాద్‌లో మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది. By Nidhi Singh 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 04 2026, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్
Image Credit : Gemini AI

బలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్

దేశవ్యాప్తంగా కొన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ మందగించినా, హైదరాబాద్ మాత్రం భిన్నంగా ముందుకెళ్తోంది. ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, విల్లాల ధరలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. ఇటీవల తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ నిర్వహించిన వేలంపాటల్లో ప్లాట్లు రికార్డు ధరలకు అమ్ముడుపోవడం ఈ విషయానికి స్పష్టమైన ఉదాహరణ. నగర పరిధి అంతటా కొత్త టవర్లు, గేటెడ్ కమ్యూనిటీలు రూపుదిద్దుకుంటుండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతోంది.

25
పశ్చిమం నుంచి తూర్పు వైపు మారుతున్న అభివృద్ధి దిశ
Image Credit : Gemini AI

పశ్చిమం నుంచి తూర్పు వైపు మారుతున్న అభివృద్ధి దిశ

గతంలో హైటెక్ సిటీ ప్రభావంతో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయి. ఐటీ కంపెనీల రాకతో అక్కడ భూమి విలువలు కోట్లకు చేరాయి. ఆ ప్రభావం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు దాటి శంకర్‌పల్లి, మోకిలా వరకు విస్తరించింది. ఇప్పుడు అదే తరహా అభివృద్ధి మరో కొత్త దిశగా మలుపు తిరుగుతోంది.

Related Articles

Related image1
Interesting facts: బార్డ‌ర్‌లో ఫెన్షింగ్‌కు ఇలా ఖాళీ సీసాలు ఎందుకు వేలాడ‌దీస్తారో తెలుసా.?
Related image2
Altered oil: మీరు వాడుతోన్న నూనె పశువుల కొవ్వుతో చేసిందా.? ఎలా తెలుసుకోవాలంటే..
35
ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ నెక్ట్స్‌ గ్రోత్ ఇంజన్
Image Credit : Gemini AI

ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ నెక్ట్స్‌ గ్రోత్ ఇంజన్

తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యూచర్ సిటీ’ పేరిట హైదరాబాద్ ఆగ్నేయ భాగంలో భారీ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. దీనిని నగరానికి నాలుగో ప్రధాన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. పరిశ్రమలు, ఐటీ హబ్‌లు, వాణిజ్య కేంద్రాలు ఆకర్షించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం విశేషం.

45
కనెక్టివిటీ పెరిగితే విలువలు పెరుగుతాయి
Image Credit : Getty

కనెక్టివిటీ పెరిగితే విలువలు పెరుగుతాయి

ఈ ప్రాంతానికి ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ ఇప్పటికే ఉంది. రీజినల్ రింగ్ రోడ్డు అనుసంధానం కూడా రానుంది. భవిష్యత్తులో మెట్రో రైలు పొడిగింపు ప్రణాళికలు పెట్టుబడిదారులలో విశ్వాసం పెంచుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు సమీపంగా ఉండటం ఈ ప్రాంతానికి మరింత ప్లస్ పాయింట్. రవాణా సౌకర్యాలు మెరుగుపడిన ప్రతిసారి, రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతాయన్నది గత అనుభవం చెబుతోంది.

55
ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న గ్రామాలు, పెట్టుబడి అవకాశాలు
Image Credit : Gemini AI

ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న గ్రామాలు, పెట్టుబడి అవకాశాలు

ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 మండలాలకు చెందిన 56 గ్రామాలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, యాచారం, కందుకూరు, కడ్తాల్ వంటి ప్రాంతాలు ఇప్పటికే రియల్ ఎస్టేట్ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మౌలిక వసతుల పనులు మొదలవ్వడంతో ప్లాట్ ధరలు నెమ్మదిగా పైకి కదులుతున్నాయి. ఇదే ఊపులో అభివృద్ధి కొనసాగితే, ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు మాత్ర‌మే. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును రియ‌ల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల స‌ల‌హాలు తీసుకోవ‌డం ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మీరు ఎంత ఎగిరినా... ఈసారి కేసీఆరే సీఎం | Ravula Sridhar Reddy on Revanth Reddy | Asianet News Telugu
Recommended image2
World Cancer Day: క్యాన్స‌ర్‌ను జ‌యించ‌డం పెద్ద క‌ష్టమేమి కాదు.. వీరి క‌థ‌లు వింటే మీరూ ఇదే అంటారు.
Recommended image3
వీడసలు మనిషేనా..! సర్పంచ్ పదవి కోసం కన్నకూతురిపై ఇంత కర్కశత్వమా..!
Related Stories
Recommended image1
Interesting facts: బార్డ‌ర్‌లో ఫెన్షింగ్‌కు ఇలా ఖాళీ సీసాలు ఎందుకు వేలాడ‌దీస్తారో తెలుసా.?
Recommended image2
Altered oil: మీరు వాడుతోన్న నూనె పశువుల కొవ్వుతో చేసిందా.? ఎలా తెలుసుకోవాలంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved