- Home
- Telangana
- Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Hyderabad: గుడ్ న్యూస్.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్.. ఈ ప్రాంతాలన్ని మారిపోతాయి !
Hyderabad ORR Metro Route: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) చుట్టూ 158 కిలోమీటర్ల మేర మహా మెట్రో ఏర్పాటుకు సర్కార్ సిద్ధం అవుతోంది. దిమ్మతిరిగే ప్లాన్ తో ఢిల్లీ రేంజ్‌లో భాగ్యనగరం చుట్టూ మెట్రో లూప్ ఏర్పాటు చేయలని చూస్తోంది. ఆ వివరాలు మీకోసం.

హైదరాబాద్‌కు మెగా గిఫ్ట్: ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో.. ఇక సిటీ ట్రాఫిక్‌కు బై బై
హైదరాబాద్ సిటీ క్రేజ్ రోజురోజుకూ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తోంది. నగరం కేవలం ఒకవైపు మాత్రమే కాకుండా 360 డిగ్రీల కోణంలో విస్తరిస్తూ దూసుకుపోతోంది. అయితే, పెరిగే పాపులేషన్‌తో పాటు ట్రాఫిక్, కాలుష్యం కూడా పెరిగిపోతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
గ్రేటర్ హైదరాబాద్ (CURE) పరిధిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను కంప్లీట్‌గా మార్చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇందులో భాగంగానే పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు, సిటీ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వెంట మెట్రో కారిడార్‌ను తీసుకురావడానికి హెచ్‌ఎండీఏ (HMDA), మెట్రో అధికారులు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలా మన హైదరాబాద్‌లోనూ అలాంటి వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ ఉండాలని సర్కార్ భావిస్తోంది.

Hyderabad ORR Metro Route: ఫేజ్-2 డీపీఆర్ రెడీ.. !
హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించిన పక్కా ప్రణాళికను ప్రభుత్వం ఆల్రెడీ సిద్ధం చేసింది. మొత్తం 122.6 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ కోసం ఏకంగా రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం (50:50) నిధులు భరించేలా జాయింట్ వెంచర్ కింద ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ సెకండ్ ఫేజ్‌లో ఎక్కడెక్కడ రూట్లు ఉన్నాయో ఒకసారి చూస్తే..
• నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (36.8 కి.మీ.)
• రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ.)
• ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ.)
• మియాపూర్ నుంచి పటాన్‌చెరు (13.4 కి.మీ.)
• ఎల్‌బీ నగర్ నుంచి హయాత్‌నగర్ (7.1 కి.మీ.)
• జేబీఎస్ నుంచి మేడ్చల్ (24.5 కి.మీ.)
• జేబీఎస్ నుంచి శామీర్‌పేట (22 కి.మీ.)
థర్డ్ ఫేజ్‌లో ఓఆర్ఆర్ లూప్
ఇక అసలు సిసలైన మ్యాజిక్ మూడో దశలో జరగబోతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి కొత్తగా 'భారత్ ఫ్యూచర్ సిటీ' వరకు 39.6 కిలోమీటర్ల మార్గాన్ని (రూ.7,168 కోట్లు) ఫేజ్ 3 కింద చేపట్టనున్నారు. దీనితో పాటే 158 కిలోమీటర్ల సుదీర్ఘమైన ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైలును తిప్పనున్నారు.
ఈ ప్రాజెక్టుకు ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే.. అసలు భూసేకరణ ఇబ్బందులే లేవు. గతంలో ఓఆర్ఆర్ నిర్మించినప్పుడే భవిష్యత్తు రవాణా అవసరాల కోసం సర్వీస్ రోడ్డు పక్కన 25 మీటర్ల స్థలాన్ని అలాగే వదిలేశారు. కాబట్టి ఎవరికీ నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేకుండా, ఎలాంటి కోర్టు కేసుల గొడవలు లేకుండా పనులు సూపర్ ఫాస్ట్‌గా జరిగిపోతాయని సమాచారం.
22 జంక్షన్ల వద్ద స్టేషన్లు.. దూసుకుపోనున్న రియల్ ఎస్టేట్
ఇబ్రాహీంపట్నం, పటాన్‌చెరు, చౌటుప్పల్, మేడ్చల్, శామీర్‌పేట్, శంషాబాద్, తుక్కుగూడ, ఘట్‌కేసర్ లాంటి శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ లక్షలాది మంది జాబ్స్ కోసం సిటీకి వస్తుంటారు. వీరందరికీ ఓఆర్ఆర్ మెట్రో ఒక వరం కానుంది. ఓఆర్ఆర్ వెంట ఉండే 22 ప్రధాన ఇంటర్‌ఛేంజ్‌ల వద్దే మెట్రో స్టేషన్లను ప్లాన్ చేస్తున్నారు.
భవిష్యత్తులో ఇవి 25కి చేరొచ్చు. అక్కడికి వచ్చే జనాలు తమ కార్లు, బైకులు పార్క్ చేసుకోవడానికి భారీ మల్టీ లెవల్ పార్కింగ్ తో పాటు, స్టేషన్లకు వెళ్లడానికి ఈజీగా ఉండేలా స్కైవాక్స్ కడతారు. ఫైనల్‌గా.. ఫస్ట్ ఫేజ్ (69 కి.మీ), సెకండ్ ఫేజ్ (122.6 కి.మీ), ఓఆర్ఆర్ చుట్టూ (160 కి.మీ), ఫ్యూచర్ సిటీ (39.6 కి.మీ) అంతా కలిపితే భాగ్యనగరంలో టోటల్‌గా 391 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్ ఏర్పడుతుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ భూమ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం పక్కా అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

