MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైద‌రాబాద్‌కు నార్త్‌లో మ‌రో మోకిలా ర‌డీ అవుతోంది.. అభివృద్ధికి పుష్క‌ల‌మైన అవ‌కాశాలు

హైద‌రాబాద్‌కు నార్త్‌లో మ‌రో మోకిలా ర‌డీ అవుతోంది.. అభివృద్ధికి పుష్క‌ల‌మైన అవ‌కాశాలు

Hyderabad: ఒకప్పుడు హైదరాబాద్‌కి దూరంగా ఉన్న చిన్న గ్రామాలుగా కనిపించిన ప్రాంతాలు ఇప్పుడు భారీ రెసిడెన్షియల్ హబ్‌లుగా మారుతున్నాయి. దీనికి మోకిలా మంచి ఉదాహరణ. ఇదే తరహాలో భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న మ‌రో ప్రాంతం గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 23 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిన్న గ్రామం నుంచి రియల్ ఎస్టేట్ హబ్‌గా మోకిలా
Image Credit : Gemini AI

చిన్న గ్రామం నుంచి రియల్ ఎస్టేట్ హబ్‌గా మోకిలా

మోకిలా అభివృద్ధిని గమనిస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు నగరానికి దూరంగా ఉన్న ప్రాంతంగా కనిపించిన మోకిలా.. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్‌లో కీలక రెసిడెన్షియల్ లొకేషన్‌గా మారింది. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కేంద్రాలకు కనెక్టివిటీ పెరగడంతో ఇక్కడ నివాస ప్రాజెక్టులకు డిమాండ్ పెరిగింది. మోకిలా నుంచి గచ్చిబౌలి దాదాపు 24 కిలోమీటర్లు, హైటెక్ సిటీ సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నగరానికి కొంత దూరంగా ఉన్నా ఐటీ కారిడార్‌కు కనెక్టివిటీ ఉండటం ఈ ప్రాంతానికి ప్రధాన బలంగా మారింది. దీంతో మొదట భూములు, ప్లాట్లపై ఆసక్తి పెరిగి.. ఆ తర్వాత విల్లాలు, అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం ఊపందుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోకిలా తర్వాత ఆ స్థాయిలో ఎదిగే ప్రాంతం మనోహరాబాద్?
Image Credit : Gemini AI

మోకిలా తర్వాత ఆ స్థాయిలో ఎదిగే ప్రాంతం మనోహరాబాద్?

మోకిలా తరహాలోనే భవిష్యత్తులో అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ప్రాంతంగా మనోహరాబాద్‌ను రియల్ ఎస్టేట్ వర్గాలు చూస్తున్నాయి. మెదక్ జిల్లాలో ఉన్నప్పటికీ హైదరాబాద్‌కు ఇది చాలా చేరువలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్–నిజామాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం మనోహరాబాద్‌కు కీలకమైన భౌగోళిక ప్రయోజనం. మేడ్చల్‌కు మనోహరాబాద్ నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉండగా.. కండ్లకోయ దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే నగరానికి పూర్తిగా దూరంగా ఉన్న ప్రాంతం కాకుండా, హైదరాబాద్ ఉత్తర భాగంతో అనుసంధానమయ్యే లొకేషన్‌గా ఇది కనిపిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉండటం కూడా భవిష్యత్తులో కనెక్టివిటీ పరంగా అదనపు ప్రయోజనంగా మారే అవకాశం ఉంది.

35
ఐటీ, ఫార్మా, వేర్‌హౌసింగ్.. డిమాండ్ పెంచే అంశాలు
Image Credit : Gemini AI

ఐటీ, ఫార్మా, వేర్‌హౌసింగ్.. డిమాండ్ పెంచే అంశాలు

మనోహరాబాద్ చుట్టుపక్కల ఇప్పటికే పలు కీలక కార్యకలాపాలు ఉన్నాయి. శామీర్‌పేట ప్రాంతంలో జీనోమ్ వ్యాలీ ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేక బలం. రాబోయే రోజుల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో ఉత్తర హైదరాబాద్ వైపు ఉద్యోగ అవకాశాలు కూడా పెరగొచ్చు. మరోవైపు మేడ్చల్‌ పరిసరాల్లో ఇంజినీరింగ్ కాలేజీలు, వేర్‌హౌసింగ్ కార్యకలాపాలు, మ్యాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు ఉన్నాయి. కండ్లకోయ ప్రాంతంలో ఐటీ పార్క్ ప్రతిపాదన కూడా ఉంది. ఇవన్నీ కలిసొస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార సంస్థల రాక పెరిగే అవకాశం ఉంటుంది. అలా జరిగితే సహజంగానే రెసిడెన్షియల్ ప్లాట్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.

45
మెట్రో వస్తే కనెక్టివిటీ మరింత మారొచ్చు
Image Credit : Gemini AI

మెట్రో వస్తే కనెక్టివిటీ మరింత మారొచ్చు

మనోహరాబాద్ భవిష్యత్తును ప్రభావితం చేసే మరో అంశం రవాణా సదుపాయాలు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే మేడ్చల్ చుట్టుపక్కల ప్రాంతాలకు నగరంతో ప్రజా రవాణా కనెక్టివిటీ మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనోహరాబాద్‌లో భూముల ధరలు మోకిలాతో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉన్నాయి. అందుకే ముందుగానే పెట్టుబడి పెట్టాలని చూసే వారికి ఈ ప్రాంతం ఆకర్షణీయంగా కనిపిస్తోంది. అయితే మోకిలా స్థాయికి చేరుకోవడానికి రోడ్లు, ప్రజా రవాణా, ఉద్యోగ కేంద్రాలు, కమర్షియల్ అభివృద్ధి, పెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వంటి అంశాలు కీలకం.

55
మొత్తంగా చూస్తే..
Image Credit : Gemini AI

మొత్తంగా చూస్తే..

మొత్తంగా చూస్తే మోకిలా అభివృద్ధి ఒక్కరోజులో జరగలేదు. ఐటీ కారిడార్‌కు చేరువ, మెరుగైన కనెక్టివిటీ, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, ఉద్యోగ అవకాశాలు కలిసి దాన్ని ప్రస్తుత స్థాయికి తీసుకొచ్చాయి. ఇప్పుడు ఉత్తర హైదరాబాద్ వైపు ఇదే తరహా అభివృద్ధికి మనోహరాబాద్‌లో కొన్ని అనుకూల అంశాలు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారి, మేడ్చల్–కండ్లకోయకు సమీపం, జీనోమ్ వ్యాలీ, వేర్‌హౌసింగ్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ కార్యకలాపాలు, భవిష్యత్తు రవాణా ప్రాజెక్టులు ఇవన్నీ కలిసొస్తే మనోహరాబాద్ కూడా రాబోయే సంవత్సరాల్లో కీలక రియల్ ఎస్టేట్ లొకేషన్‌గా ఎదిగే అవకాశం ఉంది. అయితే ఏ ప్రాంతమైనా మోకిలా స్థాయికి చేరుతుందా అనేది భవిష్యత్తు మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల అమలు, ఉద్యోగ కేంద్రాల విస్తరణ, మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటుంది.

గ‌మ‌నిక‌: పైన తెలిపిన విష‌యాల‌ను కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. రియ‌ల్ ఎస్టేట్‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు నిపుణుల సూచ‌న‌లు పాటించ‌డం ఉత్త‌మం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
హైదరాబాద్
తెలంగాణ
స్థిరాస్తి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
జ‌స్ట్ 40 నిమిషాల్లోనే దూసుకెళ్లొచ్చు.. రెండు ప్ర‌ధాన న‌గ‌రాల‌ మ‌ధ్య రూ. 1647 కోట్ల‌తో కొత్త‌ హైవే
Recommended image2
Liquor Shops: మందుబాబులకు షాక్.. మద్యం దుకాణాలు బంద్.. పూర్తి వివరాలు ఇవే
Recommended image3
Flash Flood Alert: తీరం దాటుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Related Stories
Recommended image1
మిరాకిల్ ఎప్పుడైనా జ‌ర‌గొచ్చు.. డీమార్ట్ ప్రారంభించే సమయానికి రాధాకిషన్ వయసు ఎంతో తెలుసా.?
Recommended image2
Bank: ఆదివారం బ్యాంకులు ప‌నిచేయ‌నున్నాయి.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved