- Home
- Business
- Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Hyderabad: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. హైదరాబాద్‌లో మరో ఫ్లై ఓవర్, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఎన్నో ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే తాజాగా నగరంలో మరో కీలక ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. కీలక ప్రదేశంలో 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టనున్నారు.

ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం
హైదరాబాద్‌లో ముఖ్యంగా బంజారాహిల్స్, ఫిలింనగర్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజూ భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వచ్చింది. సైబరాబాద్ ఐటీ కారిడార్‌తో నేరుగా అనుసంధానించే కొత్త 6-లైన్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రయారిటీగా పెట్టుకున్నారు.
బంజారాహిల్స్–గచ్చిబౌలి మధ్య
కొత్త ఎక్స్‌ప్రెస్ వే బంజారాహిల్స్ రోడ్ నం.12 నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. ఇది పూర్తయ్యాక పీవీ ఎక్స్‌ప్రెస్ వే తరహాలో, ఏ ఆటంకాలు లేకుండా నేరుగా వేగంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులకు ఇది గొప్ప ఉపశమనం కానుంది. దీంతో ORR నుంచి సిటీ మిడిల్‌కు మరింత సులభంగా చేరుకోవచ్చు.
స్టీల్ బ్రిడ్జ్, అండర్‌పాస్‌లతో ఆధునిక నిర్మాణం
ఈ మార్గంలో దాదాపు ఆరేడు కిలోమీటర్ల పాటు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రతిపాదించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అండర్‌పాస్‌లను ఏర్పాటు చేయాలని అధికారులు పరిశీలిస్తున్నారు. రహదారి నిర్మాణంలో ఎక్కడ ఫ్లైఓవర్ అవసరం, ఎక్కడ రోడ్డు వెడల్పు సాధ్యం వంటి అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతోంది.
ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుంది.?
ఈ కొత్త మార్గం ద్వారా బంజారాహిల్స్ రోడ్ నం.12, ఫిలింనగర్, జడ్జిస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, గచ్చిబౌలి చౌరస్తా, శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ కవర్ అవుతాయి. ఈ లింకింగ్‌తో కోర్ సిటీ నుంచి ఐటీ హబ్‌కు ఎలాంటి గందరగోళం లేకుండా ప్రయాణించవచ్చు.
త్వరలోనే డీపీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు HMDA ఈ ప్రాజెక్టును ప్రయారిటీగా తీసుకుంది. ప్రత్యేక కన్సల్టెన్సీ సంస్థ ఇప్పటికే సర్వే పనులు చేపట్టింది. రోడ్ల పరిస్థితి, భూసేకరణ అవసరం, డిజైన్ మార్పులు వంటి అంశాలపై వారి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోంది. త్వరలోనే పూర్తి స్థాయి DPR (Detailed Project Report) ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ వే పూర్తయితే, హైదరాబాద్ రోడ్డు వ్యవస్థలో ఇది ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుంది.

