Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతం మరో మాదాపూర్ కావడం ఖాయం
Hyderabad: దేశంలో అత్యంత వేగంగా రియల్ఎస్టేట్ పెరుగుతోన్న నగరంలో హైదరాబాద్ ఒకటి. నగరంలో ఎన్నో ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. కాగా నగరంలోని మరో ప్రాంతంలో అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటంటే..

గతంలో మాదాపూర్ ఇప్పుడు..
ఒక 20 ఏళ్ల క్రితం మాదాపుర్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు శివారు ప్రాంతంగా ఉన్న మాదాపుర్ ఇప్పుడు సెంటర్‌గా మారిపోయింది. ఐటీ సంస్థల రాకతో మాదాపూర్‌లో పెద్ద పెద్ద షోరూమ్‌లు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు వచ్చేశాయ్. ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండటం, మెరుగైన రహదారుల కలయిక కావడం, కార్పొరేట్ ఆఫీసులు ఏర్పడటం వంటి అంశాలు ఆ ప్రాంతాన్ని ఆకస్మాత్తుగా హాట్‌స్పాట్‌గా మార్చాయి. ఇప్పుడు అదే నమూనా తెల్లాపూర్‌లో కూడా కనిపిస్తోంది. ఐటీ కారిడార్‌కు దగ్గరగా ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన ప్లస్ పాయింట్ గా మారింది.
గచ్చిబౌలి–ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు నేరుగా కనెక్టివిటీ
తెల్లాపూర్ నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ్ ఐటి కారిడార్ వరకు చేరుకోవడం చాలా సులువు కావడంతో ఉద్యోగుల దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ORRకు దగ్గరల్లో ఉండడం, మల్టీ-లేయర్ రోడ్ల నిర్మాణం, కొత్త ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లు ఈ ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ మ్యాప్‌లో వేగంగా పైకి తీసుకెళ్తున్నాయి.
వేగంగా పెరుగుతోన్న ధరలు
ఇటీవల తెల్లాపూర్‌లో నివాస ప్రాజెక్టుల ధరలు భారీగా పెరిగాయి. అపార్ట్‌మెంట్ ప్లాట్లు రూ. 70 లక్షల నుంచి రూ. 2 కోట్లకు పైగా పలుకుతున్నాయి. విల్లాలు/ఇండిపెండెంట్ హౌసుల విషయానికొస్తే రూ. 3 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు ఉంటున్నాయి. ప్రీమియమ్ గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ విల్లా ప్రాజెక్టులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో రూపుదిద్దుకుంటున్నాయి. నాణ్యమైన నిర్మాణాలు, ఆధునిక సదుపాయాలు ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి.
విద్యా సంస్థలు, ఆసుపత్రులు
తెల్లాపూర్‌లో పలు అంతర్జాతీయ పాఠశాలలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు సమీపంలో ఉన్నాయి. దీనితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, షాపింగ్ జోన్‌లు, రెస్టారెంట్లు ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్నాయి. కుటుంబాలతో స్థిరపడాలనుకునే వారిని ఈ సదుపాయాలు మరింత ఆకర్షిస్తున్నాయి.
కార్పొరేట్ ప్రాజెక్టుల ఎంట్రీ
పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు తెల్లాపూర్‌లో మల్టీ-ఎకర్ ప్రాజెక్టులను చేపడుతున్నాయి. హై–ఎండ్ కమ్యూనిటీలు, పెద్ద మిక్స్‌డ్-యూజ్ డెవలప్మెంట్స్, ప్రీమియమ్ లైఫ్‌స్టైల్ ప్రాజెక్టులు ఇప్పటికే కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ పెట్టుబడులు భవిష్యత్తులో ప్రాంతాన్ని నగరంలో అత్యంత ప్రాధాన్యమైన నివాస జోన్‌గా మార్చే అవకాశం ఉంది. ఇప్పటికే మైహోమ్ వంటి దిగ్గజ డెవలపర్స్ తెల్లాపూర్‌లో భారీ ప్రాజెక్టులను చేపట్టాయి. ఎంఎంటీఎస్ అందుబాటులోకి రావడం కూడా ఈ ప్రాంతానికి కలిసొచ్చిందని చెప్పాలి.

