MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Telangana
  • August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?

August Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే న్యూస్.. ఆగస్ట్ లో ఏకంగా 12 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకు?

ఆగస్ట్ లో తెలుగు విద్యార్థులకు పండగే… ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా 12 రోజులు సెలవులు వస్తున్నాయి. పరిస్థితులకు బట్టి ఈ సెలవులు మరింత పెరిగే అవకాశాలున్నాయి.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 24 2026, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆగస్ట్ లో వరుస సెలవులు... లాంగ్ వీకెండ్స్
Image Credit : Gemini AI

ఆగస్ట్ లో వరుస సెలవులు... లాంగ్ వీకెండ్స్

School Holidays : సెలవులు... ఈ పదం వింటే చాలు విద్యార్థులకు పట్టలేని ఆనందం. ఉదయమే పుస్తకాల బ్యాగును భుజానేసుకుని స్కూల్ కి వెళ్లడం, రోజంతా టీచర్లు చెప్పే పాఠాలు వినడం, సాయంత్రం ఉసూరుముంటు ఇంటికి చేరడం, ట్యూషన్లు, హోమ్ వర్క్ లు... ఇలా తీరికలేకుండా గడుపుతారు కాబట్టే సెలవు వచ్చిందంటే ఎగిరి గంతేస్తారు విద్యార్థులు. ప్రతి వీక్ వచ్చే ఆదివారం సెలవు కోసమే ఎదురుచూస్తారు... అలాంటిది పండగలకో, ప్రత్యేక వేడుకలకో హాలిడేస్ వచ్చాయంటే వారి ఆనందానికి అవధులు ఉండవు.

అయితే వేసవి సెలవులు ముగిసి జూన్ లో విద్యాసంస్థలు ప్రారంభం అయ్యాక పెద్దగా సెలవులేమీ రాలేవు. జూలైలో అయితే ఆదివారాలు మినహా సెలవులేమీ లేవు... దీంతో ప్రతిరోజు విద్యార్థులు స్కూల్ కి వెళ్లాల్సి వచ్చింది. అయితే వచ్చేనెల ఆగస్ట్ లో మాత్రం భారీగా సెలవులు వస్తున్నాయి... నెలలో 31 రోజులుంటే కేవలం 19 రోజులే వర్కింగ్ డేస్... 12 రోజులు సెలవులే. మరి ఆగస్ట్ లో ఏరోజు, ఎందుకు సెలవుందో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆగస్ట్ 8,9,10 సెలవులే... లాంగ్ వీకెండ్
Image Credit : getty

ఆగస్ట్ 8,9,10 సెలవులే... లాంగ్ వీకెండ్

ఆగస్ట్ లో విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా వరుస సెలవులు ఉన్నాయి. మొదటి వారంనుండే సెలవులు ప్రారంభం అవుతున్నాయి... ప్రతి వీక్ లాంగ్ వీకెండ్ వస్తోంది. ఇలా ఆగస్ట్ 8,9,10 మూడ్రోజులు సెలవులున్నాయి.

ఆగస్ట్ 8 (రెండో శనివారం)

ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటికి సెలవే. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవే. ఇక సాప్ట్ వేర్, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవే ఉంటుంది... కాబట్టి వీరికి యధావిధిగా సెలవు ఉంటుంది.

ఆగస్ట్ 9 (ఆదివారం)

ఆదివారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవే. కాబట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులు, ఉద్యోగులకు వరుసగా రెండోరోజు సెలవులు కలిసివస్తున్నాయి.

ఆగస్ట్ 10 (సోమవారం)

తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మరో సెలవు కలిసివస్తోంది. ఆదివారం (ఆగస్ట్ 9) ఆషాడ మాస బోనాల వేడుకలు హైదరాబాద్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతాయి. ఈ సందర్భంగా బోనాల తర్వాతి రోజు అంటే సోమవారం తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆఫీసులకు అధికారికంగా సెలవు ఇస్తోంది ప్రభుత్వం. తెలంగాణలో మాత్రమే ఈ సెలవు వర్తిస్తుంది… ఆంధ్ర ప్రదేశ్ లో యధావిధిగా వర్కింగ్ డే.

Related Articles

Related image1
August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే
Related image2
Bank Holidays : అరెరే..! ఈ వారం ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులున్నాయా?
35
ఆగస్ట్ 15, 16 సెలవులు
Image Credit : Asianet News

ఆగస్ట్ 15, 16 సెలవులు

ఆగస్ట్ 15 (స్వాతంత్య్ర దినోత్సవం)

ఆగస్ట్ 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం... ఈరోజు విద్యాసంస్థలు, ఆఫీసుల్లో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి. జాతీయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో పాటే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో సెలవు ఉంటుంది.

ఆగస్ట్ 16 (ఆదివారం)

స్వాతంత్య్ర దినోత్సవం శనివారం రావడంతో రెండ్రోజులు సెలవులు కలిసివస్తున్నాయి. ఆగస్ట్ 16న ఆదివారం కాబట్టి విద్యాసంస్థలు, ఆఫీసులకు సాధారణ సెలవు ఉంటుంది. ఇలా ఆగస్ట్ సెకండ్ వీక్ కూడా లాంగ్ వీకెండ్ వస్తోంది.

45
ఆగస్ట్ లాస్ట్ వీక్ లో మరో స్పెషల్ హాలిడే
Image Credit : unsplash

ఆగస్ట్ లాస్ట్ వీక్ లో మరో స్పెషల్ హాలిడే

ఆగస్ట్ చివరివారంలో మరో ప్రత్యేక సెలవు ఉంది. ముస్లింల ఆరాధ్యదైవం మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మిలాదున్ నబి జరుపుకుంటారు. ఈ పవిత్ర పండగ సందర్భంగా ఆగస్ట్ 26న (బుధవారం) తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు ఉంది. ముస్లింలు ఈరోజు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కుటుంబమంతా కలిసి వేడుకలు జరుపుకుంటారు.

55
ఆగస్ట్ లో ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్...
Image Credit : X/Banda Karthika Reddy

ఆగస్ట్ లో ఆప్షనల్ హాలిడేస్ లిస్ట్...

ఆగస్ట్ లో ప్రత్యేక సెలవులతో పాటు ఐదు ఆదివారాలు, ఓ రెండో శనివారం సెలవులు ఉన్నాయి. వీటితోపాటు ఉద్యోగులకు నాలుగు రోజులు ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. అంటే అవసరం అనుకుంటే ముందుస్తు అనుమతితో వేతనంతో కూడిన సెలవును ఉద్యోగులు పొందవచ్చు. మరి ఏరోజు, ఎందుకు ఐచ్చిక సెలవు ఉందో తెలుసుకుందాం.

ఆగస్ట్ 4 (మంగళవారం) - అర్భాయిన్

ఇది ముస్లింలకు ఎంతో పవిత్రమైన రోజు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ కర్బల యుద్దంలో బలిదానం చేసి 40 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ అర్బాయిన్ జరుపుకుంటారు. అంటే ఇది ఓ సంస్మరణ దినం అన్నమాట. ఈరోజు ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులు ఆప్షనల్ హాలిడే తీసుకుంటారు.

ఆగస్ట్ 15 (శనివారం) - పారసీ న్యూ ఇయర్ 

ఆగస్ట్ 15న పారసీ న్యూఇయర్ సందర్భంగా ఉద్యోగులకు ఆప్షనల్ హలిడ్ ఉంది. ఈరోజు పారసీలకు ఎంతో పవిత్రమైనది. అయితే దీంతో పనిలేకుండానే ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారిక సెలవు ఉంది.

ఆగస్ట్ 21 (శుక్రవారం) - వరలక్ష్మి వ్రతం

హిందువులు శ్రావణమాసంను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మరింత పవిత్రమైంది... ఈరోజు పెళ్లయిన మహిళలు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అందుకే తెలుగింటి మహిళా ఉద్యోగులు ఈ వ్రతం జరుపుకునేందుకు వీలుగా ఐచ్చిక సెలవు ఇచ్చారు.

ఆగస్ట్ 28 (శుక్రవారం) శ్రావణ పూర్ణిమ

శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి కూడా చాలా పవిత్రమైందిగా హిందువులు నమ్ముతారు. ఈరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు... చాలామంది దేవాలయాలకు వెళుతుంటారు. అందుకే శ్రావణ పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఐచ్చిక సెలవు ఉంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం
Recommended image2
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image3
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Related Stories
Recommended image1
August Holidays : లాంగ్ వీకెండ్ తో ఆగస్ట్ స్టార్ట్.. ఒకటి రెండ్రోజులు కాదు వరుసగా మూడ్రోజులు సెలవులే
Recommended image2
Bank Holidays : అరెరే..! ఈ వారం ఇన్ని రోజులు బ్యాంకులకు సెలవులున్నాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved