MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10తో రైలు ప్రయాణం.. పూర్తి వివరాలు ఇవే

Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్.. రూ.10తో రైలు ప్రయాణం.. పూర్తి వివరాలు ఇవే

Komuravelli Railway Station: కొమురవెల్లి మల్లన్న భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి భక్తుల కోసం నిర్మించిన కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభం కానుంది. రైళ్ల వేళలు, టికెట్ ధరలు సహా ఇతర వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 24 2026, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Komuravelli Mallanna:ఇకపై మల్లన్న దర్శనం మరింత ఈజీ
Image Credit : Gemini

Komuravelli Mallanna:ఇకపై మల్లన్న దర్శనం మరింత ఈజీ

సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు ఇక ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. తెలంగాణలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచే దిశగా కొత్తగా నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు అధికారికంగా ప్రారంభం కానుంది.

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయిందని, ఇది ఆధ్యాత్మిక పర్యాటకానికి ఎంతో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కొమురవెల్లి రైల్వే స్టేషన్ విశేషాలు, అధునాతన వసతులు
Image Credit : Instagram/komuravelli___mallanna

కొమురవెల్లి రైల్వే స్టేషన్ విశేషాలు, అధునాతన వసతులు

రూ. 5.63 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ స్టేషన్ పనులు ఇప్పటికే 99.5 శాతం పూర్తయ్యాయి. ప్రయాణికుల కోసం ఇక్కడ ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు గల హై లెవల్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు 5 ప్లాట్‌ఫారమ్ షెల్టర్లను నిర్మించారు.

ప్రయాణికుల వెయిటింగ్ హాల్, టికెట్ బుకింగ్ కౌంటర్, బెంచీలు, సురక్షిత తాగునీటి సదుపాయాలు ఉన్నాయి. మహిళలు, పురుషులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక శౌచాలయాలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని కేటాయించారు.

Related Articles

Related image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Related image2
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
35
స్థానిక సంస్కృతికి అద్దంపట్టే శిల్పకళ
Image Credit : X/kishanreddybjp

స్థానిక సంస్కృతికి అద్దంపట్టే శిల్పకళ

కొమురవెల్లి రైల్వే స్టేషన్ కేవలం ప్రయాణానికే కాకుండా సాంస్కృతిక ప్రాధాన్యం కు నిలయంగా మారింది. స్టేషన్ గోడలపై కొమురవెల్లి మల్లన్న స్వామి రూపాన్ని, చుట్టుపక్కల ఉండే ప్రకృతి అందాలను తెలిపే అద్భుతమైన మ్యూరల్స్ వేశారు. మన హెరిటేజ్ ప్రతిబింబించేలా దీని డిజైన్ రూపొందించడం విశేషం.

45
అందుబాటులోకి వచ్చే డెమో రైళ్లు.. టైమింగ్స్
Image Credit : X/kishanreddybjp

అందుబాటులోకి వచ్చే డెమో రైళ్లు.. టైమింగ్స్

కొత్తగా ప్రారంభమవుతున్న కొమురవెల్లి స్టేషన్‌లో సికింద్రాబాద్ - సిద్దిపేట మార్గంలో నడిచే పలు డెమో రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే హాల్ట్ కల్పించింది. జులై 26 నుంచి ఆగే రైళ్ల సమయాలు ఇవే..

• రైలు నంబరు 77654 (సిద్దిపేట - సికింద్రాబాద్): ప్రతిరోజు మధ్యాహ్నం 2:38 గంటలకు కొమురవెల్లికి చేరుకుంటుంది (బుధవారం మినహా).

• రైలు నంబరు 77655 (సికింద్రాబాద్ - సిద్దిపేట): రాత్రి 8:04 గంటలకు కొమురవెల్లి స్టేషన్‌లో ఆగుతుంది (బుధవారం మినహా).

• రైలు నంబరు 77656 (సిద్దిపేట - సికింద్రాబాద్): ఉదయం 7:04 గంటలకు ఇక్కడ ఆగుతుంది (గురువారం మినహా).

• రైలు నంబరు 77653 (సికింద్రాబాద్ - సిద్దిపేట): మధ్యాహ్నం 12:52 గంటలకు కొమురవెల్లిలో నిలుస్తుంది (బుధవారం మినహా).

55
ఆధ్యాత్మిక పర్యాటకానికి, ఆర్థిక వ్యవస్థకు నెట్ వర్క్ బూస్ట్
Image Credit : X/kishanreddybjp

ఆధ్యాత్మిక పర్యాటకానికి, ఆర్థిక వ్యవస్థకు నెట్ వర్క్ బూస్ట్

కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో లఖడారం-దుద్దెడ స్టేషన్ల మధ్య మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వే లైన్‌లో ఈ స్టేషన్ ఉంది. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర సమయాల్లో వేలాదిగా వచ్చే భక్తులకు, స్థానిక వ్యాపారులకు, రోజువారీ కూలీలకు ఈ రైలు మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఈ మనోహరాబాద్-కొత్తపల్లి పూర్తి లైన్ అందుబాటులోకి వస్తే వేములవాడ, కొండగట్టు, భీమేశ్వరాలయం, కోటిలింగేశ్వర స్వామి వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలకు డైరెక్ట్ కనెక్టివిటీ లభిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Recommended image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Recommended image3
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?
Related Stories
Recommended image1
EPFO New Rules 2026: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి జాక్‌పాట్.. ఈపీఎఫ్‌ఓ 5 కొత్త రూల్స్ ఇవే
Recommended image2
Most Liveable Cities 2026: వరల్డ్ బెస్ట్ సిటీ ఏదో తెలుసా? ఇండియా, పాకిస్థాన్‌ నగరాల ర్యాంకులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved