- Home
- Telangana
- Hyderabad: యువత తల రాత మార్చేలా.. హైదరాబాద్‌లో గూగుల్ తొలి స్టార్టప్స్ హబ్, దీని ఉపయోగం ఏంటంటే
Hyderabad: యువత తల రాత మార్చేలా.. హైదరాబాద్‌లో గూగుల్ తొలి స్టార్టప్స్ హబ్, దీని ఉపయోగం ఏంటంటే
Hyderabad: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం కలిసి హైదరాబాద్‌లోని T-Hub వద్ద Google for Startups Hub ను అధికారికంగా ప్రారంభించారు. ఇంతకీ స్టార్టప్స్ హబ్ అంటే ఏంటి.? ఎందుకు ఉపయోగపడుతుంది.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ స్టార్టప్స్ హబ్ ఎందుకు ఏర్పాటు చేశారు.?
ఇది భారతదేశంలో గూగుల్ ఏర్పాటు చేసిన మొదటి ప్రత్యేక స్టార్టప్ హబ్. ముఖ్యంగా AI (Artificial Intelligence) ఆధారిత స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కేంద్రం తెలంగాణలోని ఇన్నోవేషన్ ఎకోసిస్టంను మరింత బలపరచనుంది. ఈ హబ్ ప్రధాన లక్ష్యం..
* తెలంగాణలో పెరుగుతున్న స్టార్టప్స్‌కు అంతర్జాతీయ స్థాయిలో సపోర్ట్ అందించడం.
* AI ఆధారిత యువ ఆవిష్కర్తలకు మార్గదర్శనం ఇవ్వడం
* ప్రపంచ మార్కెట్లతో నేరుగా కనెక్ట్ అయ్యే ప్లాట్ఫామ్‌ను ఏర్పరచడం.
గూగుల్ తన టెక్నాలజీ నైపుణ్యాన్ని, AI/ML పరిజ్ఞానం, అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను తెలంగాణ స్టార్టప్ ప్రపంచంతో కలిపి కొత్త తరం ఆవిష్కర్తలను పెంపొందించడానికి ఈ హబ్‌ను ప్రత్యేకంగా రూపొందించింది.
స్టార్టప్‌లకు లభించే ముఖ్య సేవలు
ఈ కేంద్రంలో ఎంపికైన స్టార్టప్‌లకు గూగుల్, తెలంగాణ ప్రభుత్వం కలిసి పలు ముఖ్య ప్రయోజనాలు అందిస్తాయి.
* ఏడాది పాటు ఉచిత కో-వర్కింగ్ స్పేస్
* AI/ML నిపుణుల నుంచి ప్రత్యక్ష మార్గనిర్దేశనం
* ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, UX డిజైన్, మార్కెట్ స్ట్రాటజీలపై గూగుల్ టీమ్ నుంచి గైడెన్స్
* వెంచర్ క్యాపిటలిస్టులతో నేరుగా కనెక్షన్
* స్టార్టప్‌లకు మెంటర్‌షిప్ సెషన్లు, వర్క్‌షాప్‌లు
* భారతదేశంలోనే కాదు, ప్రపంచ మార్కెట్లలో అవకాశాలు కల్పించడం
* అన్నింటికంటే మహిళా వ్యాపారవేత్తలు, టైర్ 2 నగరాల నుంచి వచ్చిన యువ ప్రతిభ, విశ్వవిద్యాలయ విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తారు.
తెలంగాణ స్టార్టప్ ప్రపంచానికి హబ్‌గా..
హైదరాబాద్ ఇప్పటికే “ఇన్నోవేషన్ సిటీ”గా ఎదుగుతోంది. T-Hub, We-Hub, TSIC వంటి సంస్థలు రాష్ట్రంలో స్టార్టప్ కల్చర్‌ను వేగంగా పెంచుతున్నాయి. ఇదే వ్యవస్థలోకి గూగుల్ చేరడం పలు ప్రయోజనాలు కలగనున్నాయి. దీంతో ప్రపంచస్థాయి AI టెక్నాలజీ వెలుగులోకి వస్తుంది. ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టి తెలంగాణ వైపు మళ్లుతుంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ క్లయింట్లను చేరుకునే అవకాశం లభిస్తుంది. స్టార్టప్‌లు వేగంగా స్కేల్ అయ్యే వాతావరణం పెరుగుతుంది. టెక్నాలజీ ఆధారిత ఉద్యోగావకాశాల పెరుగుతాయి.
స్టార్టప్ హబ్ ఎలా పనిచేస్తుంది?
ఈ హబ్‌లో స్టార్టప్‌లు తమ ప్రయాణాన్ని ఒకే చోట పూర్తి చేయగలిగే విధంగా రూపుదిద్దుకుంది.
హబ్‌లో అందించే దశలవారీ సహాయం:
* ఐడియా స్టేజ్: ఐడియాను ప్రొడక్ట్‌గా మార్చే మార్గదర్శకం. టెక్నికల్ సహాయం అందిస్తారు.
* ప్రొడక్ట్ డెవలప్‌మెంట్: AI, ML, UX Design, Product Testing సహాయం
*మార్కెట్లో నిలదొక్కుకోవడం (Go-to-Market Strategy): మార్కెట్ రీసెర్చ్, యూజర్ల అవసరాల విశ్లేషణ.
* వెంచర్ ఫండింగ్: పెట్టుబడిదారులతో మీటింగ్స్, పిచ్ డెక్ ట్రైనింగ్.
* స్కేలింగ్ & గ్లోబల్ విజిబిలిటీ: అంతర్జాతీయ మార్కెట్లకు కనెక్షన్. విదేశీ మెంటర్లతో ప్రత్యేక సెషన్లు. స్టార్టప్ ఒక ఐడియా నుంచి అంతర్జాతీయ మార్కెట్ వరకు ఎదగడానికి ఇది పూర్తి ప్రోత్సాహం ఇచ్చే కేంద్రంగా చెప్పొచ్చు.
తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ భాగస్వామ్యం
ఈ స్టార్టప్ హబ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతీ లోబానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “హైదరాబాద్‌ను ప్రపంచ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం మా లక్ష్యం.” అని చెప్పుకొచ్చారు.

